Take a fresh look at your lifestyle.

పారామెడికల్‌ ‌సిబ్బందిలో భయాందోళనలు

  • మెల్లగా సెలవులతో జారుకుంటున్న ఉద్యోగులు
  • సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు 

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌కరోనా భయంతో గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులు, ఆయాలు, సెక్యూరిటీగార్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఈ వ్యాధి కారణంగా తాము బలవుతామో.. తద్వారా తమ కుటుంబానికి వ్యాధి సోకుతుందన్న భయం నెలకొంది. దీంతో వీరంతా స్వచ్ఛందంగా సెలవులపై వెళ్తున్నారు. కరోనా వార్డులో పనిచేయలేమంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సులు, ఆయాలు, పారిశుధ్య కార్మికులు అందరూ ఇలా ఇబ్బందులు పడుతున్నాం…. కరోనారోగులకు 24 గంటలూ సేవలందిస్తాం…. తమ జాగ్రత్తలకోసం ఎవరూ చెప్పడంలేదు. ఇంటికెళ్తే భర్త, పిల్లలతో భయం. బయటికొస్తే కాలనీవాసులకు భయపడాల్సి వస్తోంది. ఆస్పత్రిలో నర్సులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులు ప్రభుత్వాన్ని డిమాండుచేస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. డ్యూటీ కోసం ఆస్పత్రికి వచ్చేందుకు తమ భర్తలు బైకులపై తీసుకొస్తున్నారని, వారు తిరిగెళ్తుంటే పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమ భర్తలకు రవా ణా పాసులు ఇవ్వాలని కోరుతున్నారు.

Leave a Reply