Take a fresh look at your lifestyle.

అం‌త్యోదయ అద్భుతమైన సిద్ధాంతం ..

25 సెప్టెంబరు.. పండిత్‌ ‌దయాళ్‌ఉపాధ్యాయ జయంతి

ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసమే భారతదేశంలో రాజకీయ పార్టీలు మనుగడను కొనసాగిస్తూ  ఒక ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్తూ సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకురాలనే లక్ష్యంతో అంత్యోదయ అనే విధానానికి శ్రీకారం చుట్టి,  ఆధునిక భారతదేశ రాజకీయాలు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆలోచించిన  గొప్ప వ్యక్తి ఆయన, అద్భుతమైన  వ్యుహాలను రచిస్తూ విజయతీరాలకు ఏ విధంగా చేరాలో చూపించిన గొప్ప మనిషి  ‘‘  ఏకత్మతా మానవతా వాద ‘‘ సిద్ధాంత సృష్టికర్త పండిత్‌ ‌దయాళ్‌ఉపాధ్యాయ.
1916 వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రం  మధుర జిల్లాలోని నాగ్లాచంద్రబాన్‌ అనే  గ్రామంలో పండిత్‌ ‌దయాళ్‌ఉపాధ్యాయ జన్మించారు .ఆ తర్వాత ఆ గ్రామాన్ని  దీన్‌ద యాళ్‌ ‌దాం గా మార్చడం జరిగింది. ఎనిమిది సంవ త్సరాల వయస్సు ఉన్నపుడే అతని తల్లిదండ్రులు మరణించారు. ఆ తర్వాత వారి బంధువుల  దగ్గర పెరగడం జరిగింది.1937 వ సంవత్సరంలో ఎస్‌. ‌డి. కాలేజీలో చదవుతున్న  సమయంలో ఒక మిత్రుడి ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌  ‌పరిచయం అయింది,ఇలా నిత్యం స్వయంసేవక్‌ ‌గా మారి   అనేక శిక్ష వర్గాలు పూర్తి చేశారు.  ఆ తర్వాత 1942 వ సంవత్సరంలో హెడ్గెవార్‌ ‌తో సమావేశమయ్యి ఆర్‌. ఎస్‌. ఎస్‌.‌ప్రచారక్‌ ‌గా తన జీవితాన్ని ప్రారంభించారు.

1951 వ సంవత్సరంలో శ్యామ్‌ ‌ప్రసాద్‌ ‌ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ ‌ను స్థాపించారు,ఆ తర్వాత  ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 15  సంవత్సరాల కాలానికి ఎన్నికయ్యారు.. 1963 వ సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జాన్‌పూర్‌ ‌నుంచి పోటి చేసి ఓటమి పాలయ్యారు. 1967 వ సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 35 స్థానాలు గెలిచి రెండవ అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనసంఘ్‌ ‌నిలిచింది. ఆ తర్వాత 1967 వ సంవత్సరంలో భారతీయ జనసంఘ్‌  అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

1968 వ సంవత్సరంలో మొగల్‌ ‌సరాయి  జంక్షన్‌ ‌వద్ద పండిత్‌  ‌దయాళ్‌ ఉపాధ్యాయను  గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారు .  దీంతో భారతీయ జనసంఘ్‌ అధ్యక్షులుగా పార్టీ పటిష్టత కోసం  అతను చేసిన కృషి అంతగా బయటకు రాలేదు. ఆ తర్వాత ఉపాధ్యాయ హత్యకు గురైన మొగల్‌ ‌సరాయి  జంక్షన్‌ ‌ను దీన్‌దయాళ్‌  ఉపాధ్యాయ  జంక్షన్‌ ‌గా మార్చడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అతని కుటుంబ సభ్యులు, మరియు ఇతరులు  దయాళ్‌ఉపాధ్యాయ  హత్యకు సంబంధించిన విచారణ చేయ్యాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.
1965 వ సంవత్సరంలో ఏకాత్మత మానవతా వాద సిద్ధాంతాన్ని సృష్టించి   మానవ జాతి ప్రధానంగా 4 రకాలుగా ఉంటుందని  అవి శరీరం, మనస్సు, మేధోసంపత్తి, ఆత్మ అని వివరించారు. అందుకనే ఏకత్మతా మానవతావాదం రకరకాల విభిన్న ఆలోచనను చూపిస్తుందని వివరించారు. 1951 వ సంవత్సరంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్‌  ‌దీన్‌•దయాళ్‌ ఉపాధ్యాయ  ఏకత్మతా మానవతావాదాన్ని  అధికారికంగా స్వీకరించగా ,1980 లో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ కూడా ఏకత్మతా మానవతావాదాన్ని అధికారికంగా స్వీకరించింది.
ముఖ్యంగా అంత్యోదయ అనే విధానాని తీరపైకి తెచ్చి పేద,బడుగు,బలహీన వర్గాలకు ప్రయోజనం చేకురేలా సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రయోజనం పొందాలని ఆయన  వివరించిన సిద్ధాంతం ఆదర్శమైనది. అందుకే 2014 వ సంవత్సరంలో కేంద్రంలో నరేంద్రమోదీ • ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి అంత్యోదయ లక్ష్యంగానే ముందుకు సాగుతున్నందుకే దేశంలో అనేక రకాలు సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రాబ్లమ్స్ ఆఫ్‌ ‌నేషనల్‌ ‌లైఫ్‌, ఇం‌టిగ్రల్‌ ‌హ్యూమానిజం, పొలిటికల్‌ ‌డైరీ, డైరెక్షన్‌ ఆఫ్‌ ‌నేషనల్‌ ‌లైఫ్‌ ‌వంటి అనేక రచనల ద్వారా తన సిద్ధాంతాన్ని, తన లక్ష్యాన్ని, తన ఆశయాన్ని దేశవ్యాప్తం చేసి  నేటి తరం రాజకీయాలకు, నేటి సమాజానికి ఆదర్శవంతంగా నిలిచిన వారిలో పండిత్‌ ‌దయాళ్‌ఉపాధ్యాయ ఒక ప్రముఖమైన వ్యక్తి.
      – కేతూరి శ్రీరామ్‌, ఎమ్‌. ఏ ‌పొలిటికల్‌ ‌సైన్స్ 

Leave a Reply