Take a fresh look at your lifestyle.

Pandamic… సిచ్యుయేషన్లో

దేశంల ఎన్నో ఇంతలు చూసిన కండ్లు
ఇప్పుడు ఎందుకో…
కళతప్పి కలవరపెడుతున్నాయి..
ఒక్క నిమిషం……
……………………
శానా చెప్పాలి..కానీ ఎలా చెప్పాలి..
వాస్తవాలు చేదుగుంటై కదా!
ఐనా చెప్పాల్సిందే…

శాంతి శాంతి అని పదం పాడేటోని
ఇంట్లనే..మస్తు ఆయుధాలు….
అదేందని అడిగితే..
శత్రు దాడినుంచి స్వీయ రక్షణా అని
అదేదో క్రమశిక్షణ అని..సర్దిచెప్పి
కొన్ని ముచ్చట్లను ముందుంచుతరు

ఆరోగ్యం..మహా భాగ్యం..
అందుకే….ముఖం తోముకొనికి
మా  tooth paste మస్తూ …
అయోడిన్‌..‌లెవెల్స్ …‌కి మా ఉప్పే బెస్ట్
‌హార్ట్ ఎటాక్‌ ‌రాకుండా. మా రిఫిండ్‌ ఆయిల్‌
‌బెటర్‌…
‌తనువు తల తల మెరవాలంటే….
ఈ సబ్బు మంచి ఫలితాన్నిస్తుంది…అని
అంబరాన్నంటే ముచ్చట్ల ముందు ఆరోగ్యం
నడి బజారులో వ్యాపార సరుకైంది…

తలనొప్పినుంచి న్యూరో సర్జిన్‌ ‌దాకా
కడుపు నొప్పి నుంచి గుండె నొప్పి దాకా
అల్సర్‌ ‌నుంచి కాన్సర్‌ ‌దాకా
కీలు నొప్పి నుంచి మోకాలి నొప్పిదాకా.
జరం..నుంచి కరోనా దాకా
అన్నింటిపై .. ఎన్నో ఎండ్ల
శాస్త్రీయ పరిశోధనలు నడుమ
ఆవిర్భవించిన మందులు….
పోయే ప్రాణాన్ని కొంత కాలం ఆపాయేమో గానీ..
కాసులు కురిపింన్చుడు మాత్రం. ఆపవు..
ఇప్పుడు..
నాటుగా తయారైన మందు
మాత్రం..వెంటనే అరెస్ట్  అయిపోవాలే!
లేకుంటే..
కాసుల వరదకు ఆనకట్టై కూసుంటే,
ఎన్నో ఏండ్లా ఫార్మసీ వృక్షం కూకటివేళ్లతో కూలిపోదు…!

ఆగుతున్న గుండెలకు ఆనందాన్ని
ఊపిరాడని గొంతులకు శ్వాస ఐన
‘‘ఆనందమయ’’నీ కృషి నాటు మందిపై అమొఘమయ్యా..
అందుకే ఫార్మా రక్కసికి నువ్వంటే గిట్టదయ్య…

ఉత్తి మందని పరిశోధనల నడుమ
కాలయాపన కొందరికి కాసుల వర్షం
ఎన్ని కుటుంబాలకు దు:ఖపు వర్షం..
పీనుగాపై బ్యారాలాడే.. బాపతుగాల్లు
బజార్లలో గల్లికొక్కడు తయారైండ్రు
ఫార్మా కాసులకు కక్కుర్తిపడి మానవత్వ ముసుగులో
కార్పొరేటు, ముల్టిస్పేషలిటి కి రెఫెర్‌ ‌చేసి
అందునా కాడికి దండుకుని దండులా
ఉరిమి సూస్తుండ్రు…..

‘‘నాటు’’ను మనిషి మెదడులో నాటకుండ
కుయుక్తులు, కుమ్మక్కులు ,ఎత్తుకు పై ఎత్తు
పన్నే దుర్మార్గపు దారులు తొందరగా ముసేసే
ఆలోచనలు..ఆలోచించి ఆచరించే
అమాత్యుల..నిర్ణయాలు అత్యవసరం..
ఆలస్యం..
పెను ప్రమాదం…
ఈ  pandamic…. సిచ్యుయేషన్‌ ‌లో…
– నాగరాజు మద్దెల, 6301993211.

Leave a Reply