Take a fresh look at your lifestyle.

పల్లేరు కాయోక్తులు!

పంటలో కలుపు మొక్కలు
పంట కంటే ఏపుగా పెరుగు
కలుపు తీయకుంటే పంటే మరుగు!

కల్లబొల్లి వల్లమాలిన మాటలు
వల్లించిన వాసికెక్కునే!
వడపోత జల్లెట్లో చిక్కిపోవా!

పలుగాకుల మాటలు
వినడానికి వికటకవి ఉక్తులు
వింతగా వల్లిస్తారు స్వామి భక్తులు!

నరడివి బాటల పొదల్లో
నక్కి ఉంటాయి పల్లేర్లు!
నచ్చనోనికి గుచ్చుకుంటాయి!

జనుల మభ్య పెట్టు కుజనులు
మార్గ మధ్యన కంటకాలేదురైన
అన్యుల నిందింతురు నేర్పుగ!

పల్లేరు కాయ మాటలు
ప్రజాదరణ ప్రయోగ మాయలు
ఆనుపానులు చూస్తే అర్థమవును!

–  పి.బక్కారెడ్డి
                               9705315250

Leave a Reply