Take a fresh look at your lifestyle.

నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి చూపేలా…

  • త్వరలోనే ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా కృషి
  • మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిన పల్లెపహాడ్‌ ‌ప్రజాప్రతినిధులు

మల్లన్నసాగర్‌ ‌రిజర్వాయర్‌తో ముంపునకు గురైన నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి మార్గాలను చూపేలా త్వరలోనే ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా కృషి చేస్తున్నామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలోని పల్టెపహాడ్‌(‌ముంపు గ్రామం)కు చెందినప్రస్తుత సర్పంచ్‌ ‌గోగులోత్‌ ‌రజిత, మాజీ  సర్పంచ్‌ ‌కీసర సంతోష- మల్లేశం, వార్డు మెంబర్లు, సుమారు 200 మంది బిజెపికి రాజీనామా చేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీష్‌రావు సమక్షంలో సిద్ధిపేటలోని ఆయన స్వగృహాంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. బిజెపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన ప్రజాప్రతినిధులు, ప్రజలు సిఎం కేసీఆర్‌పై నమ్మకంతో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నామనీ, రానున్న ఉప ఎన్నికల్లో తమ వోట్లన్నీ  టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థికే వేస్తామనీ ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..సిఎం కేసీఆర్‌ ‌ముంపు గ్రామ ప్రజల పట్ల సానుభూతితో పాజిటివ్‌గా ఉంటారనీ, గజ్వేల్‌ ‌కొండ పోచమ్మ సాగర్‌ ‌ముంపు బాధితుల పట్ల ఎలా  ఉన్నారో.. మల్లన్నసాగర్‌ ‌ముంపు బాధితులతో అదే తరహాలో ఉంటారన్నారు.  పల్లెపహాడ్‌ ‌గ్రామం ఆ రోజూ మల్లన్నసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌కోసం భూములిచ్చి ముందు కొచ్చినట్లుగానే ఇవాళ కూడా ముందు వరుసలో నిలబడి అందరికీ మార్గదర్శకంగా నిలబడ్డారన్నారు.   దేశంలో ఎక్కడా లేని విధంగా ముంపునకు గురయ్యే బాధిత నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌అం‌డ్‌ఆర్‌ ‌కాలనీ నిర్మించి ఇస్తున్నామనీ,  ప్రత్యేకించి మల్లన్నసాగర్‌ ‌ముంపు నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ • ‌నియోజకవర్గంలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు కట్టి ఇస్తున్నామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.  ఇప్పటికే  కావేరి, ప్రసాద్‌ ‌సీడ్‌ ‌వంటి పలు కంపెనీలు వచ్చాయని, సీఎం కేసీఆర్‌ ‌నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌ ఆనుకుని ఆర్‌అం‌డ్‌ ఆర్‌ ‌కాలనీని సకల సౌకర్యాలతో నెలకొల్పడం జరిగిందని తెలిపారు. గతంలో నిర్మించిన ఆర్‌అం‌డ్‌ఆర్‌ ‌కాలనీలకు వసతులు కూడా సరిగ్గా లేవనీ, కానీ సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్‌అం‌డ్‌ఆర్‌- ‌పునరావాస కాలనీ పునర్నిర్మాణం చేసే దిశగా కృషి చేస్తుందన్నారు. సిఎం కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉన్నదని, మా సమస్యల్ని పరిష్కరించేది ఒక్క టిఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై,  కేసీఆర్‌పై నమ్మకం ఉన్నదని పల్లె పహాడ్‌ ‌గ్రామస్తులు పేర్కొంటున్నారు. గతంలో బిజెపి నాయకులు రెచ్చగొట్టి ముంపునకు గురయ్యే ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, అప్పుడు ఎన్నికల ముందు వచ్చినోళ్లే.. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు వచ్చిన వాళ్లు ఒక్కటేననీ, ఇలా ఎన్నికల ముందు వచ్చే వారిపై మాకు విశ్వాసం లేదని ముంపు గ్రామ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు.

Leave a Reply