Take a fresh look at your lifestyle.

పల్లెప్రగతి ద్వారా గ్రామాల స్వరూపం మారింది రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

సమావేశంలో మాట్లాడుతున్న  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల స్వరూపం మారిపోయిదని , మరింత బాగు చేసుకోవాల ని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండల సర్వసభ్య సమావేశం రోటరీనగర్‌ ఎం‌పిడివో కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృధ్ది చేసుకోవాల్సిన బాద్యతే మనదేనని, అందుకే ప్రతి గ్రామానికి ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తుందన్నారు. గ్రామాల్లో ఇంకుడుగుంతలు కచ్చితంగా నిర్మించాలని, ఇళ్లల్లో వాడుకునే నీరు నిల్వ లేకుండా ఇంటింటికి ఇంకుడుగుంతలు నిర్మించాలన్నా రు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటుకు రూ. 12.50లక్షల మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. లేని గ్రామాల్లో తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామాల్లో డంపింగ్‌యార్డులో షెడ్‌ ‌నిర్మాణం కోసం రూ. 2.50 లక్షలు ఇస్తున్నామని చెప్పారు.

ఎవరితై ఆయా గ్రామాల్లో పనులు చేసుకోక పోతే మీరు పూర్తిగా వెనుకబడిపోతారని గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఉండి తీరాలని, స్థలసమస్య ఉంటే తనకు తెలపాలన్నారు.  ఇంకా ట్రాక్టర్‌ ‌కొనుగోలు చేయని గ్రామాలు తక్షణమే కొనాలని, ఏవైనా సమస్యలుంటే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతానని చెప్పారు. జిల్లాలో నిర్వహించిన పల్లెప్రగతిలో గ్రామాల అభివృధ్ది వరుసలో 10వ స్థానంలో ఉన్నామని,వచ్చే పల్లెప్రగతి నాటికి రఘునాధపాలెం మండలం జిల్లాలో మొదటిస్తానంలోకి రావాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వేసవికాలంలో తాగునీటి సమస్యలు రాకుండా నీటివనరులను ఇపుడే గుర్తించాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి  ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలోని చాలా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం జరిగిందన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు,ఉపసర్పంచ్‌లు వివాదాలకు,పట్టుదలకు పోవద్దని, తద్వారా గ్రామాల అబివృధ్దికి అవరోధం ఏర్పడుతుందని చెప్పారు. సిడిపి నిధుల నుండి మంజూరుచేసిన 72 రోడ్లు ఇంకా పూర్తిచేసుకోలేకపోయారని, కేవలం 22 రోడ్లు మాత్రమే పూర్తిచేసారని లక్ష్యం లేకుండా పనిచేయకండని అన్నా రు. సర్వసభ్య సమావేశం పూర్తి రోజు నిర్వహించాలని, ప్రతి ఒక్కరు హాజరుకావాలని, అధికారులు గైర్హాజరు అయితే సహించమని హెచ్చరించారు. పరిపాలన సౌల భ్యం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని, మంజూరు చేసుకున్న పనులు పూర్తిచేసుకోలేకపోతే ఆ వైఫల్యం మీదేనన్నారు. మంజూరు అయిన భవనాలు కట్టుకోకపోవడం మీ అసమర్దతనేనన్నారు. గ్రామాల్లో అభివృధ్ది పనులకు శంకుస్తాపన చేసి వదిలేస్తున్నారని, ఇక నుండి అభివృధ్దిపనులకు శంకుస్తాపనలకు రాను,కేవలం ప్రారంభోత్సవాలకు మాత్రమే వస్తానని మంత్రి స్పష్టం చేసారు. గ్రామాల అభివృధ్దికోసం ఇంకా ఏం చేయాలో స్తానికంగా ఉన్న పెద్దలు,మాజీ ప్రజా ప్రతినిధులు సలహాలు కూడా తీసుకోండని, ప్రజలను భాగస్వాము లు చేయాలని అన్నారు. ఈ దఫా మంచిగా పనులు చేయాలని, ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయి మళ్లీ మీరే ఎన్నిక అవుతారని ప్రజాప్రతిని ధులను ఉద్దేశించి చెప్పారు. ఎంపిడివో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply