Take a fresh look at your lifestyle.

పల్లె ప్రగతి

ఇక పల్లె ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. భారతదేశ జనాభాలో నేటికీ ఎక్కువ శాతం నివసిస్తున్నది పల్లెల్లోనే కావడంతో పల్లెలను బాగుపర్చాలన్న లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తున్నది.  గత ప్రభుత్వాలన్నీ  చాలా వరకు పల్లెలను పట్టించుకోవడం మానివేశాయి. ఇప్పటివరకు ఏదైనా పల్లె ప్రగతిని సాధించిందంటే ఆయా గ్రామ ప్రజలు సంయుక్తంగా ఆభివృద్దిపర్చుకున్నదే. ఇవ్వాళ ప్రపంచాన్ని గడగడలాడించిన కొరోనా వైరస్‌ ‌నేటికీ గ్రామాల్లోకి పాకలేదంటే గ్రామాలు ఎంత సురక్షితంగా  ఉన్నాయన్నది అర్థమవుతున్నది. సౌకర్యాలు తక్కువే  ఉన్నప్పటికీ పట్టణాల్లో ఉన్నంత విచ్చలవిడితనం పల్లెల్లో ఉండక పోవడంకూడా నేటికి పల్లెలు సాధించిన ప్రగతి అని కూడా చెప్పుకోవచ్చు.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంలో తీసుకొచ్చిన అనేక మార్పుల ఫలితంగా పల్లెలన్నీ దాదాపుగా పచ్చదనంతో పరవశించిపోతున్నాయి. అయితే ఇది కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిడవిల్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. నిరంతరం కాలుష్య మయమవుతున్న నగరాల్లోనే పచ్చదనం కోసం కృషిచేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పల్లెలను ఆకుపచ్చ తోరణాలుగా మార్చాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. గ్రామానికి కావాల్సిన కనీస అవసరాలను సమకూర్చే దిశలో పథకాలను రూపొందిస్తున్నది. ప్రధానంగా నేటికీ చాలా గ్రామాల్లో మురికి కాల్వల నిర్మాణం కనిపించదు. దానివల్ల రోడ్లపై నీరు నిలిచి క్రిమికీటకాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఇకముందు అలాంటి పరిస్థితి లేకుండా కాల్వల నిర్మాణం, వైకుంఠ ధామాలు, డంపు యార్డుల ఏర్పాటు, అంతర్గత రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టే విధంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. అంతేకాకుండా పాఠశాలల్లో కనీస అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలల మరమ్మతు లాంటివి మరికొన్ని. అయితే వర్షాకాలం ప్రారంభకావడంతో ఎలాంటి వ్యాధులు సోకకుండా ఈ పల్లె ప్రజలను కాపాడుకోవాల్సిన బాద్యతను ప్రభుత్వం గుర్తించింది.

పల్లెను నిత్యం పరిశుభ్రంగా ఉంచే విదంగా సంబందిత అధికారులు పర్యవేక్షించే విధంగా  ప్రభుత్వం ఆదేశించింది.  పరిశుభ్రమంటే మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఇతర ప్రజాప్రతనిధులు చీపురు, తట్ట పట్టుకుని వీధులు ఊడ్చినట్లు ఫోటోలు దిగి పేపర్లకెక్కడంకాదు, అందుకు బాద్యులైనవారితో ఆ పనులు చేయించడంద్వారా పల్లెను అందంగా తీర్చిదిద్దాలని సూచించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ , ‌తాను స్వయంగా గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి పనులను పర్యవేక్షిస్తానంటున్నారు. పల్లెల్లో మరింత సమర్థవంత పాలన సాగించేందుకు ఇప్పటికే పంచాయితీరాజ్‌ ‌శాఖలోని ఖాళీలన్నిటినీ ప్రభుత్వం భర్తీచేసింది.  గ్రామ వికాసం కోసం ప్రజల భాగస్వామ్యంతో నాలుగు రకాల స్టాండింగ్‌ ‌కమిటీలను ఏర్పాటు చేసింది. వర్కస్ ‌కమిటీ, శానిటేషన్‌ ‌కమిటి, స్ట్రీట్‌, ‌గ్రీన్‌ ‌కవర్‌ ‌కమిటీల్లో పదిహేనుమంది చొప్పున సభ్యులున్నారు. వీరందరినీ క్రీయాశీలంచేస్తే  పల్లెలు సత్వర అభివృద్ధిచెందకపోవు. గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రామాలు చిన్నవిగా ఉన్నాయి. పర్యవేక్షణ కూడా సులభతరం అవనుంది. కావాల్సిన నిధులు, విస్తృత అధికారాలు, అమలు పర్చే అధికారులు, స్పష్టమైన విధానాలున్నప్పుడు పల్లెలు బాగుపడి తీరాల్సిందేనంటారు సిఎం కెసిఆర్‌. అం‌దుకు రాష్ట్రప్రభుత్వం ప్రతీఏటా పదివేల కోట్ల రూపాయలను గ్రామాలాభివృద్దికోసం కేటాయిస్తున్నది.  వ్యవసాయం, ఉపాధి అవకాశాలను ఇక్కడే కల్పించుకోవాల్సిన అవసరముందంటారాయన.  వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు, గ్రామీణ ప్రాంతంల్లో వసతుల కల్పనకు, అవసరమయిన  పనులు చేసుకోవడానికి  కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మహత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యూహాత్మకంగా సద్వినియోగ పర్చుకోవాల్సిన అవసరముందంటారు కెసిఆర్‌. ‌గ్రామాలు తద్వారా పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. ప్లానింగ్‌ ఆఫ్‌ ‌టౌన్‌, ‌ప్లానింగ్‌ ఆఫ్‌ ‌విలేజ్‌ అం‌టే ప్లానింగ్‌ ఆప్‌ ‌స్టేట్‌ అన్నట్లే.  స్థానిక వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాలవారీగా తయారుచేసే ప్రణాళికలు జిల్లా పొగ్రెస్‌ ‌కార్డుగా రూపొందుతుంది. ఈ పోగ్రెస్‌ ‌కార్డు ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతాయి.

ముఖ్యంగా వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చేదిశగా ప్రగతి ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నారు.  ప్రతీ నియోజకవర్గానికి వెయ్యి కల్లాల చొప్పున మొత్తం లక్ష కల్లాలను ఈ ఏడాదిలోగా నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకుగాను ప్రభుత్వం 750 కోట్ల నిధులను కేటాయిస్తోంది.  కొరోనా కారణంగా మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలుచేసింది. ఇప్పుడు నియంత్రిత సాగుతో ఈ రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంచేస్తోంది. నియంత్రిత సాగులో పంటలను కొనుగోలుకు ప్రభుత్వమే మంచి అవకాశం కలిగించే ఆలోచన లేకపోలేదు. వ్యవసాయ భూమిని చదును చేసుకునే పనులు, పంటచేలకు పశువులు రాకుండా ట్రెంచ్‌ ‌నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, వర్మి కంపోస్టు ఎరువు తయారీ, గొర్రెలు, బర్రెలకు షెడ్ల నిర్మాణం, పాడుబడిన బావుల పూడ్చివేత, మంచినీటి బావుల్లో పూడికతీత పనులు తదితర ప్రజోపయోఞగ పనులను ‘నరేగా’ నిధులతో చేపట్టడంద్వారా పల్లెలను ప్రగతిపథంలో నడిపించాలని  ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది .

Leave a Reply