Take a fresh look at your lifestyle.

సమన్వయంతో పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

పల్లె ప్రగతి కార్యక్రమంలో  ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా పరిషత్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌గండ్ర జ్యోతి తెలిపారు. గురువారం శాయంపేటలోని మార్కండేయ దేవాలయం వద్ద గల ఫంక్షన్‌ ‌హాల్‌లో పల్లె ప్రగతి, ఉపాధి హామీ పనులపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టుగా పని చేయాలని,  అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్రంలో  జిల్లా ముందు వరుసలో ఉండేలా పనులు జరగాలన్నారు. పల్లె ప్రగతి పనులు దసరా కల్లా పూర్తి చేసి శభాష్‌ అనిపించుకోవాలని తెలిపారు. గతంలో ఏ  ముఖ్యమంత్రి ఇన్ని నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించలేదన్నారు. కలెక్టర్‌ ‌హరిత మాట్లాడుతూ శాయంపేట మండలంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులు వేగవంతం కావాలని అన్నారు. గ్రామాలలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి మండలాన్ని ముందుకు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి కాని యెడల అలసత్వంగా వ్యవహరించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డంపింగ్‌ ‌యార్డ్, ‌వైకుంఠ దామాలు, మరుగుదొడ్లు, విలేజ్‌ ‌పార్క్ ‌పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రామ సర్పంచ్‌, ‌గ్రామ పంచాయతీ కార్యదర్శులు కలసి పని చేసి పనులు త్వరితగతిన జరిగే విధంగా చూడాలన్నారు.

పంచాయతీలకు ప్రభుత్వం నుండి ప్రతి నెల నిధులు మంజూరు అవుతున్నా పనులు జరగడంలో జాప్యం జరుగుతుందని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు. మళ్ళీ వచ్చేనెల ఈ మండలానికి పనుల పరిశీలన కోసం వస్తానని అప్పటి వరకు పనులు పూర్తి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో  డిఆర్‌డిఓ సంపత్‌ ‌రావు, డిపిఓ చంద్రమౌళి, డిఎల్‌పిఓ కల్పన, డిప్యూటీ సీఈఓ సుధారాణి, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply