Take a fresh look at your lifestyle.

తల్లిపాలు తాగి..! రొమ్ముగుద్దే రకం ఈటెలది

  • అసైన్డ్,‌ దేవాలయ భూములు ఎలా కొంటారు
  • ఉద్యమ పార్టీకి ద్రోహం చేయడం ఆయనకే చెల్లింది
  • కెసిఆర్‌ ‌తరవాత అన్ని ఉన్నత పదువులు అనుభవించారు
  • కులాల పేరుతో చిచ్చు పెడితే ప్రజలు నమ్మరు
  • ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల మిద గౌరవం
  • ఈటెల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ పల్లా రాజేశ్వర రెడ్డి

బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు, అసైన్డ్ ‌భూములను ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన వి•డియా సమక్షంలో.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. వచ్చే పది రోజుల్లో బీజేపీలో ఈటల కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు. ఈటల ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్‌ ‌వద్దన్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలకు పాల్పడుతున్న బీజేపీలో చేరే ముందు ఒకసారి ప్రశ్నించాలని ఈటలకు పల్లా సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందన్నారు. ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ప్రథకం కేసీఆర్‌ ‌మదిలో నుంచి పుట్టిందేనన్నారు. కొరోనా రివ్యూలో తాను లేకుండా సీఎం ఒక్కరే చేశారంటూ ఈటల చేసిన ఆరోపణలు అవాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిరంతరం ముఖ్యమంత్రి మానిటరింగ్‌ ‌చేస్తూ ఈటలకు ఇబ్బంది కాకుండా చూశారని పల్లా తెలిపారు.

వి•రు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అధికారులను ఎలా ఇబ్బందులకు గురి చేశారో వారికే తెలుసన్నారు. వి•రు మంత్రిగా చేసిన శాఖపై మికు కనీస అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. కులాల మధ్య కుంపట్లు పెట్టే ఆలోచన మానుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో వి•కు దక్కినన్ని పదవులు ఎవరికీ దక్కలేదని ఈటలను ఉద్దేశించి పల్లా వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్‌ ‌వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ‌నేతలు కౌంటర్‌ ఇచ్చారు. ఈటల తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకమని వ్యాఖ్యానించారు. కన్నతల్లిలాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమ ఎజెండా రూపొందించింది కేసీఆర్‌. ‌నాయకత్వ లక్షణాలు లేకున్నా ఈటలను కేసీఆర్‌ అక్కున చేర్చుకున్నారు. ఈటలకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడేమో నియంతా? అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన భూములను ఈటల ఎలా కొంటారు?. అనామకుడి ఫిర్యాదుపై సీఎం స్పందించారంటే అది ప్రజాస్వామ్యం గొప్ప.

ఈటలకు ఆత్మగౌరవంపై కాదు.. ఆస్తులపై గౌరవం ఉంది. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆత్మగౌరవ నినాదం. అధికారులను వాడుకుని వారిపైనే నిందలు మోపుతున్నారని పల్లా నిప్పులు చెరిగారు. ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల రాజేందర్‌ ‌ప్రయత్నాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఢిల్లీలో ఉన్నవాళ్లు కూడా ఈటలను కాపాడలేరన్నారు. ప్రగతి భవన్‌ ‌లో అడుగుపెట్ట నివ్వలేదంటూ ఈటల దిగజారుడు మాటలు బడుగు బలహీన వర్గాలు విశ్వసించరని బాలరాజు అన్నారు.

Leave a Reply