Take a fresh look at your lifestyle.

‌ప్రక్కసీట్లో కోలీగ్‌

‌మాట్లాడక చాలరోజులైంది
ఆన్‌లైన్‌లో ఛాటింగ్‌కు వెళ్ళాలి

నాకు పాపపుట్టింది
ఇప్పుడు
నాకు ఇద్దరు అమ్మలు

పిల్లల గుంపు
మాపాప నాయకత్వం
అచ్ఛంగా తండ్రి లక్షణాలు

చిన్నప్పుడు నేనుకోరినపాట
మళ్ళీ వస్తుంది
రేడియోసౌండ్‌ ‌పెంచాలి

బాయికాడ నాయినపెట్టిన చెట్టు
ఫలాలు తింటున్నాము
మేము, మా పిల్లలు..
– సురేష్‌ ‌కాలేరు, భువనగరి

Leave a Reply