Take a fresh look at your lifestyle.

తిరుమలలో అన్యమత ప్రచారం అంతా ఉత్తిదే

  • అలాంటి అవకాశాలు లేవన్న రమణదీక్షితులు
  • వంశపారంపర్య హక్కులు పునరుద్దరణపై జగన్‌కు కృతజ్ఞతలు
  • సిఎం జగన్‌తో భేటీ అయిన తిరుమల ప్రధానార్చకులు దీక్షితులు

తిరుమలలో అన్యమత ప్రచారం జరిగే ప్రసక్తే లేదని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పష్టం చేశారు. దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, ధూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు.  టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మంగళవారం సీఎం జగన్‌ను కలిశారు. ఈ మేరకు టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున సీఎం వైఎస్‌ ‌జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, సీఎం దీన్ని పునరుద్ధరించారన్నారు. వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణను సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌రద్దు చేశారని రమణ దీక్షితులు తెలిపారు.

 

సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని కోరారు. చెట్టుకి పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమని, టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివేనని అన్నారు. ఎవరు రాజకీయాల్లో ఉన్నా విమర్శ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగదని, వైఎస్సార్‌ ‌హయాంలో కూడా ఇలానే దుష్పచ్రారం చేశారని టీడీపీ ఆరోపణలను ఖండించారు. సీఎం జగన్‌పై టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. వేల సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని.. ఈ మధ్య దానికి అడ్డంకులు ఏర్పడగా జగన్‌ ‌దానిని పునరుద్ధరించినందుకు టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

 

ప్రతి పాలకుడిలో కూడా విష్ణు అంశ ఉంటుందని.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్‌కు సూచించారు. సనాతన ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు జగన్‌ ‌విష్ణుమూర్తిలా ధర్మాన్ని పునరుద్ధరించారని కొనియాడారు. జగన్‌ ‌మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని ఆకాంక్షించారు. దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని సీఎంను కోరామని పేర్కొన్నారు. మిరాశీ హక్కుల కోసం చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు సౌందర్యరాజన్‌ ‌కూడా పోరాడారని రమణ దీక్షితులు గుర్తుచేశారు.

 

మిరాశీ హక్కు రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ రాజులు ఎన్నో భూములు, ఆభరణాలు సమర్పించుకున్నారని.. వాటిని చేసే అర్చకులు ఆకలితో బాధపడకూడదని భూములు సమర్పించుకున్నారని.. దీన్ని రాజకీయం చేయడం కూడా తగదన్నారు. చెట్టుకు పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమన్నారు. టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివే అన్నారు. 

Leave a Reply