Take a fresh look at your lifestyle.

‘‌సిరా’ధార ఆగిపోయింది. ‘‘పె(క)న్ను’’ మూసిన పద్మశ్రీ తుర్లపాటి

“సుదీర్ఘ పాత్రికేయ జీవితంలో తుర్లపాటి ఎన్నో ఉన్నతశిఖరాలు అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ ప్రముఖులు, కళాకారులు, సాహితెవేత్తలు, జాతీయ వాదుల జీవితాలపై పరిశోధనలు చేసి వారి జీవిత చరిత్రలు రాశారు. జీవితంలో కష్టాలూ అనుభవించారు అయినా బేలగా దిగులుపడలేదు. ముఖంలో చిరు నవ్వు మాయలేదు. కూచిపూడి నాట్యకళాకారిణి కృష్ణకుమారి ఆయన జీవిత భాగస్వామి. వారిది ప్రేమ వివాహం. కలకత్తా నగరంలో ఒక సత్కార సభకు వెళుతున్నప్పుడు రైలులో ఆమెతో ఏపడ్డ పరిచయం ప్రేమగా మారి 1959 జూన్‌ 12‌న ఆమెను పెళ్ళి చేసుకున్నారు.”

పాత్రికేయ వృత్తిలో ఏడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, అనేక విషయాలపై విశ్లేషణలు ఆయన సొత్తు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభాధ్యక్షుడనిగా, అనువాద ప్రసంగికునిగా తెలుగునేలకు సుపరిచితులైన తుర్లపాటి కుటుంబరావు ‘‘పెన్నే’’ నిధిగా ప్రసిద్ధికెక్కి, జనవరి పదో తేదీ.. ఆదివారం తెలుగుపత్రికా రాజధానిగా వాసికెక్కిన విజయవాడలో గుండెపోటుకు గురయి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పె(క)న్ను మూయడంతో చిరకాలం సాగిన ‘సిరాధార’ వ్రతం అకస్మాత్తుగా ముగిసింది. ‘‘పద్మశ్రీ’’ అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టు ఆయన. పాత్రికేయునిగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తింపుగా కేంద్రం ప్రభుత్వం 2002లో ఆయనను ప్రతిష్టాత్మక పద్మశ్రీని అందించి గౌరవించింది. 14 ఏళ్ల చిరుప్రాయంలోనే వయస్సులో జర్నలిజంలో అడుగు పెట్టిన ఆయనను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికతో సుదీర్ఘకాలం పెనవేసుకున్న జీవితమాయనది. టంగుటూరి ప్రకాశంపంతులు మొదలు మొత్తం 18మంది ముఖ్యమంత్రులతో ఆయనకలసి నడిచారు. ప్రకాశం పంతులుగారి కార్యదర్శిగా పనిచేసారు. ఆయన ఎక్కని సాహితీ వేదిక లేదు. అధ్యక్షత వహించని సమావేశం లేదు. ఆయన ఉపన్యాస ధోరణికి మెచ్చి ఉపన్య్యాస కేసరి బిరుదు తో గౌరవించారు. దేశ విదేశాల్లో ఇరవైవేల సభల్లో ఉపన్యాసాలు చేసిన తుర్లపాట గిన్నిస్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌సాధించారు. జాతక కథలు, జాతి రత్నాలు, జాతి నిర్మాతలు, మహా నాయకులు, విప్లవ వీరులు, ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం..నా గళం… శ్రీ లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, తొలి తెలుగు ప్రధాని పి. వి. నరసింహరావు’’ లాంటి పుస్తకాలు రాసిన కలం ఆయనది.

ఆయన 14 ఏళ్ల ప్రాయంలో మహత్మా గాంధీ విజయవాడకు వచ్చినప్పుడు ఆటోగ్రాఫ్‌ ‌తీసున్న యువకునిగా గుర్తింపుపొందారు. ఆ వయసులోనే ‘మాతృభూమి’ పత్రికలో ‘‘స్వరాజ్యంలో స్వాతంత్య్రం’’ పేరిట ఆయన తొలివ్యాసం 1947 మార్చి 22న ప్రచురితమైంది. దాంతో వెనకకు చూడలేదు. 1951లో ఆచార్య ఎన్జీ రంగా నిర్వహణలోని ‘‘వాహిని’’ పత్రికలో మొదటిసారిగా ఉప సంపాదకుడిగా చేఇ పాత్రికేయ జీవితానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత చలసాని రామారావు ‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌ ‌విధులు నిర్వర్తించారు. పత్రికల్లో ఆయన రాజకీయ విశ్లేషణలను చూసి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన్ని చెన్నైకి పిలిపించి, తన ప్రజాపత్రికలో సహాయ సంపాదకుని బాధ్యతలు అప్పగించారు. సహాయ సంపాదకునిగానే కాక ఆయన ప్రకాశం పంతులు కార్యదర్శిగా కూడా ద్విపాత్రాభినయం చేశారు. ఆ తరువాత కె ఎల్‌ ఎన్‌ ‌ప్రసాద్‌ ‌యాజమాన్యంలోని ఆంధ్రజ్యోతి లో బాధ్యతలు స్వీకరించారు. అంబేద్కర్‌, ‌నెహ్రూ, రాజాజీ వంటి ప్రముఖ నాయకులను ఇంటర్వ్యూ చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయవాదులు, ప్రముఖ వ్యక్తులు .. ఇలా వేలమంది జీవిత చరిత్రలు లిఖించి తెలుగు సాహిత్యంలో జీవిత చరిత్రల రచయితగా పేరు పొందారు ప్రముఖ జాతీయ నేతల ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేశారు.

వర్తమాన కవిత్వంలో మార్పులను వివరించడంలో ఘనాపాఠి. ఆయనకు ఆయనే సాటి. ఆయన వ్యాసాలు.. వర్తమాన రాజకీయాలకు దర్పణాలు. సుదీర్ఘమైన అనుభవం గడించిన అనితర సాధ్యుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు తుర్లపాటి. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మొదలు నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది ముఖ్యమంత్రులలతో ఆయన పనిచేశారు. సుదీర్ఘ పాత్రికేయ జీవితంలో తుర్లపాటి ఎన్నో ఉన్నతశిఖరాలు అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ ప్రముఖులు, కళాకారులు, సాహితెవేత్తలు, జాతీయ వాదుల జీవితాలపై పరిశోధనలు చేసి వారి జీవిత చరిత్రలు రాశారు. జీవితంలో కష్టాలూ అనుభవించారు అయినా బేలగా దిగులుపడలేదు. ముఖంలో చిరు నవ్వు మాయలేదు. కూచిపూడి నాట్యకళాకారిణి కృష్ణకుమారి ఆయన జీవిత భాగస్వామి. వారిది ప్రేమ వివాహం. కలకత్తా నగరంలో ఒక సత్కార సభకు వెళుతున్నప్పుడు రైలులో ఆమెతో ఏపడ్డ పరిచయం ప్రేమగా మారి 1959 జూన్‌ 12‌న ఆమెను పెళ్ళి చేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో చేరిన మొదటిరోజే పుట్టిన కూతురికి ప్రేమజ్యోతి అని, తరువాత కలిగిన కుమారునికి, తన వివాహ సందర్భంగా సందేశం పంపిన ప్రధాని జవహర్లాల్‌ ‌పేరు పెట్టారు. ఇరవైయేళ్ల జీవన ప్రయాణం సాగిన తరువాత ఆమె 1979లో కేన్సర్‌ ‌వ్యాధితో కన్నుమూశారు. భార్యపట్ల ప్రేమకు గుర్తుగా ఆమె పేరిట ‘‘కృష్ణకళాభారతి’’ సంస్థను నెలకొల్పి ఏటా ప్రముఖ కళామూర్తులను సత్కరించడం ఒక మహత్కార్యమయింది.

padmasree thurlapaati

పాత్రికేయ భీష్ముడిగా ప్రసిద్ధి చెందిన కుటుంబరావు ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌గ్రంథాలయ పరిషత్తు ఛైర్మన్‌ ‌పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రం ప్రభుత్వం 1969లో నేషనల్‌ ‌ఫిల్మ్ అవార్డస్ ‌కమిటీలో సభ్యునిగా తుర్లపాటిని నియమించింది. నేషనల్‌ ‌ఫిల్మ్ అడ్వైజరీ కమిటీలో, సెంట్రల్‌ ‌ఫిల్మ్ ‌సెన్సార్‌ ‌బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యారు. సుమారు మూడు దశాబ్దాల పాటు ఏపీ ఫిల్మ్ ‌ఫ్యాన్స్ అసోసియేషన్‌ ‌ప్రధాన కార్యదర్శి విధులు నిర్వహించారు. 1989లో ముట్నూరి కృష్ణారావు నుంచి ఉత్తమ ఎడిటర్‌ అవార్డు పొందిన కుటుంబరావు, 1990లో ఉత్తమ జీవిత చరిత్రల రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవార్డు అందుకున్నారు. ఉపన్యాస కేసరి బిరుదు వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ ‌పట్టా అందుకున్నారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఆయననును కళాప్రపూర్ణతో గౌరవించింది. 1994లో కాశీనాథుని నాగేశ్వరరావు నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. 1993లో గిన్నిస్‌ ‌బుక్‌ అవార్డు, 1998లో అమెరికా నుంచి వరల్డ్ ‌లైఫ్‌ ‌టైం అచీవ్‌ ‌మెంట్‌ అవార్డు పొందారు. 2002లో పద్మశ్రీ అవార్డు పొందారు. 2008 సంవత్సరానికి ఆంధప్రదేశ్‌ ‌ప్రెస్‌ అకాడెమీ – రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈయనకు నార్ల వెంకటేశ్వరరావు జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చి గౌరవించింది. పాత్రికేయ వృత్తిలో ఆయన మకుటం ఉన్న మహరాజే. సీనియర్‌ ‌పాత్రికేయునిగా, వక్తగా, రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన సేవలు శ్లాఘనీయం. ఆయనకు లభించిన అనేక పురస్కారాలే ఆయన ప్రతిభకు తార్కాణాలు. ఆంధ్రజ్యోతిలో ఆయన సహచరునిగా పనిచేసే అవకాశమేకాక, విజయవాడలో ఒకే వేదికపై ‘‘నార్ల జీవిత పురస్క్జారం’’ అవార్డు అందుకున్న ఆయనతో పాటు, 2008 సంవత్సరం ‘‘బి నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు’’ అందుకున్న అదృష్టంకూడా నాకు కలిగింది.

కలంతోనే కాదు, గళంతోనూ – ఏ వార్త ముక్కని ఎప్పుడూ, ఎలా, ఏ సందర్భంలో వెయ్యాలో తెలిసిన వ్యక్తి. ఎవరినీ ఎప్పుడు నిందించలేదు. ఇది ఆయన విషయ బద్ధతకూ, నిగ్రహానికీ తార్కాణం. ఈయన్ను చూసి పాత్రికేయులెన్నో నేర్చుకోవాలి. పత్రికలలో వార్తలలో వ్యక్తుల గురించి రాయడమేకాదు. ణిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉండడం ఈయన ప్రత్యేకత. పత్రికా విలువలను పరిరక్షించుకుంటూ, వ్యక్తిగత గౌరవం పెంపొందించుకుంబ్టూ జీవితాంతం ఆదర్శవ్యక్తిగా నిలిచారు. కోటంరాజు రామారావు మాదిరే ఈయన కూడా జేబులో ‘‘ రాజీనామ పత్రం’’ పెట్టుకుని తిరుగుతూ ఉండేవారని సహవాసులు చెబుతారు. జీవిత సాఫల్య పురస్కారం అనుకున్నారు. రాజకీయ రంగంలోనేకాదు, చలన చిత్ర జగత్తులో, సాహితీలోకంలో, కళారంగంలో వీరికి అందరూ పరిచుతులే. ఈఇయనా అందరికీ పరిచితులే. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ‘‘నట సామ్రాట్‌’’ ‌బిరుదు నొసంగింది కుటుంబరావు గారే. విజయవాడ నగరమంటే ఈయనకు ఎక్కువ మక్కువ. విజయవాడ పౌరులు లబ్బిపేటలో ఒక వీధికి ‘‘తుర్లపాటి కుటుంబరావు’’ పేరు పెట్టి ఈయనను చిరస్మరణీయులుగా నిలిపారు.
నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply