Take a fresh look at your lifestyle.

విరబూసిన తెలుగు పద్మాలు

(కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ ఆవార్డుల నేపథ్యంలో)
73వ గణతంత్ర దినోత్సవ శుభ ఘడియన భారత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘‘పద్మ’’ ఆవార్డుల ప్రకటించడం, అందులో తెలుగు తేజాలకు పెద్ద పీట వేయడం సంతోషదాయం. దేశ అత్యున్నత పౌర పురస్కారాల జాబితాలో 04 పద్మ విభూషన్‌, 17 ‌మందికి పద్మ భూషన్‌, 107 ‌పద్మశ్రీలు ప్రకటించబడినవి. వీటిలో తెలంగాణకు ఒక పద్మ భూషన్‌, 4 ‌పద్మశ్రీలు, ఆంధ్రప్రదేశ్‌కు 03 పద్మశ్రీ ఆవార్డులు దక్కడం విశేషం.

పద్మభూషణుడు మైక్రోసాఫ్ట్ ‌సత్య నాదెళ్ల
19 ఆగష్టు 1967న నాదెళ్ల ప్రభావతి యుగంధర్‌(ఐఏయస్‌)‌లకు హైదరాబాద్లోజ జన్మించిన సత్య నాదెళ్ల బేగంపేట్‌ ‌హైదరాబాద్‌? ‌పబ్లిక్‌ ‌స్కూల్‌, ‌కర్నాటక మణిపాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీలో బి టెక్‌ ఎలక్ట్రికల్‌ ఇం‌జనీరింగ్‌, అమెరికాలో యం యస్‌ ‌కంప్యూటర్‌ ‌సైన్స్, ‌యంబిఏ పూర్తి చేశారు. సన్‌ ‌మైక్రోసిస్టమ్స్‌లో ఉద్యోగపర్వం ప్రారంభించిన సత్య నాదెళ్ల ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్‌లో 1992లో చేరి పలు హోదాల్లో తన సత్తా చాటుకొని యాజమాన్యపు మెప్పును పొంది 2014లో కంపెనీ అత్యున్నత సిఈఓ, చైర్మన్‌ ‌స్థాయికి ఎదిగారు. సత్య నాదెళ్ల ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ సమాజం టైమ్‌-100, ‌ఫైనాన్సియల్‌ ‌టైమ్స్, ‌ఫార్చూన్‌ ‌మాగజీన్‌, ‌సియన్‌బిసి గ్లోబల్‌ ఇం‌డియన్‌ ‌బిజినెస్‌ ఐకాన్‌ ‌లాంటి పలు పురస్కారాలు అందుకున్నారు. స్వయంకృషి, అసాధారణ ప్రతిభ కలిగిన 54- ఏండ్ల సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ‌సిఈఓగా కంపెనీని 30 వేల కోట్ల డాలర్ల నుంచి 2 లక్షల కోట్లకు చేర్చడంలో సఫలమై కంపెనీ జాతకాన్ని సమూలంగా మార్చి వేశారు. ఇండో-అమెరికన్‌గా సత్య నాదెళ్ల కామర్స్-ఇం‌డస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్‌ అవార్డుకు అర్హత సాధించా.

టీకా యోధులు – కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల
తమిళనాడుకు చెందిన తిరువాళ్లూర్‌ ‌జిల్లా తిరుత్తని గ్రామ వ్యవసాయ కుటుంబంలో 1969లో జన్మించిన కృష్ణ ఎల్ల తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ, బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో  వైజ్ఞానికశాస్త్ర పిజీ పూర్తి చేసి, రోటరీ ఫెల్లోషిప్‌తో హవాయి యూనివర్సిటీలో యంయస్‌ ‌చదివి, యూనివర్సిటీ ఆఫ్‌ ‌విస్కోన్సిన్‌-‌మడిసన్‌లో డాక్టరేట్‌ ‌పట్టా పొందారు. ప్రముఖ ఫార్మా, లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌కంపెనీ ‘బేయర్‌’‌లో ఉద్యోగం చేసిన అనంతరం ఉన్నత విద్య, పరిశోధనల నిమిత్తం అమెరికాకు పయనమయ్యారు. కొంత కాలం తరువాత భార్య సుచిత్ర సలహాతో హైదరాబాద్కుస వచ్చి భారత్‌ ‌బయోటెక్‌ ఇం‌టర్నేషనల్‌ ‌లిమిటెడ్‌ను స్థాపించి, 1996లో తన జీవిత భాగస్వామి సుచిత్రతో కలిసి ‘వ్యాక్సీన్‌ ‌క్యాపిటల్‌ ఆఫ్‌ ‌ది వరల్డ్’‌గా పేరొందిన హైదరాబాద్లో  బయోటెక్‌ ‌నాలెడ్జ్ ‌పార్క్ అయిన ‘జీనోమ్‌ ‌వ్యాలి’ స్థాపనలో తన వంతు బాధ్యతను నిర్వహించారు. 1999లో హెపటైటిస్‌ ‌బి టీకాను తయారు చేసి ? 10/- అతి చవకైన ధరకు 400 మిలియన్‌ ‌డోసులను 65 దేశాలకు అందిస్తూ అందరి దృష్టి ఆకర్షించారు. భారత్‌లో తొలిసారిగా ‘స్వైన్‌ ‌ఫ్లూ’ టీకాలను ప్రవేశ పెట్టిన కృష్ణ ఎల్ల కంపెనీ ద్వారా తొలి ‘జీకా వైరస్‌’ ‌టీకాను తయారు చేసి ప్రపంచానికి అందించారు. కృష్ణ-సుచిత్ర దంపతుల సమిష్టి కృషితో కరోనాను కట్టడి చేసే ‘‘కొవాగ్జీన్‌’’ ‌టీకాను దేశీయ పరిజ్ఞానంతో రూపొందించి అందరి మన్ననలు పొందారు. కృష్ణ-సుచిత్ర ఎల్ల కృషిని గుర్తించిన అంతర్జాతీయ ప్రభుత్వాలు/ప్రభుత్వేతర సంస్థలు జెఆర్‌డి టాటా ఆవార్డు, మరీకో ఇన్నొవేషన్‌ ఆవార్డు, ఏసియా పసిపిక్‌ ‌లీడర్‌షిప్‌ ఆవార్డు, బయో-ఏసియా జీనోమ్‌ ఆవార్డు, హెల్త్‌కేర్‌ ఇం‌డస్ట్రీ ఆవార్డు లాంటి పలు పురస్కారాలు పొందారు. భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థ ద్వారా పిల్లలకు కూడా వేయడానికి ‘నాసల్‌ ‌వ్యాక్సీన్‌ (‌ముక్కులో వేయడానికి టీకా)’ బూస్టర్‌ ‌డోస్‌గా కూడా త్వరలో 60కి పైగా దేశాల్లో అందుబాటులోకి రానున్నది. అతి సాధారణ జీవన విధానాన్ని ఇష్ఠపడే ‘‘కృష్ణ-సుచిత్ర ఎల్ల’’లకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాని ఎంపిక చేయడం హర్షదాయ.

పద్మశ్రీ గరికపాటి – సహస్రావధాన చక్రవర్తి
14 సెప్టెంబర్‌ 1958‌న వెంకట రమణమ్మ- వెంకట సూర్యనారాయణ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా తాడెపల్లిగూడెం మండల బోడపాడు అగ్రహారంలో జన్మించిన గరికపాటి నరసింహరావు కవి, ప్రవచన కర్త, పద్య ధారణ కర్త, అవధాన మహాసహస్రావధాన చక్రవర్తిగా బహుముఖీన ప్రతిభతో తెలుగు లోగిళ్లలో కుటుంబ సభ్యుడిగా మన్ననలు పొందుతున్నారు. దాదాపు 3 దశాబ్దాల పాటు ఉపన్యాసకుడిగా పని చేస్తూ తెలుగు భాష, ఉచ్ఛారణ, వ్యాకరణం, సమకాలీన అంశాల్లో ఎంతో పట్టు సాధించారు. 1996లో 1116 మంది పృచ్ఛకులతో 21 రోజులు అవధానాన్ని నిర్వహించి రికార్డు సాధించారు. పలు టివీ చానళ్ల ద్వారా హిందూ ఆధ్యాత్మిక వేద పురాణ ప్రవచన ప్రసంగాలు చేస్తూ, తెలుగు వారి మనస్సుల్లో సుస్థిర స్థానం దక్కించుకున్నారు. దేశ ఒవిదేశాల్లో అనేక అవధానాలు, ప్రవచనాల ద్వారా విశ్వ తెలుగు ప్రజల నోట్లో నాలుకైనారు. పద్య కవిగా సాగర ఘోష, మన భారతం, భాష్ప గుచ్ఛం, మా అమ్మ లాంటి కవితా సంపుటులు రచించారు. పల్లవి గీతాలు, మహాసహస్రావధానం, ద్వి శతావధానం, ధారధారనం, కవితాకండిక శతావధానం, మౌఖిక సాహిత్య పరిశోధనా గ్రంథం, పిల్లల బొమ్మలు బాలల నిగంటువు, అవధానశతకం, వైకుంఠపాళి లాంటి పలు సాహిత్య రచనలు చేశారు. గరికపాటి ప్రతిభకు ముగ్గులైన పౌరసమాజం గురిజాడ విశిష్ట పురస్కారం, లోకమాన్య ఫౌండేషన్‌ ‌పురస్కారం, రామినేని ఫౌండేషన్‌ అవార్డులు పొందారు. మూఢ నమ్మకాలతో పాటు సాంఘీక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రవచన ప్రచారాలు నిర్వహిస్తూ, నేడు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ స్వీకరించనున్నారు.

పద్మశ్రీ జానకి షావుకారు
12 డిసెంబర్‌ 1931‌న సచీ దేవి- వెంకోజి రావులకు రాజమండ్రిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శంకరమంచి జానకి విద్యాభ్యాసం గౌహతీ యూనివర్సిటీలో సాగింది. సినీ నటిగా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో 450కి పైగా చలన చిత్రాల్లో నటించడమా కాకుండా 3000లకు పైగా నాటకాల్లో పాత్రలు నిర్వహించారు. రేడియో కళాకారుడిగా కూడా సేవలందించిన జానకి 1949లో తొలి సారి ‘‘షావుకారు’’ తెలుగు సినిమాలో కథానాయికగా నటించి, మెప్పించి తన పేరును షావుకారు జానకిగా పేరొందారు. సినీ నటిగా రెండు నంది పురస్కారాలతో పాటు ఫిలిమ్‌ ‌ఫేర్‌ ‌జీవన సాఫల్య, మహానటు సావిత్రి, డయొనారా గోల్డన్‌, ‌నడిగర తిలకం శివాజీ జీవన సాఫల్య, అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య, కృష్ణ దేవరాయ, కలైమమని, తమిళనాడు స్టేట్‌ ‌ఫిలిమ్‌, ‌సైమా జీవన సాఫల్య, కర్నాటక రాజ్యోత్సవ, పురుచ్ఛి తలైవ జయలలిత, శ్రీ రత్న, వాండర్‌ ‌వుమెన్‌ ‌లాంటి పలు అవార్డులు పొంది, నేడు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనారు. 90-ఏండ్లు దాటిన జానకి నేడు కూడా నటిగా వెండి తెరను మెరిపిస్తూనే ఉన్నారు.

  పద్మశ్రీ మొగిలయ్య దర్శనం

image.png
నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో జన్మించిన దర్శనం మొగులయ్య ప్రస్తుతం హైదరాబాద్‌? ‌సింగరేణి మురికి వాడలో నివసిస్తున్నాడు. మెట్ల కిన్నెర కళాకారుడిగా 52 దేశాల ప్రతినిధుల సమక్షంలో 12 మెట్ల కిన్నెర గానం ప్రదర్శించి 8వ తరగతి పాఠ్యాంశాల్లో భాగం అయ్యారు. 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది విశిష్ట పురస్కారం పొందడంతో పాటు నెలకు 10 వేల రూపాయల పింఛను పొందుతూ, నేడు పద్మశ్రీని స్వంతం చేసుకున్నారు. ఊరూరా తిరుగుతూ తెలంగాణ వీరగాథల్ని తన వాయిద్యంతో పండుగల సాయన్న, బండోళ్ల కురుమన్న, పానుగంటి మీరాసాహెబ్‌, ‌వట్టెం రంగనాయకమ్మ, ఎండబెట్ల ఫకీరయ్య గౌడ్‌, ‌వనపర్తి రాజుల కథలను వినసొంపైన హావభావాలతో లయబద్దంగా వినిపించి శ్రోతల ప్రసంశలు పొందారు. 2021లో తొలి సారి భీమ్లా నాయక్‌ ‌సినిమాలో జానపద పాట పాడి ఖ్యాతి గాంచారు. తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా నియమించబడి, కిన్నెర కళకు జీవం పోస్తున్నారు.
పద్మశ్రీ రామచంద్రయ్య సకిని
image.png
డోలు వాయిద్యకారుడిగా దేశ దృష్టిని ఆకర్షించిన ఆదివాసీ సకిని గంగమ్మ- ముసలయ్యల ముద్దు బిడ్డ సకిని రామచంద్రయ్యను పద్మశ్రీ వరించడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు.  కోయదొరల ఇలవేల్పు కథకుడైన మారుమూల అటవీ ప్రాంత పువ్వుగా వికసిం చడంతో తెలంగాణ ప్రజానీకం సంతోష పడుతున్నది. నిరక్షరాస్యుడైన రామచంద్రయ్య కోయభాషలో ఆశువుగా కథలు చెప్పగల నేర్పరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామ 65 ఏండ్ల ముద్దు బిడ్డ కోయ తెగలోని డోలి ఉపకులానికి చెందిన వారుగా తెలుగు ఆచార గీతాలను ఆలపిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా ఉంచుతూ ఎనలేని సేవలను అందిస్తున్నారు. అంతరించి పోతున్న ఆదివాసీ కళకు ఆయువు పోస్తున్న రామచంద్రయ్య తాత ముత్తాతల తరాల నుంచి వస్తున్న కళా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సమ్మక్క సారమ్మ చరిత్ర, పగిడిద్దరాజు, గాడి రాజు, నాగులమ్మా, బాపనమ్మ, గరికామారాజు, ఈరామరాజు, ముసలమ్మ, సదనమ్మ లాంటి ఆదివాసీ యోధుల కథలను గానం చేస్తూ వివరించగల నేర్పరికా రామచంద్రయ్యకు పేరుంది. వనదేవతలు సమ్మక్క సారమ్మ జాతరలో పటం కథ ఆలపించడానికి, డోలు వాయించడానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా రామచంద్రయ్య హాజరవుతున్నాడు. తను నమ్మిన కళను తన కుమారుడు బాబురావుకు కూడా నేర్పిస్తున్న రామచంద్రయ్యను పద్మశ్రీ వరించడం సముచితంగా ఉంది.
    నాదస్వర షేక్‌ అస్సాన్‌ ‌సాహెబ్‌
‌కృష్ణ జిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామానికి చెందిన నాదస్వర విద్వాంసుడు దివంగత షేక్‌ ‌హసన్‌ ‌సాహెబ్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని మరణానంతరం ప్రకటించడం ముదావహం. భద్రాద్రి రాముడి దేవస్థానంలో నాదస్వర విద్వాంసుడిగా పని చేసిన షేక్‌ అస్సాన్‌ 01 ‌జనవరి 1928లో జన్మించి నాదస్వర తియ్యదనాన్ని భక్తులకు రుచి చూపారు. 23 జూన్‌ 2021‌న తుది శ్వాస విడిచిన షేక్‌ అస్సాన్‌ ‌పలు దేవాలయాల్లో నాదస్వర కళాకారుడిగా ప్రదర్శనలు ఇచ్చారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి సన్నిధిలో 1950 నుంచి 1996 వరకు నాదస్వర ఆస్థాన విద్వాంసుడిగా విశిష్ట సేవలు అందించి పదవి విరమణ పొందారు. నాదస్వర ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగిగా తొలి వ్యక్తిగా, మెట్టమ్నెదటి ముస్లిమ్‌గా చరిత్ర సృష్టించారు. నాదస్వరాన్ని శ్వాసించిన షేక్‌ అస్సాన్‌ ‌సాహెబ్‌ ‌శిష్యరికంలో పలువురు నాదస్వరం నేర్చుకొని పలు దేవాలయాల్లో విద్వాంసులుగా, ఉద్యోగులుగా పని చేస్తున్నారు.
కూచిపూడి పద్మజా రెడ్డి గడ్డం
image.png
కూచిపూడి నాట్యకళకు జీవితాన్ని అంకితం చేసిన గడ్డం పద్మజారెడ్డి నిజా మాబాద్‌? ‌జిల్లా జక్రాన్‌పల్లి మండలం కేశపల్లి గ్రామా నికి చెందిన వారు. స్వరా జ్యలక్ష్మి – డా: జివి రెడ్డి దంపతులకు 1967లో జన్మించిన పద్మజారెడ్డి నిజామాబాద్కుమ చెందిన గడ్డం శ్రీనివాసరెడ్డిని వివాహమాడారు. 5-ఏండ్ల చిరుప్రాయం నుంచే కూచిపూడి నాట్యంలో శిక్షణ పొంది దాదాపు 3,000లకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. శోభానాయుడు వద్ద కూచిపూడి మెళకువలు నేర్చుకొని సత్యభామ, రుద్రమదేవిల పాత్రలకు ప్రాణం పోశారు. కాకతీయల అనబడే నవ్య కళారూపాన్ని రూపొందించిన గడ్డం పద్మజారెడ్డి భ్రూణ హత్యలు, జాతీయ సమైక్యత, ఏయిడ్స్ ‌లాంటి అంశాల పట్ల అవగాహన కల్పించడానికి కూచిపూడి కళా మాద్యమాన్ని వినియోగించారు. కూచిపూడి నృత్యరీతికి పద్మజారెడ్డి చేసిన సేవలను గుర్తించిన పౌరసమాజం నృత్య విశారద, కల్కి కళాకార్‌, ‌సంగీత నాటక అకాడమీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ పురస్కారాలను అందుకొని, నేడు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం తెలుగు సమాజానికి గర్వకారణం.
డా।। సుంకర ఆదినారాయణరావు, ప్రజా వైద్యులు
విశాఖపట్నానికి చెందిన 82- ఏండ్ల ప్రముఖ వైద్యులు డాః సుంకర ఆదినారాయణ రావు పోలియో రోగుల పట్ల ఆత్మబంధువుగా పేరు తెచ్చుకొని 3 లక్షలకు పైగా ఆపరేషన్లు చేశారు. భీమవరంలో సుంకర శేషమ్మ-కనకం దంపతులకు జన్మించి అక్కడే పాఠశాల, ఇంటర్‌ ‌విద్య పూర్తి చేసి ఆంధ్ర మెడికల్‌ ‌కళాశాలలో యంబిబియస్‌, అనంతరం యంయస్‌-ఆర్థో చేశారు. అప్పటికే పోలియో రోగుల ఆపరేషన్లలో అపార అనుభవం కలిగిన డాః వాగేశ్వరుడి వద్ద శిష్యరికం చేసి పోలియో శస్త్రచికిత్సలో మెళకువలు నేర్చుకున్నారు. కెజిహెచ్‌ ఆసుపత్రిలో ఆర్పే విభాగాధిపతి, సూపరింటెండెంట్‌, ఆం‌ధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, ‌వైద్య విద్యాశాఖ సంచాలకుడిగా అద్వితీయ సేవలు అందించారు.  దేశవ్యాప్తంగా పలు పోలియో ఆపరేషన్ల శిబిరాలను నిర్వహించి ఖ్యాతిని మూటగట్టుకున్నారు. సుధీర్ఘ అనుభవం గడించిన అనంతరం విశాఖలో ప్రేమ ఆసుపత్రిని ప్రారంభించి పోలియో రోగులకు వరంగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 128 ప్రతిష్టాత్మక పద్మ ఆవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం లభించడం విశేషం. ఇలాంటి పద్మ పురస్కారాలు ఆయారంగాల్లోని ప్రముఖులను గుర్తించి ప్రోత్సహించడం, వారి నుంచి పౌరసమాజం ప్రేరణ పొందడం సహజంగానే జరుగుతుంది. పద్మ పురస్కార తెలుగు రాష్ట్రాల విజేతల్ని మనస్పూర్తిగా అభినందించడం మన కనీస కర్తవ్యంగా భావించాలి.

 – డా।। బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
                      కరీంనగర్‌ – 9949700037

Leave a Reply