Take a fresh look at your lifestyle.

‘‘‌పడమటి సూర్యుడు’’

అలసిన బడలికతో
పొద్దు గూకిందని..
వడి వడిగా అడుగులేస్తుండూ..
ఇంటిమీద బెంగ పడ్డ
పడమటి సూర్యుడు

నక్షత్రాల్ని  బుజ్జగించి
తన వెంటేసుకొని
పశ్చిమ కనుమల
వాకిలి గుమ్మం ముందు
స్వాగతం పలుక
మొఖాన్నికి వెన్నెల
రంగేసుకున్నాడు
కలువల ప్రియుడు.!

పొద్దంతా గగన వీక్షణం
గావించిన అనుభవమేమో..
ఉదయ సంధ్య రాగాలను
మనిషి కష్ట సుఖలతో
అన్వయించుకుంటూ..
మనిషి బతుకు పయనం..
తనలాంటి గమనమేనని..

మబ్బుల్ని తోసుకుంటూ
ఎరుల్ని తెప్పలతో  ఈదుకుంటూ
సాగె మనిషి నిత్య జీవన
సమరమే
ఈ భూమి భ్రమణ పరిభ్రమణల
సదృశ్యమేనంటాడు..!
మనిషిలోని అహంకారం -అసూయ
ఈర్ష్య -రాగ ద్వేషలు కలబోసుకొని
అశాంతి రాతిరి చీకట్ల దుప్పటి
కప్పుకొని.. నిరాశ నీసృహలతో
కొట్టుమిట్టాడకుండా..
నెలవంక! పసిపాప నవ్వుల..
మనిషికి ఆశ దీపాలు
వెలిగించాలని పున్నమి
జాబిలయి ఓదార్పు..
నిస్తానంటుంది!
ఆనంద సాగరంలో ఉప్పొంగకా..
దుఃఖం నిప్పుల కొలిమిలో
కృంగిపోకా.. రెండింటిని
సమన్వయం చేసుకొని
సహజీవనం గావించమని..
కాలం మనిషికే కాదు..
ప్రకృతి ప్రసాదించిన..మా
సూర్య చంద్రులకూడా..
అమావాస్య పౌర్ణమిల
అటుపోట్లు సహజమేనంటూ..
పడమటి కొండలలో
ఓరిగిపోతుండూ..
రేపటి కొత్త ఆశల
పొద్దు పొడుపుకు
మేల్కొలుపు నవుతానంటూ!!

– రవీందర్‌ ‌కొండ, 9848408612
  ఆల్వాల్‌, ‌హైదరాబాద్‌

Leave a Reply