Take a fresh look at your lifestyle.

ప్యాకేజీల ఫలహారం

నిన్నటి దాకా
ఇంట్లో ఉంటేనే బతుకుతమన్నారు
ఇప్పుడేమో బతుకు బండి లాగాలంటే
బయటపడక తప్పదన్నారు
ముప్పు ముంచుకొస్తున్న
తప్పించుక తిరిగేటోడే
గొప్పోడని అంటున్నడు
నూకలు రూకలు నిండుకొని
రేపటికెట్లనె బెంగతో
ఎవరి సావు వారికొదిలి
తాళాలు దీస్తిరి
తరించమంటిరి
ప్యాకేజిల ఫలహారం
ఆకలితో నున్న వారికి
అందనంత దూరమాయే
ప్రాణాలుబోతుంటే
పాశమండి పెట్టెవరకు
శ్వాసకూడదీసుకొంటూ
సావకుంట బతకమనిరి
ఊపిరిబోతుందన్నకూడ
ఉలుకు పలుకు లేకుండా
ఉన్నవాళ్ళకే ఊడ్చి
పెట్టడమే న్యాయమనిరి
రుధిరము స్వేదంబు జేసి
సంపదకు రూపమిస్తే
చావు ఢంక మ్రోగిస్తూ
సంపన్నుల కొమ్ము గాసే
సంస్కరణల పదం బాడె
బడుగు భారతంబు నేడు
కళ్ళముందు కదలివచ్చి
పాలకుల డొల్లతనము
కుల్ల కు ల్ల జూపించెను.
-గన్‌ ‌రెడ్డి ఆది రెడ్డి.

Leave a Reply