Take a fresh look at your lifestyle.

‌ప్రశాంతంగా పుర ఎన్నికలు ఉత్సాహంగా వోటు హక్కును వినియోగించుకున్న వోటర్లు

పాలమూరు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. బుధవారం మహబూబ్‌నగర్‌ ‌పట్టణంలో 49 వార్డులకు గాను 48 వార్డులలో ఎన్నికలను ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఒక వార్డు మాత్రం అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ ఏకగ్రీవం కావడంతో 48 వార్డులలో ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. పుర ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ గట్టి బందోబస్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి ప్రతి పోలింగ్‌ ‌స్టేషన్‌ ‌నుండి వెబ్‌ ‌కాస్టింగ్‌ ‌ద్వారా ఎన్నికల ప్రక్రియను సమీక్షించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా పటిష్ట నిఘాతో ఎన్నికలు జరిగా యి. అలాగే జిల్లా కలెక్టర్‌ ‌రోనాల్డ్ ‌రోస్‌ ‌పోలింగ్‌ ‌స్టేషన్లలో ఓటరుకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకొండా కావలసిన మౌలిక సదుపా యాలతో అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా సమస్యలు రాకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. బుధవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ చలికాలం కావడంతో ముందుగా కొంత మందకొడిగా సాగింది. ఆ తర్వాత క్రమేపీ ఎన్నికల ప్రక్రియ పుంజుకుంది. నాలుగు గంటల సమయానికి పట్టణ పురపాలక ఎన్నికలు శాతం దాదాపు 70 శాతానికి పైగా నమోదయింది.

పట్టణ ప్రజలు మున్సిపల్‌ ఎన్నికలకు చాలా ఆసక్తిగా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. పోలింగ్‌ ‌సరళిని జిల్లా కలెక్టర్‌ ‌రోనాల్డ్ ‌రోస్‌ ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిం చారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్‌ ‌రోనాల్డ్ ‌రోస్‌ ఉదయం ఏడు గంటల సమయం ప్రారంభంలో ఓటు హక్కును వినియోగించు కున్నారు. అలాగే జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం శ్రీనివాస కాలనీలో ఏర్పాటు చేసిన పోలీస్‌ ‌స్టేషన్లో రాష్ట్ర ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌కుటుంబ సమేతంగా ఓటు హక్కును వేయించుకున్నారు. అనంతరం అక్కడే మంత్రి మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అనూహ్యంగా స్థానాలను సాధించుకుంటామని మహబూబ్‌ ‌నగర్‌ ‌మున్సిపాలిటీపై టిఆర్‌ఎస్‌ ‌జండా ఎగరడం ఖాయమన్నారు. పాలమూరు హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు.

 

ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తికమక చేసి ఎన్ని విధాల ప్రయత్నించినా ప్రజలు టిఆర్‌ఎస్‌ ‌వైపే ఉన్నారని మంత్రి అన్నారు. పాలమూరులో ఇప్పటికే తాగునీరు నిరంతర విద్యుత్‌ ‌పట్టణలో సిసి రోడ్లు బైపాస్‌ ‌రోడ్డు తదితర అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తాం అని అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ ‌నుండి  ఉద్యోగం కోసం పాలమూరు వచ్చే విధంగా తయారు చేస్తామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply