Take a fresh look at your lifestyle.

పర్యావరణ కాలుష్య కబంధహస్తాల్లో ఓజోన్‌ ‌పొర రక్షణ బాధ్యత పౌరసమాజం, ప్రభుత్వాలదే.!

(సెప్టెంబర్‌ 16 ఓజోన్‌ ‌పరిరక్షణ దినోత్సవం)  
ధ్వని, వాయు, జల, భూమి కాలుష్యం వలన మానవ మనుగడ రోగాల బారిన పడి ప్రశ్నార్థకం అవుతుంటే, విచ్చలవిడిగా వాడుతున్న వ్యర్థ పదార్థాలు, పారిశ్రామిక  యంత్రాల నుండి వచ్చే పారిశ్రామిక కాలుష్య కారకాలు ఓజోన్‌ ‌పొరకు రంధ్రాలు పడేలా చేసి ఇతరమైన, క్యాన్సర్‌ ,‌కంటి జబ్బుల తో పాటు గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌కు దారితీసే విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి . ఈ నేపథ్యంలో భూమికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ ‌పొర ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను భూమిపైన పడకుండా అడ్డుకొని కాపాడుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 16 ఓజోన్‌ ‌దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.

ఓజోన్‌ ‌పొర అంటే ఏమిటి విశిష్టత:-
ప్రాణవాయువు ఆక్సిజన్‌ ‌యొక్క మరొక రూపమే ఓజోన్‌. ‌భూ వాతావరణాన్ని ఆవరించిన సహజసిద్ధమైన రక్షణ కవచం అయిన ఈ ఓజోన్‌ ‌పొర మూడు ఆక్సిజన్‌ అణువుల సంయోగంతో ఏర్పడుతుంది. దీనిని సాంకేతికంగా 03 అంటారు. భూమిపై గల మొక్కల నుండి వచ్చే ఆక్సిజన్‌ ‌భూమిని ఆవరించి ఉన్న స్ట్రాటోస్ఫియర్‌ అనే పొర లోకి ప్రవేశించినప్పుడు సూర్యుని నుండి అక్కడికి చేరిన అతినీలలోహిత కిరణాల తో కలిసి ఓజోన్‌ ‌గా మారుతుంది. భూమి పై నుండి 15 కిలోమీటర్ల దూరంలో 30 నుండి 35 కిలో మీటర్ల మందంతో ఉండే ఈ పొర అతినీలలోహిత కిరణాలు భూమికి చేరకుండా అడ్డుకొని మరల కాపాడుతుంది.

 ఓజోన్‌ ‌పొర విచ్ఛిన్నం కావడానికి కారకులు ఎవరు?
వ్యక్తుల, శక్తుల, సంస్థల, ప్రభుత్వాల, ఎవరు దీనికి బాధ్యులు ?అని  ప్రశ్నించుకున్నప్పుడు ఆధునికత అభివృద్ధి ముసుగులో పారిశ్రామికీకరణ ,యాంత్రీకరణ  నేపథ్యంలో వంద రకాల వ్యర్థ కాలుష్య కారక పదార్థాల వలన ఓజోన్‌ ‌పొరకె రంధ్రాలు పడుతున్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. ప్రకృతిని జయించే క్రమంలో మానవుని అత్యాశకు పరాకాష్ట. దీనికి ప్రభుత్వాలు సహకరించడం, ప్రత్యామ్నాయాలు వెతక పోవడం, రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్‌ ‌లు ,ఎయిర్‌ ‌కండిషనర్లు, విమానాలలో వాడే ఇంధనం మండినప్పుడు మొదలయ్యే కార్బన్‌ ‌టెట్రా క్లోరైడ్‌, ‌మిథైల్‌ ‌క్లోరోఫామ్‌ అం‌టి క్లోరోఫ్లోరో కార్బన్లు ఈ పొరలో రంధ్రాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు. పెట్రోలు డీజిల్‌ ‌వంటి ఇంధనాలను పరిమితికి మించి వాడడం ద్వారా వెలువడే కార్బన్‌ ‌డయాక్సైడ్‌ ‌కూడా చందా ఓజోన్‌ ‌పొరకు హాని చేస్తున్నది. గ్రీన్‌ ‌హౌస్‌ ఎఫెక్ట్ ‌వల్ల విడుదలయ్యే వాయువులు వలన కొరకు నష్టం జరిగితే పర్యావరణానికి జీవరాశికి భారీ ప్రమాదం ముంచుకొస్తుంది. నీల లోహిత కిరణాల వలన భూమి యొక్క ఉపరితలం వేడెక్కి గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌కు దారితీసి మెలనోమా, కార్సినోమా వంటి చర్మ క్యాన్సర్‌ ‌తో పాటు అధిక రేడియేషన్‌ ‌వల్ల కంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.

ఓజోన్‌ ‌పొర రక్షణకు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కృషి:-
సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు జీవరాశి పైన పడి చర్మ క్యాన్సర్లు భయంకరమైన రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నందున ఓజోన్‌ ‌పొరకు చిల్లులు పడకుండా కాపాడుకోవడం ద్వారా  పర్యావరణాన్ని ,జీవరాశిని కాపాడుకోవలసిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కొన్ని దశాబ్దాల నుంచి మానవ పురోగతి లో భాగంగా కొనసాగుతున్న మానవ అనాలోచిత చర్యల వల్ల ఓజోన్‌ ‌పొర పలుచబడడమే కాకుండా చాలాచోట్ల రంద్రాలు ఏర్పడినవి.

ఈ పరిస్థితిని ఆలోచించిన కొన్ని దేశాలు సరైన నియంత్రణ చర్యలు తీసుకోవడానికి 1987 సెప్టెంబర్‌ 16‌వ తేదీన కెనడాలోని సెయింట్‌ ‌లారెన్స్ ‌నది ద్వీపమైన మాంట్రియల్‌ ‌నగరంలో ‘‘మాంట్రియల్‌ ‌ప్రోటోకాల్‌ ‘‘‌పేరున 24 దేశాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఓజోన్‌ ‌పొరకు రంధ్రాలు కావడానికి కారణమైన రసాయనాల ఉత్పత్తిని నియంత్రించడం ఈ సమావేశం యొక్క ఉద్దేశం. కొన్ని  దేశాలే పాల్గొనడం ,మిగతా ప్రపంచ దేశాలకు ఈ స్పృహ లేని కారణంగా ఓజోన్‌ ‌పొర పరిరక్షణ విజయవంతం కానప్పటికీ ప్రపంచ దేశాలను ఆలోచింప చేసినవి. ఈ నేపథ్యంలో 1994 డిసెంబర్‌ 19 ‌వ తేదీన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తన తీర్మానంలో సెప్టెంబర్‌ 16‌వ తేదీని అంతర్జాతీయ ఓజోన్‌ ‌దినోత్సవంగా జరుపుకోవాలని సూచించింది. ‘‘ఓజోన్‌ ‌పొర పరిరక్షణకు నిరంతర శ్రమ’’ అన్న నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా ఉమ్మడిగా కృషి చేసి ఓజోన్‌ ‌పొర ఏర్పడి రంధ్రాలను మూసి వేయాలని యూ ఎన్‌ ఓ ‌ప్రపంచదేశాలను కోరింది.( 50 ఏళ్ల లోపు)పరిరక్షణకు సంబంధించి వియన్నా కన్వెన్షన్‌ ‌లో జరిగిన తీర్మానాన్ని 18 మార్చ్ 1991‌న నాడు, మాంట్రియల్‌ ‌ప్రోటోకాల్‌ ‌పేరున చేసిన తీర్మానాన్ని 19 జూన్‌ 1992 ‌నాడు భారత దేశము ఆమోదించి అంతర్జాతీయ స్థాయిలో సభ్యదేశంగా కృషి చేస్తున్నది. 1995 సెప్టెంబర్‌ ‌నుండి ఏటా నిర్వహించబడుతున్న ఓజోన్‌ ‌దినోత్సవం దీనికి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కృషిని జూన్‌ 22 2020 ‌న జరిగిన అంతర్జాతీయ సమావేశం ప్రశంసించిన ది. ప్రస్తుతం ప్రపంచంలోని 197 దేశాలు జూన్‌ ‌పరిధిలో సభ్య దేశాలుగా ఓజోన్‌ ‌పొర పరిరక్షణకు కృషి చేస్తున్న వి.

 ఓజోన్‌ ‌పొరను కాపాడుకోవడానికి కొన్ని చర్యలు :-
అన్ని దేశాలలోనూ సాధారణంగా ఆమోదించబడిన 33శాతం అడవులను సంరక్షించడం ద్వారా ఆక్సిజన్‌ అం‌దుబాటులో ఉండి ఓజోన్‌ ‌పొర మందంగా ఏర్పడుతుంది . చెట్లను రక్షించే కార్యక్రమం కొత్త మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టాలి. రిఫ్రిజిరేటర్లు ,ఏసీలు, కూలర్లు ,ఫ్రీజర్‌ ‌లు మండించే ఇంధనాలు విమానాల నుంచి వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్లు కాలుష్య కారకాలు ఓజోన్‌ ‌పొరను నష్టం చేస్తున్నది కనుక వీటి యొక్క వాడకాన్ని తగ్గించాలి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి. యంత్రాల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను అడ్డుకోవడానికి తగు చర్యలు చేపట్టాలి.వాయు కాలుష్యం థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాలు అణు విద్యుత్‌ ‌కేంద్రాలు అడవుల నరికివేత అడవులు కాలడం వలన కూడా ఓజోన్‌ ‌పొర నాశనం అవుతుంది .కనుక ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తి మార్గాలని వెతికి, అడవులు కాలకుండా తగు మార్గాలను అన్వేషించాలి.

ఓజోన్‌ ‌పొరకు రంధ్రాలు కొన్ని పరిణామాలు:-
ఓజోన్‌ ‌పొరకు రంధ్రాలు గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌కు కారణం అవుతున్నందున  క్యాన్సర్లు  ఇంటి వ్యాధులు ఇతర ఇబ్బందులకు కారణం అవుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం గా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 20 నుంచి 30 లక్షల మంది చర్మ క్యాన్సర్‌ ‌బారిన పడుతుంటే ఇందులో 20 శాతానికి పైగా అతినీలలోహిత కిరణాల వల్లనే ఆ రోగాలు సంక్రమిస్తున్న వి. రంధ్రాలు పడిన చోట ఆయా దేశాలలో జీవరాసుల మనుషుల కంటిపాపలు మాడిపోయి రకరకాల రోగాల బారిన పడ్డట్టు తెలుస్తున్నది. ఓజోన్‌ ‌పొరకు రంధ్రాలు ఇలాగే కొనసాగితే క్రమంగా పలచబడి పోతే జరగబోయే దుష్పరిణామాలను ఊహించలేము.

పరిరక్షించుకునే క్రమంలో జల, వాయు, ధ్వని, భూ కాలుష్యం తో పాటు భూమి వేడెక్కడాన్ని, భూ కాలుష్యం వలన ఆహార పదార్థాలు కలుషితం కావడంతో మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఈ సందర్భంలో సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను కూడా అడ్డుకోకపోతే భూగోళం తొందరలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.  కావున అన్ని రకాల కాలుష్యాలు నివారించడంతో పాటు, ఇటు ఓజోన్‌ ‌పొర మందం పెరిగే విధంగా, పడిన రంధ్రాలను  పూరించే విధంగా ప్రపంచ దేశాల, ప్రభుత్వాల, పారిశ్రామికవేత్తల, ప్రజల అండదండలు ఉంటే భూగోళం మీద నివసిస్తున్న జీవరాశి యావత్తు మానవ మనుగడకు పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుంది. సామాన్య ప్రజానీకం లోనూ ,ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ,ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి వారే తగు కట్టడి చేసుకునే ఏర్పాటు జరిగితే, ప్రత్యామ్నాయాలను వెతికితే, సమీప భవిష్యత్తులోనే ఓజోన్‌ ‌పొరను తిరిగి పూర్తిస్థాయిలో రక్షించుకోవచ్చు. ఓజోన్‌ ‌దినోత్సవం సందర్భంగా ఆ స్పృహ అందరిలో కలగాలని ఆశిద్దాం.

vadde mallesam
వడ్డేపల్లి మల్లేశం
9014206412
( వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్‌
ఉపాధ్యాయ ఉద్యమనేత, కవి, రచయిత, అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్‌ ‌జిల్లా సిద్దిపేట)

Leave a Reply