Take a fresh look at your lifestyle.

ఆక్సీజన్‌ అం‌దక ప్రాణాలు గాల్లో..!

“కొరోనా కొత్త వేరియంట్లు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతూ వయోవృద్ధులను, దీర్ఘకాలిక రోగులను మాత్రమే కాకుండా 25 ఏండ్ల లోపు యువతకు కూడా సోకడం పరిస్థితి విషమించిందనడానికి తార్కాణంగా తోస్తున్నది. ఖాళీ ఆక్సీజన్‌ ‌సిలిండర్లు ఆహ్వానం పలుకగా దేశ ప్రజారోగ్యానికి ప్రాణం పోయినంత పని అవుతున్నది. దేశంలో టీకాలు, హాస్పిటల్‌ ‌పడకలు, వెంటిలేటర్లు, ఆక్సీజన్‌ ‌సిలిండర్లు, ఐసియు వసతులు కొరత వలలో చిక్కి వందల వేల ప్రాణాలు ఆగిపోయే దుస్థితి దేశమంతటా తిష్ట వేసింది.”

కొరోనా రెండవ అల కల్లోలానికి ఢిల్లీ, ముంబాయ్‌, ‌లక్నో లాంటి అన్ని నగరాల్లో, ముఖ్యంగా ఉత్తరాది పట్టణాల్లో కోవాడ్‌-19 ‌సోకిందన్న భయం కన్న ప్రాణవాయువు కొరత ప్రాణాలను తోడేస్తున్నది.

ఆక్సీజన్‌ ‌కొరత 4 – 5 రోజులైతే ఓపిక పట్టవచ్చు, కాని గత రెండు వారాలుగా దేశానికి ఊపిరాడక అనేక ప్రాణాలు గాలిలో కలవడం అత్యంత విషాదకరం. కొరోనా కొత్త వేరియంట్లు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతూ వయోవృద్ధులను, దీర్ఘకాలిక రోగులను మాత్రమే కాకుండా 25 ఏండ్ల లోపు యువతకు కూడా సోకడం పరిస్థితి విషమించిందనడానికి తార్కాణంగా తోస్తున్నది. ఖాళీ ఆక్సీజన్‌ ‌సిలిండర్లు ఆహ్వానం పలుకగా దేశ ప్రజారోగ్యానికి ప్రాణం పోయినంత పని అవుతున్నది. దేశంలో టీకాలు, హాస్పిటల్‌ ‌పడకలు, వెంటిలేటర్లు, ఆక్సీజన్‌ ‌సిలిండర్లు, ఐసియు వసతులు కొరత వలలో చిక్కి వందల వేల ప్రాణాలు ఆగిపోయే దుస్థితి దేశమంతటా తిష్ట వేసింది.

కొరోనా తొలి అలను సగర్వంగా ఎదురుకున్నామనే ఆనంద క్షణాలు రెండవ అల సునామీలో కొట్టుకు పోవడంతో అంతర్జాతీయంగా ఇండియా ‘నిషేధిత’ ప్రాంతంగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గాలిలో 21 శాతం ఉన్న ఆక్సీజన్‌, ‌హాస్పిటల్స్ల్లో లిక్విడ్‌ ‌మెడికల్‌ ఆక్సీజన్‌ (‌ద్రవ వైద్య ప్రాణవాయువు) కొరతతో వేల నిండు ప్రాణాలు అదే గాలిలో కలుస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. ఆక్సీమీటరు రీడింగ్‌ ‌చూడాలంటేనే శ్వాస ఆగినంత పని అవుతున్నది. ఆక్సీజన్‌ ‌కొరతకు కారణం ఎవరైనా అధిక సంఖ్యలో కోవిడ్‌-19 ‌రోగులు ప్రాణాలు వదలడం ప్రభుత్వ యంత్రాంగం, వైద్య నిపుణుల వైఫల్యమని చర్చించడానికి సమయం, సందర్భం కాదిది. కోవిడ్‌-19 ‌రోగులకు గంటకు 50 – 80 లీటర్ల (సాధారణ రోగులకు 3 – 10 లీటర్లు సరిపోతుంది) ఆక్సీజన్‌ అవసరం అవుతున్నది.

లిక్విడ్‌ ‌మెడికల్‌ ఆక్సీజన్‌ ‌ప్లాంట్లు మరియు పారిశ్రామిక ఆక్సీజన్‌ ‌సిలిండర్లను బజారులో ఖరీదు చేయడం అనే రెండు మార్గాలు నేడు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. కొరోనా విజృంభనతో ఆక్సీజన్‌ ‌వాడకం దాదాపు 3 రెట్లు పెరగడం, ఉత్పత్తి మాత్రం పెరగక పోవడంతో దేశానికి ఈ దుస్థితి వచ్చి పడిందని వైద్యులు వాపోతున్నారు. ఒక మెడికల్‌ ఆక్సీజన్‌ ‌ప్లాంట్‌ (‌రోజుకు 200 సిలిండర్లు తయారు చేసే) నెలకొల్పటానికి కనీసం 5 కోట్లు ఖర్చు అవసరం అయినా, ప్లాంట్‌ ‌స్థాపనకు 10-12 వారాల సమయం తీసుకొంటున్నదని తేలింది. కొరోనా రెండవ అల తాకిడికి రోజుకు 4 లక్షల కోవిడ్‌-19 ‌కేసులు బయట పడుతున్నాయి.

ప్రభుత్వ ప్రమేయం లేకుండా పౌరసమాజమే కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు విధించే స్థాయికి పరిస్థితులు దిగజారడం, ఒక్కో హాస్పిటల్లో• పదుల మరణాలు ఆక్సీజన్‌ ‌కొరత కారణంగా జరగడం అత్యంత విచారకరం. వైద్య ఆక్సీజన్‌ ‌కొరతతో ప్రాణాలు పోతున్న కారణంగా ప్రభుత్వం మ్నెత్తం ఆక్సీజన్‌ ఉత్పత్తిని హాస్పిటల్స్• ‌వినియోగానికి మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఆగష్టు 2020లో లిక్విడ్‌ ఆక్సీజన్‌ ఉత్పత్తి 5,700 మెట్రిక్‌ ‌టన్నులు ఉత్పత్తి అయ్యేదని, కాని 25 ఏప్రిల్‌ 2021 ‌నాటికి ఉత్పత్తి సామర్థ్యం 8,923 మెట్రిక్‌ ‌టన్నులకు చేరిందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 01 మే వరకు ఆక్సీజన్‌ ఉత్పత్తి 9,250 మెట్రిక్‌ ‌టన్నులకు చేరుతుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా లిక్విడ్‌ ‌మెడిసల్‌ ఆక్సీజన్‌ ‌సరఫరాకు 1,224 క్రయేజనిక్‌ ‌టాంకర్లు మాత్రమే అందుబాటులో ఉండగా, దేశ నలుమూలల సకాలంలో రవాణ చేయడానికి వాహనాల కొరత పెద్ద సమస్యగా నిలుస్తోంది.

సిలిండర్లు, ట్యాంకర్ల కొరతల నడుమ ఇతర బహువిధ ప్రత్యామ్నాయాల కోసం ఆలస్యంగానైనా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తున్నది. రైలు మరియు విమాన మార్గాల ద్వారా ద్రవ ఆక్సీజన్‌ ‌సరఫరాకు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేయడానికి భారతీయ రైల్వే మరియు ఇండియన్‌ ఏయిర్‌ ‌ఫార్స్ ‌సహాయాలకు కూడా తీసుకునే పథక రచనలు చేసి అమలు పరుస్తున్నది. వివిధ రాష్ట్రాలకు లిక్విడ్‌ ‌మెడికల్‌ ఆక్సీజన్‌ ‌సరఫరాలో కూడా కేంద్రం అనాలోచితంగా ప్రవర్తిస్తున్నదని, ఢిల్లీ ప్రభుత్వం 700 మెట్రిక్‌ ‌టన్నులు కోరగా 490 మెట్రిక్‌ ‌టన్నులు కేటాయించడం, యంపీ మరియు మహారాష్ట్రలు కోరిన దాని కన్న అధిక కేటాయింపులు చేయడం సరైన ఆలోచన కాదని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సీజన్‌ ‌డిమాండ్‌ ‌సప్లై గ్యాప్‌ను వెంటనే తగ్గించి, దేశానికి ప్రాణవాయువు అందించి, దేశవాసుల ఊపిరి ఆగకుండా చూడాలని ప్రతి పౌరుడు తలవంచి సవినయంగా కోరుకుంటున్నాడు.

Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037 

Leave a Reply