Take a fresh look at your lifestyle.

యుద్ధ విమానాల్లో ఒడిషా నుంచి ఆక్సిజన్‌..‌

బేగంపేట్‌ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఈటల, సిఎస్‌
ఇదిలావుంటే రాష్ట్రంలో ఆక్సీజన్‌ ‌కొరత నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆక్సిజన్‌ ‌సిలిండర్ల కోసం బేగంపేట ఎయిర్‌ ‌పోర్టు నుంచి ఒడిశాకు యుద్ధ విమానాలను ప్రభుత్వం పంపించింది. యుద్ధవిమానాల్లో రీఫిల్లింగ్‌ ‌కోసం ఆక్సీజన్‌ ‌సిలిండర్లను ప్రభుత్వం పంపించింది. గతేడాది మే- జూన్‌లో రికార్డు స్థాయిలో వాడకం జరిగింది. దాదాపు 175 మెట్రిక్‌ ‌టన్నుల వాడకం జరిగింది. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌తీవ్రతతో రోజుకు 340 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 268 మెట్రిక్‌ ‌టన్నులు మాత్రమే సరఫరా అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 360 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణకు బళ్లారి, ఒడిశా నుండి ఆక్సీజన్‌ ‌దిగుమతికి కేంద్రం అనుమతించనుంది. చాలా దూరం నుంచి ఆక్సిజన్‌ ‌దిగుమతికి రోజుల తరబడి సమయం పడుతున్నది. రీఫిల్లింగ్‌ ‌కోసం ఖాళీ సిలిండెర్లను యుద్ధ విమానాల్లో పంపి.. రీఫిల్లింగ్‌ ‌సిలిండర్లను రోడ్డు మార్గంలో ప్రభుత్వం తీసుకువొస్తున్నది. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టులో సంబంధిత ఏర్పాట్లను శుక్రవారం మంత్రి ఈటల, సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌పర్యవేక్షించారు. వింగ్‌ ‌కమాండర్‌ ‌చైతన్య నిజ్హవాన్‌ల ఆధ్వర్యంలో ఇండియన్‌ ఎయిర్‌ ‌పోర్టుకు చెందిన రెండు సి-17 ఎయిర్‌ ‌క్రాప్ట్‌లు ఇందుకోసం వినియోగించారు. అయితే రాష్ట్రానికి అత్యంత సవి•పంలోని బళ్లారి స్టీల్‌ప్లాంట్‌ ‌నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్‌ ‌టన్నులే. వైజాగ్‌నుంచి దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్‌, ‌పెరంబుదూర్‌, అం‌గుల్‌ ‌నుంచి ఆక్సిజన్‌ ‌తెచ్చుకోవడం అంత తేలిక కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్‌ ‌రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను వినియోగించుకుంటుంది.

Leave a Reply