Take a fresh look at your lifestyle.

జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం

వికారాబాద్‌: ‌వికారాబాద్‌ ‌జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన మామిడి పంటకు తీవ్ర నష్టం చేయగా నవాబ్‌పేట్‌  ‌మండలంలోని మాదిరెడ్డిపల్లి చిట్టిగిద్ద సంబంధించినటువంటి వాగులు పొంగిపొర్లాయి. అదే విధంగా వికారాబాద్‌ ‌మండలంలోని పులిమదిలో కరెంటు స్తంభాలు విరిగిపోయి ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి నేల రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Leave a Reply