Take a fresh look at your lifestyle.

24 గంటల్లో లక్షకు పైగా పాజిటివ్‌ ‌కేసులు

  • ఉధృతంగా కొరోనా సెకండ్‌ ‌వేవ్‌
  • ‌కేంద్రం అప్రమత్తం..అధిక కేసులున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు
  • 11 రాష్ట్రాల మంత్రులతో నేడు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ‌కీలకభేటీ
  • సెకండ్‌ ‌వేవ్‌తో జాగ్రత్తగా ఉండాలి : ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌రణదీప్‌ ‌గులేరియా

భారత్‌లో కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌కల్లోలమే సృష్టిస్తుంది. నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే ఫస్ట్ ‌వేవ్‌ ‌కంటే తీవ్రంగా పరిస్థితి ఉంది. ఫస్ట్ ‌వేవ్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదయినా ఏనాడూ ఒక్క రోజే లక్ష దాటింది లేదు. కానీ, సెకండ్‌ ‌వేవ్‌లో ఒక్క రోజే లక్షకు పైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదు చేసింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కొరోనా బులెటిన్‌ ‌ప్రకారం.. 24 గంటల్లో భారత్‌లో తాజాగా 1,03,558 కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. వైరస్‌ ‌బారిన పడి 478 మంది మృతిచెందారు. అయితే ఇదే సమయంలో 52,847 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇక, మొత్తం కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1,25,89,067కు చేరుకోగా…ఇప్పటి వరకు 1,16,82,136 మంది వైరస్‌ ‌బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,41,830 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా.. కోవిడ్‌తో మృతిచెందినవారి మొత్తం సంఖ్య 1,65,101కు పెరిగింది.. మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కొనసాగుతుంది ఇప్పటి వరకు 7,91,05,163 మందికి టీకా ఇవ్వడం పూర్తయినట్టు కేంద్రం పేర్కొంది. ఇక కొరోనా కేసులు అధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, పంజాబ్‌, ‌చత్తీస్‌గఢ్‌లకు ప్రజారోగ్య నిపుణులు, క్లినికల్స్‌తో కూడిన బృందాలను కేంద్రం తరలించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. పది రాష్ట్రాల్లో  కోవిడ్‌ ‌విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆదివారం సరిగిన సమావేశానికి కాబినేట్‌ ‌కార్యదర్శి, ప్రధాన మంత్రి కార్యాలయం ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి, ఆరోగ్య శాఖ అధికారితో పాటు సీనియర్‌ ‌నేతలందరూ పాల్గొన్నారు. సమావేశానంతరం కేసులు పెరగడానికి మూడు కారణాలను పిఎం కార్యాలయం పేర్కొంది. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు కొరోనాను తీవ్రంగా తీసుకోక పోవడమే కారణంగా తెలిపింది.

కేంద్రం అప్రమత్తం…రాష్ట్రాల మంత్రులతో నేడు హర్షవర్ధన్‌ ‌కీలకభేటీ
దేశవ్యాప్తంగా కొరోనా వైరస్‌ ‌కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌-19 ‌విస్తృత వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌మంగళవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో మహమ్మారి కట్టడిపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశంలో 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. తాజాగా కొవిడ్‌ ‌కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే స్కూళ్లు, విద్యాసంస్ధలను మూసివేశాయి. వైరస్‌ ‌వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు కఠిన నియంత్రణలను అమలు చేస్తున్నాయి. ఇక కొరోనా సెకండ్‌ ‌వేవ్‌తో జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌రణదీప్‌ ‌గులేరియా హెచ్చరించారు. గతంలో చూసిన దాని కంటే ఈ వేవ్‌ ‌ప్రమాదకరమన్నారు. అతి తక్కువ సమయంలో రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదవ్వడాన్ని బట్టి మహమ్మారి విజృంభణ ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. టెస్టింగ్‌, ‌ట్రేసింగ్‌, ‌ట్రాకింగ్‌, ఐసోలేషన్‌ ‌చాలా ముఖ్యమని అని తెలిపారు. ప్రజలు కొరోనా రూల్స్‌ను పాటిస్తూ వ్యాక్సిన్‌ ‌వేయించుకోవాలని సూచించారు. ’కేసులు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది చాలా కలవరపెట్టే విషయం. మన దగ్గర హెర్డ్ ఇమ్మునిటీ ఎంత ఉందనే దాని వి•ద సరైన డేటా కూడా లేదు. ప్రజల్లో అత్యధికులకు వైరస్‌ ‌సోకి ఉండే అవకాశాలు ఎక్కువ. వైరస్‌లో కొత్త రకాలు పుట్టుకొస్తుండటం మంచిది కాదు. భారీ జనాభా ఉన్నందున పెద్ద మొత్తంలో డోసుల ఆవశ్యకత ఉంది. ప్రాధాన్యతల వారీగా వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకు కొరోనా టీకా వి•ద ట్రయల్స్‌ను వేగవంతం చేయాలి. అలాగే ఆర్టీపీసీఆర్‌ ‌టెస్టులను ముమ్మరం చేయాలి’ అని గులేరియా పేర్కొన్నారు.

Leave a Reply