Take a fresh look at your lifestyle.

17 వేలకు పైగా పాజిటివ్ ..! 543 మరణాలు ..

  • మహారాష్ట్రలో మొండికేస్తున్న మహమ్మారి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ భారతదేశంలో 17,265 కరోనా పాజిటివ్ కేసుల్లో ..543 మరణాలు నిర్ధారించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా, 1.65 లక్షల మరణాలు 2.4 మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్ లో సోమవారం అత్యధికంగా 1,553 కేసులు నమోదు అయ్యాయి.ప్రస్తుతం భారత్ లో కేసుల సంఖ్య 17,000 కు పైగా ఉంది. 2546 కేసులు నయమయ్యాయి. దేశంలో 543 మరణాలు సంభవించాయి. పరిస్థితి ఇలా ఉండగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు సడలించబడుతున్నందున, పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వానికి కేంద్రం ఒక లేఖను రాసింది. లేఖలో హోటళ్లు తెరవడం, ప్రయాణానికి అనుమతించడం వంటి కొన్ని నిర్ణయాలు కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించటమే అని కేంద్ర హోమ్ శాఖ పేర్కొంది. మరోవైపు, లాక్డౌన్ మే 3 తో ముగిసే వరకు సడలింపులు ఉండవని ఢిల్లీ , కర్ణాటక, పంజాబ్ ప్రభుత్వాలు చెప్పగా, తెలంగాణలోని కె చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మే 7 వరకు రాష్ట్రంలో పూర్తి లాక్డౌన్ విస్తరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా వల్ల అత్యధికంగా దెబ్బతిన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రోజు నుండి ముంబైలో కొన్ని పరిమితులు సడలించబడ్డాయి. షట్డౌన్ వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు , అలాగే వివాహ కార్యక్రమాలకు ముంబైలో సోమవారం నుండి ప్రభుత్వ అనుమతి దొరికింది. అయితే ఈ కార్యకలాపాలు చేసేటప్పుడు నియమించబడిన కంటైనర్ జోన్ల లో వుంటూ కరోనావైరస్కు వ్యతిరేకంగా కఠినమైన భద్రతా విధానాలను అనుసరించాలి అనే నియమాలు వున్నాయి.

- Advertisement -

ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఆదివారం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అవసరమైన సేవలు మాత్రమే కాకుండా వైద్య, కిరాణా దుకాణాలు, మత్స్య సంబంధిత పనులు, కేబుల్ సేవలు, డిటిహెచ్, కాల్ సెంటర్లు కనీస సిబ్బందితో, నియంత్రణ లేని ప్రాంతాల్లో పనిని తిరిగి ప్రారంభించ గలవు. అయితే కార్యకలాపాలకు ప్రారంభించడానికి అనుమతి దొరికిన వారు బిఎంసి నుండి అనుమతి పాస్లు కోసం దరఖాస్తు చేసుకోవాలి.పంజాబ్ లో కోవిద్ కేసులు లేని మూడు జిల్లాలకు ఏప్రిల్ 20 న దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు దొరికిన నాన్-కంటైనర్ కింద దొరికిన సెలెక్టివ్ లాక్డౌన్ సడలింపుకి అనుమతి దొరకగా మే 3 వరకు కర్ఫ్యూను ఖచ్చితంగా అమలు చేయాలని పంజాబ్ లోని జిరో కేసుల మూడు జిల్లాలు కోరాయి. మహారాష్ట్ర తర్వాత అధిక కేసులు వున్నా తమిళనాడుకు మే 3 వరకు లాక్డౌన్ పరిమితుల్లో సడలింపు లేదు. అవసరమైన సేవలకు ఇప్పటికే ప్రకటించిన మినహాయింపు కొనసాగుతుంది .వైరస్ సంక్రమణ తీవ్రతను విశ్లేషించి నిపుణుల కమిటీని సంప్రదించిన తరువాత ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుంది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్డౌన్ ఉల్లంఘనలను అంచనా వేయడానికి ప్రజారోగ్యంలో నిపుణులు, అధికారులు వైద్యులతో కూడిన కేంద్ర బృందాన్ని పశ్చిమ బెంగాల్‌కు పంపాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే బెంగాల్ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా వుంది . కేంద్ర ప్రభుత్వ ఆదేశాలన్నింటినీ పాటిస్తున్నాము. కేంద్రంతో నిరంతర చర్చలు కొనసాగిస్తున్నాము. అయినా కూడా కేంద్రం రాష్ట్ర వ్యవహారంలో జోక్యం చేసు కుంటున్నది అని బెంగాల్ నాయకులు అంటున్నారు.

Leave a Reply