Take a fresh look at your lifestyle.

తొలి రోజు రైతుల ఖాతాల్లోకి రూ.516.95 కోట్ల రైతు బంధు సాయం

16.95 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు
రైతులకు మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అభినందనలు
వానాకాలం రైతు బంధు సాయం కింద 16.95 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 516.95 జమయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా లక్షా 11,970 రైతుల ఖాతాల్లోకి రూ.36.10 కోట్లు జమ కాగా..ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యల్పంగా 9628 మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు జమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10 లక్షల 33 వేల 915 ఎకరాలకు చెందిన 16 లక్షల 95 వేల 601 మంది రైతుల ఖాతాలకు నిధులు జమయినట్లు వివరాలు వెల్లడించారు. రెండవ రోజు రెండు ఎకరాల వరకు 23.05 లక్షల ఎకరాలకు గాను 15.07 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1152.46 కోట్లు జమ కానున్నట్లు ఆయన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

రెండవ రోజు కూడా నల్గొండ రైతులే అత్యధికంగా లక్షా 10 వేల 407 మంది రైతుల ఖాతాలకు రూ.85.23 కోట్లు జమ కానున్నట్లు తెలిపారు. రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వ్యవసాయ శాఖ సిబ్బందికి, ఆర్థిక శాఖ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

Leave a Reply