Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ ఆవరణ వెలుపల మాక్‌ ‌సెషన్‌ : ‌ప్రతిపక్ష పార్టీల ప్రతిపాదన

కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ మాట్లాడుతూ, కేంద్రంతో పోరాడటానికి ప్రతిపక్ష ఐక్యత అవసరం అని అన్నారు. పార్లమెంటులో ప్రస్తుత ప్రతిష్టంభనను అధిగమించే వ్యూహాన్ని రూపొందించడానికి మంగళవారం 17 పార్టీల నాయకుల అల్పాహారం ప్రతిపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్‌ ఆవరణ వెలుపల మాక్‌ ‌సెషన్‌ ‌నిర్వహించాలని కొన్ని పార్టీలు ప్రతిపాదించాయి. పార్లమెంటులో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను సమిష్టిగా పరిష్కరించుకోవాలని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం. ‌వెంకయ్య నాయుడు మంగళవారం ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను కోరారు.

మంగళవారం మొదటి వాయిదా తరువాత, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ‌ఖర్గేతో వెంకయ్య నాయుడు సభలో ప్రతిష్టంభన గురించి చర్చించారు. సోమవారం సాయంత్రం ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌హోంమంత్రి అమిత్‌ ‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి మరియు సభా నాయకుడు పీయూష్‌ ‌గోయల్‌తో కూడా చర్చించారు.

Leave a Reply