Take a fresh look at your lifestyle.

రాబోయే రెండు తరాలకు నీరు అందించడమే మా లక్ష్యం

‌వనపర్తి,సెప్టెంబర్‌,12(‌ప్రజాతంత్ర విలేకరి) : రాబోయే రెండు తరాలకు కూడా వనపర్తి జిల్లాకు తాగునీటికి ఢోకా ఉండదని రాష్య్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం నాడు మూడువందల కోట్ల నిధులతో మిషన్‌ ‌భగీరథ వాటర్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంటుకు పెద్దమందడి మండలం బుగ్గపల్లి తాండా వద్ద శంకుస్థాపన చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి ఎంపి రాములు కలెక్టర్‌ ‌షేక్‌యాస్మిన్‌ ‌బాష ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతు 2003 లో కృష్ణా నీళ్లను కలశంలో తీసుకొని వరంగల్‌ ‌మహాసభకు సైకిల్‌ ‌యాత్ర చేశామని తెలంగాణ వచ్చాక మాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీదే అని ఆ రోజు కేసీఆర్‌ ‌ను కోరినట్లు చెప్పారు. ఈ రోజు తెలంగాణలో కేసీఆర్‌ ‌నాయకత్వంలో ఆ కళ నిజం చేసుకుంటున్నామని అన్నారు. జూరాల ప్రాజెక్టు అడుగంటితే వనపర్తికి త్రాగు నీరుంజదని 2017 లో వనపర్తికి త్రాగునీటి కోసం జూరాలలో అడుగంటిన నీటిలో మోటార్లను పెట్టి 8 రోజులకొకసారి నీళ్లు ఇవ్వాల్సి వచ్చిందని ఈ విషయాన్ని కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి నాబార్డ్ ఒప్పించి 300కోట్ల ప్రాజెక్టును సాధించామని అన్నారు. దీన్ని త్వరగా పూర్తి చేసి కేసీఆర్‌ ‌చేతుల మీదుగా ప్రారంభం చేయించుకుందామన్నారు.

Our goal is to provide water for the next two generations Agriculture Minister Singireddy Niranjan Reddy

కరోనా వైరస్‌ ‌లేకుంటే కన్నుల పండుగల చేసుకోవాల్సిన పథకం రైతుబంధన్న మిషన్‌ ‌భగీరథన్న మిశన్‌కాకతీయఅన్న రైతు భీమాన్న కేళే శ్వరం పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు లన్న రాబోయే తరాల గుండెల్లో కేసీఆర్‌ ‌నిలిచిపోతా రన్నారు. వనపర్తి నియోజక వర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు తీసుకొస్తున్నామని ఏడాదిలో కృష్ణా నీళ్లు రాని ఊరుండదని దానిని సాధించితీరుతామని చెప్పారు. దేశంలో ఏరాష్ట్రంతోను మనకు పోటిలేదు మననే ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని అనేక వర్గాల మధ్య కొట్లాటకు కారణం భూసమస్యలు వాటిని అంతం చేయడమే కేసీఆర్‌ ‌లక్ష్యం అన్నారు. అందుకే నూతన చట్టాన్ని ప్రశాంతంగా ఉండాలనే తెచ్చారని చెప్పారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులను నిలబడడటానికి ఐదు ఊళ్లు అడిగాడు భూమికి ఉన్న విలువ అంతటిదని చెప్పారు. ఎవరేంత సంపాదించిన చివరకు భూమికోసమే వినియోగించాలి. వనపర్తి కొల్లాపూర్‌ ‌దేవరకద్ర, మక్తల్‌ ‌నియోజకవర్గాలకు తాగునీరందించే పథకమని అన్నారు. ఎంపి రాములు మాట్లాడుతు కేసీఆర్‌ ‌దూరదృష్టి కలిగిన కాలజ్ఞానిఅని వ్యవసాయానికి వినూత్న పథకాలతో రైతాంగానికి అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతు 2014 లో వేసవి వచ్చిందంటే గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉండేదికాదన్నారు. ఏ ఊరికి వెళ్లి కాళా బిందెలతో ఎదురొచ్చేవారన్నారు. కలెక్టర్‌ ‌షేక్‌యాస్మిన్‌ ‌బాష మాట్లాడుతు త్రాగునీరు ప్రాథమిక అవసరమని వనపర్తికి 300కోట్ల ప్రాజెక్టు తేవడం గొప్ప విషయమని 4 నియోజకవర్గాలు ఐదు మున్సిపాలిటీలకు సాగునీరు వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply