- 2.83 కోట్ల మందికి 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా
- పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
జాతంత్రప్రతినిధి, హైదరాబాద్: రైతులు, పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అద్భుత విజయాలను సాధించిందని పౌరసరఫరాలసంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సన్నబియ్యం కొనుగోలుద్వారా సంస్థ రూ.53కోట్లు ఆదా చేసిందని ఆయన చెప్పారు. మారెడ్డి్ర నివాస్‌రెడ్డి ఈ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా,ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. చాలామంది ప్రజాప్రతినిధులు శనివారం ఆయనను అభినందించారు.ఈ సందర్భంగా మారెడ్డి మాట్లాడుతూ పౌరసరఫరాలవిభాగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సంస్థ ఉద్యోగులు మరింత నిబద్ధతతో పనిచేసి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకరావాలని ఉద్బోధించారు. నిత్యావసర సరకులు, రేషన్‌బియ్యం నేరుగా అర్హులకు చేరాలనే లక్ష్యంతో మరోవైపున రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలనే సంకల్పంతో రెండు ప్రధాన అంశాలతో ఈ సంస్థ పనిచేస్తున్నదని చెప్పారు.ధాన్యం కొనుగోలు విధానంలో చేపట్టిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన సంస్కరణలు అనుకున్న ఫలితాలను ఇస్తున్నాయని పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగువిస్తీర్ణం రికార్డులు స్థాయిలో పెరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టిలో తీసుకున్న చర్యలు అనూహ్య ఫలితాలను అందిస్తున్నాయని చెప్పారు.2018-19లలో 77లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోలులో దేశంలోనే రెండవస్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ ఖరీఫ్‌లో 44లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గత ఐదు సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు 318శాతం పెరిగిందని మారెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆయా రాష్ట్రాల్లో పండించిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలేదని తెలిపారు.
ఆర్థిక మాంద్యం పరిస్థితులల్లో కూడా, రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నదని చెప్పారు.2016 నుంచి ఇప్పటివరకుమ 45.37లక్షల మంది రైతులకురూ.38వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశామని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరికి 6కిలోల బియ్యాన్ని, కిలో రూపాయికే అందిస్తున్నామని చెప్పారు.88లక్షల కుటుంబాల్లోని 2.83కోట్ల మందికి పేర్కొన్నారు. 1.80లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని చైర్మన్ తెలిపారు. చదువుకుంటునన పేదపలిల్లలకు నాణ్యమైన సన్నబియ్యంతో బోజనం అందించాలనే ఆలోచనలతో సంక్షమహాస్టళ్లకు, పాఠశాలలకు 1.50లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని తెలిపారు.
Tags: Our Goal is the welfare of farmers and poor people