Take a fresh look at your lifestyle.

ఉద్యోగాల కల్పన దిశగా మన ఎడ్యుకేషన్‌

  • ఉన్నత సంస్థలతో కాలేజీలను అనుసంధానం చేయాలి
  • ప్రతి నియోజకవర్గానికో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి
  • ఉన్నత విద్యపై సక్షలో
  • సిఎం జగన్‌ అధికారులకు స్పష్టీకరణ

అమరావతి,అక్టోబర్‌ 25 : ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలని ,మైక్రోసాప్ట్‌లాంటి సంస్థలతో శిక్షణ అన్నది నిరంతరం కొనసాగాలని సిఎం జగన్‌ అభిలషిం చారు.  కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌చేయాలని, అప్పుడే  ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతా యన్నారు. ఎడ్యుకేషనల్‌గా మనం వచ్చిన తర్వాత తేడా ఏంటి అన్నది కనిపించాలని అధికారులకు సూచించారు. ఉన్నత విద్యపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ‌కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సక్షా సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలని జాబ్‌ఓరియెంటెడ్‌గా మన కోర్సులను తీర్చిదిద్దాలన్నారు.

ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో, కోర్సుల్లో కూడా చాలా మార్పులు తీసుకు వచ్చామన్నారు. చదువులున్నా.. ఇంటర్వ్యూల దగ్గరకు వచ్చేసరికి విఫలం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అప్రెంటిస్‌షిప్‌ ‌కచ్చితంగా ఉండలన్నారు. ప్రతి పార్లమెంటు స్థానంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. సర్టిఫైడ్‌కోర్సులను కరికులమ్‌లో భాగంగా చేయాలన్నారు. ఆయా రంగాల్లో నిపుణులైన, అత్యుత్తమమైన వ్యక్తులతో కోర్సులను రూపొందించండని సూచించారు. చదువులు అయిపోయిన తర్వాత కచ్చితంగా జాబ్‌వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలని, అప్పుడే చదువుకున్న దానికి సార్థకత, విద్యార్థిలో విశ్వాసం వస్తుందన్నారు. యూనివర్శిటీల్లో టీచింగ్‌స్టాఫ్‌ను రిక్రూట్‌ ‌చేయమని ఇప్పటికే గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చామన్నారు. టీచింగ్‌స్టాఫ్‌ ‌లేనప్పుడు యూనివర్శిటీలు ఉన్నా.. లాభం ఏంటన్నారు. రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతాలకు తావుండకూడదన్నారు. టీచింగ్‌స్టాఫ్‌లో క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేకపోతే.. రిక్రూట్‌చేసినా అర్థం ఉండదని కూడా హెచ్చరించారు. ఎంపికలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి.

అత్యంత పారదర్శకంగా నియమాకాలు సాగాలని అన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలన్నారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. అలాగే ప్రతి యూనివర్శిటీ పరిధిలోకూడా జాతీయ ప్రమాణాలు ఉండాలి. కాలేజీలన్నీ కూడా ఆయా ప్రమాణాలు పాటించేలా చూడాలని సిఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. ఎన్ని సమస్యలున్నా సరే.. ఫీజు రియింబర్స్ ‌మెంట్‌ ‌విషయంలో ఎక్కడా లోటు చేయడంలేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా జీతాలు ఇస్తున్నామని అన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇవ్వక పోవడం వల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమా న్యాల నుంచి రాకుండా చూసుకుంటున్నా మన్నారు. తల్లుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నాం. కాలేజీల్లో పరిస్థితులపై నేరుగా వారు ప్రశ్నిస్తున్నారు. యూనివర్శిటీకి సంబంధించిన ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఫీజురియింబర్స్‌మెంట్‌ఫీజులు కూడా ఇస్తాం.

ఇతర ప్రైవేటు కాలేజీల్లానే సమానంగా ఫీజులు చెల్లిస్తాం. దీనివల్ల ఆర్థికంగా యూనివర్శిటీలు స్వయం స్వయంసమృద్ధి సాధిస్తాయి. నైపుణ్యాభి వృద్ధి కేంద్రాలు యూనివర్శిటీలతో ఇంటిగ్రేడ్‌ ‌కావాలి. పరిశోధనలద కూడా కొలాబరేట్‌చేసుకోవాలి. జిల్లాల్లో పరిశ్రమలతో అనుసంధానం చేసుకోవాలి. ఒక్కో యూనివర్శిటీలో ఒక్కో రంగానికి సంబంధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో కొలాబరేట్‌ ‌కావాలి. ప్రతి వారం ఒక వీసీని పిలిపించుకుని… యూనివర్శిటీల్లో సమస్యలు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన తోడ్పాటుపై కలిసి కూర్చొని చర్చించాలి. ఆ సమావేశంలో గుర్తించినా అంశాలను నా దృష్టికి తీసుకురావాలి. తర్వాత యూనివర్శిటీ వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వచ్చే మూడు సంవత్సరాల కాలానికి కార్యాచరణ రూపొందించి మూడేళ్లలో విజన్‌ ‌సాధించాలి. అన్నియూనివర్శిటీల్లో నాక్‌రేటింగ్‌ అప్‌‌గ్రేడ్‌కావాలి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు యూనివర్శిటీలతో ఇంటిగ్రేడ్‌ ‌కావాలన్నారు. ఆన్‌లైన్‌లో కూడా స్కిల్‌డెవలప్‌మెంట్‌కోర్సులను ఉంచాలి. ఇంగ్లిషును మెరుగుపరచడంపైనా దృష్టిపెట్టాలన్నారు. బేసిక్‌ఇం‌గ్లీష్‌ అన్నది తప్పనిసరి స్జబెక్టుగా పెట్టాలి.

దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. తెలుగుడియం నుంచి ఇంగ్లిషు మాధ్యంలోకి విద్యార్థులు మారేటప్పుడు వారికి సౌలభ్యంగా ఉండటానికి రెండు భాషల్లో కూడా పాఠ్యపుస్తకాలు రూపొందించాలన్న సీఎం.. వచ్చే నాలుగేళ్లపాటు రెండు భాషల్లో టెక్టస్‌బుక్స్ అం‌దించాలని తెలిపారు. ‘ఈ ప్రభుత్వం చదువకు ఇచ్చిన ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు. నాణ్యమైన విద్య ఇవ్వడానికే అనేక చర్యలు తీసుకున్నాం. మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారుతాయని సీఎం జగన్‌ ‌తెలిపారు అన్నారు. జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ది పొందుతున్న విద్యార్థుల్లో ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నవారికి ల్యాటాప్‌లు ఇవ్వనున్నామని అధికారులు తెలిపారు. ప్రతి కాలేజీలో ప్రమాణాలు పాటించాల్సిందే. ఏ కాలేజీలోనైనా ప్రమాణాలు లేకపోతే.. గుర్తించిన అంశాలను వారి దృష్టికి  తీసుకెళ్లి.. మెరుగు పరుచు కోవడానికి సమయం ఇవ్వండని సూచించారు. ప్రమాణాలు లేని వాటికి అనుమతులు ఇవ్వొద్దన్నారు.

ఇకపోతే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీకాలేజీ ఏర్పాటు చేస్తా మన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌క్లినిక్స్‌లాంటి వ్యవస్థలు సమర్థవంతంగా పనియేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్శిటీలు అధ్యయనం చేయాలన్నారు. యూనివర్శిటీల్లో అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను రికార్డ్ ‌చేయాలి. స్జబెక్టుల వారీగా ఇలా రికార్డ్ ‌చేసి.. వీటిని ఆన్‌లైన్లో పెట్టాలి. విద్యార్థులు సులభంగా అర్థంచేసుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండాలి. ఎయిడెడ్‌ ‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బల వంతం లేదని ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందం అన్నారు. శిథిలావస్థలో, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడు తున్నారు. ఇలాంటి వారికి ఒక అవకాశ ప్రభుత్వం పరంగా కల్పించాం. ప్రభుత్వానికి అప్పగిస్తే.. ఆయా సంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. లేదు తామే నడుపుకుంటామే భేషుగ్గా నడుపుకోవచ్చుదీనికి ఎలాంటి అభ్యంతరంలేదు. ప్రభుత్వానికి ఎయిడెడ్‌ ‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టంచేయాలని అన్నారు.

Leave a Reply