- మృతికి కారణమైన ఎస్సైపై చర్యలేవి
- అధికారులు స్పందించకుంటే 16 నుండి నిరసన దీక్షలు
భద్రాచలంలో ఏప్రిల్ 1వ తేదీన ఇంట్లో నగదు పోయిందని భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానిక వెళితే పట్టణ ఎస్సై ఫిర్యాదు తీసుకోకుండా తిరిగి తన మీదనే కేసులు పెడతాం అని బెదిరించి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళిన తమ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామని తీవ్ర పదజాలం వాడటం వలన సమ్మక్క మనోవేదనకు మానశికంగా కుంగిపోయి నిద్రలో చనిపోవటం జరిగిందని ఇట్టి ఫిర్యాదు తీసుకుని న్యాయం చేస్తామని ఎస్సై భరోసా ఇచ్చి ఉంటే సమ్మక్క బ్రతికి ఉండేదని కుటుంబ సభ్యులు వెంకమ్మ, తిరుపతమ్మ, కొండమ్మ, రమణ, తిరుపతమ్మ, కుమార్తెలు వెంకట రమణ, ఐశ్వర్యలు ఆరోపించారు. మరణించిన నాడు హాస్పటల్ దగ్గర పట్టణ సిఐకు ఫిర్యాదు చేసినప్పుడు భాద్యులపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చి మరిచిపోయారని అన్నారు.
తల్లిని కోల్పోయిన చిన్నారులను ఆదుకునే సమయం కూడ ఉన్నతాధికారులకు లేదా అని ఆవేదన వ్యక్తం చేసారు. సమ్మక్క చనిపోయి నెలన్నర అవుతున్న విచారణ ఏమైందని ప్రశ్నించారు. చట్టం పేదోడికి ఒకలాగా డబ్బు ఉన్నోడికి ఒకలాగా ఉండకూడదని అన్నారు. కనీసం ఏమి జరిగిందో కూడ విచారణకు సైతం పోలీస్ ఉన్నతాధికారులు రాకపోవడంతో పోలీసుల పట్ల నమ్మకం పోతుందని అన్నారు. చిన్నపిల్లలను ఆదుకోవ డానికి మనసు రాకపోవడం శోచనీ యమని అన్నారు. ఎస్సైను సస్పెండ్ చేయాలని 16 నుండి ఇంటి వద్దనే నిరసన దీక్షలు చేపడతామని రాజకీయ పార్టీలు, మానవతా వాదులు, అందరు తమకు అండగా నిలవాలని వారు కోరారు.