Take a fresh look at your lifestyle.

‌గుంత తీశారు..పూడ్చడం మరిచారు

pipeline

రామన్నపేట మండల కేంద్రంలో మిషన్‌ ‌భగీరథ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్యాల-భువనగిరి ప్రధాన రహదారిలోని రైల్వేస్టేషన్‌ ‌దారి ప్రక్కన మిషన్‌ ‌భగీరథ పైప్‌ ‌లైన్‌ ‌లీకేజీలో భాగంగా మరమత్తుల కోసం తీసిన గొయ్యి ప్రాణాంతకంగా మారాయి. మిషన్‌ ‌భగీరథ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గత రెండు మాసాల క్రితం మిషన్‌ ‌భగీరథ పైప్‌ ‌లైన్‌ అతికించాడం కోసం తీసిన గొయ్యిని ఇప్పటికీ పూడ్చడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిషన్‌ ‌భగీరథ శాఖ అధికారులు, స్థానిక గ్రామపంచాయితీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళలో ప్రమాదాలు జరిగి గాయాలైనా అధికారులకు ఏమాత్రం చలనం లేదు. మిషన్‌ ‌భగీరథ పైప్‌ ‌లైన్‌ ‌సరిచేసేందుకు గొయ్యిలు తీసి రెండు నెలలు గడుస్తున్నా వాటిని మూసేయలేదు. రోడ్డు పక్కకే తీయడం వల్ల ప్రమాద గుంతలుగా మారాయి. వెంటనే వీటిని సరిచేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply