మండిపడ్డ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్‌లు…
సచివాలయ ముట్టడికి పిలుపునివ్వ లేదు…భట్టి
సీఎం పేషీ ఎక్కడ ఉందో తెలియదు …జగ్గారెడ్డి
ప్రజాసమస్యలపై పోరాడితే అరెస్ట్ చేస్తారా ..కోమటిరెడ్డి
రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గౌరవం లేకుండా పోయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. కేసీఆర్ 10 వేల మందితో కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించారు… కేటీఆర్ వేలాది మందితో సిరిసిల్లలో జలహారతి కార్యక్రమం చేశారని గుర్తుచేశారు. వాళ్లను అడ్డుకోలేని పోలీసులు.. కాంగ్రెస్ నేతలనే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులను కేసీఆర్ మోసం చేశారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గురువారం చలో సెక్రటేరియేట్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై తెలంగాణ సచివాయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతల ఇండ్లను మోహరించి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యులైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, మల్రెడ్డి రంగారెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడుతూ. తమను పోలీసులు ఎందుకు గృహ నిర్బంధం చేశారో తెలియదని అన్నారు. కేసీఆర్ 10వేల మందితో కొండపోచమ్మ ను ప్రారంభించాని, కేటీఆర్ కూడా వేలాదిమందితో సిరిసిల్లలో హారతి కార్యక్రమం చేశారని.. మరి తమను ఏ కారణం చేత పోలీసులు అడ్డుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు. పోలీస్‌లు దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గౌరవం లేకుండా పోయిందని అన్నారు. కేసీఆర్ గిరిజనులను దారుణంగా మోసగించారని అన్నారు ఉత్తమ్. ఎన్టీఆర్ సింపుల్ జీవో తో గిరిజన రిజర్వేషన్లను 4శాతం నుంచి 6 శాతానికి పెంచారని, కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 12శాతం గిరిజన రిజర్వేషన్ ఇస్తా అన్నారా? లేదా? అని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలన్నారు. గిరిజనుల పోడు హక్కులను కాంగ్రెస్ కాపాడుతుందని చెప్పారు.
ఇలాగే నిర్బంధం కొనసాగితే ప్రజలు తిరుగబడుతారు…సిఎల్పీ
ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేస్తుందని శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు .అడ్డగోలు గా విద్యుత్ బిల్లులు , నియంతృత్వ వ్యవసాయ విధానం, కరోనో విషయంలో ముఖ్యమంత్రి తో కలిసి చర్చించేందుకు అపోయింట్మెంట్ అడిగామని ,వ్యవసాయ శాఖ మంత్రి ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పారని తెలిపారు .మంత్రి మాట్లాడేందుకు పిలిచారు కానీ ఇక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు .ఇదేమి పాలన ఇంత సమాచార లోపం ఉంటే ఎలా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,సిఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి ,శ్రీధర్ బాబు ,ఎంపీ లు రేవంత్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు .ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఒక వీడియో విడుదల చేశారు .ఈ వీడియో లో మాట్లాడుతూ….మేము సచివాలయం ముట్టడికి పిలుపు ఇవ్వలేదని పోలీసులకు కనీస సమాచారం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని ఇంత అనాలోచిత పాలన ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే పాలకులు నిర్బంధం కొనసాగిస్తున్నారని ,ఇలాగే నిర్బంధం కొనసాగితే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు.ఒక ప్రజాప్రతినిది హోదాలో సెక్రటేరియట్ వెళ్లి వినతి పత్రం ఇవ్వడం నా హక్కని ఇవ్వాళ నన్ను అడ్డుకొని నా హక్కులను అడ్డుకోవడమే కాకుండా నన్ను అవమానించారని మండిపడ్డారు.నాకు రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని , నా హక్కులను-భాధ్యతను అడ్డుకున్న వారికి అసెంబ్లీ లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్నారు.అసెంబ్లీలో లో నాకు న్యాయం జరగకపోతే న్యాయ పరంగా పోరాటం చేస్తాను-న్యాయస్థానానికి వెళ్తానన్నారు.