Take a fresh look at your lifestyle.

అనాథ బాలికను కాటేసిన ఆశ్రమం

ఆదరణ కరువై అనాథాశ్రమానికి చేరిన 14 ఏళ్ల బాలికను ఆ ఆశ్రమమే కాటేసింది. ! గర్భవతి అయిన ఆమె, మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్‌ ‌వచ్చి.అది ఒళ్లంతా పాకడంతో మృతి చెందింది. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ‌మున్సిపాలిటీ పరిధిలోని వెదిరి కాలనీలోని మారుతి అనాథాశ్రమంలో వెలుగుచూసింది. మృతురాలి స్వస్థలం బోయినిపల్లిలోని రెడ్డి కంపౌండ్‌ ‌బస్తీ. తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ మారుతి అనాథాశ్రమంలో చేర్పించాడు. శరణాలయానికి నిధులిచ్చే నెపంతో అక్కడికి తరచూ వచ్చే వేణుగోపాల్‌ ‌రెడ్డి (54) అనే వ్యక్తి, బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అందుకు శరణాలయం నిర్వాహకులు విజయ, జయదీప్‌ ‌సహకరించారు. లాక్‌డౌన్‌ ‌కావడంతో మార్చి 21న బాలికను జీడిమెట్ల షాపూర్‌నగర్‌కు చెందిన మేనమామ తన ఇంటికి తీసుకొచ్చి 4 నెలలు ఆలనాపాలనా చూశాడు. కొన్ని రోజులుగా బాలిక జ్వరం, నీరసంతో బాధపడుతుండటంతో అనాథ ఆశ్రమానికి తీసుకెళ్లాడు. బాలికను నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమెను మేనమామ బోయిన్‌పల్లి బాపూజీనగర్‌లో నివాసముండే ఆమె పెద్దమ్మ ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక నీరసంగా కనిపించడంతో అనుమానించిన ఆమె, తాను పనిచేసే యజమాని అయిన రిటైర్డ్ ‌పోలీసు అధికారిణికి విషయం చెప్పింది. బాలికపై ఎవరో లైంగికదాడి చేసివుంటారని అనుమానించిన ఆమె వివరాలు రాబట్టారు. అనంతరం గత నెల 31న పెద్దమ్మ సాయంతో బాలిక తనపై అత్యాచారం చేసిన వేణుగోపాల్‌ ‌రెడ్డి, సహకరించిన అనాథాశ్రమం నిర్వాహకులపై బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యా దు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను భరోసా సెంటర్‌కు తరలించారు. కేసును అమీన్‌పూర్‌ ‌పోలీసుస్టేషన్‌కు పంపించారు. భరోసా కేంద్రంలో బాలికకు పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని నిర్ధారణ అయింది. ఈ నెల 7వ బాలిక పరిస్థితి విషమించడంతో నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు.అప్పటినుంచిఅక్కడ చికిత్స పొందుతున్న బాలిక బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలికమరణ వార్తతోవెదిరి కాలనీలో గురువారం విషాద ఛాయలు అలుముకున్నాయి.మహిళా కాంగ్రెస్‌ ‌సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, కాట సుధారాణి అనాధ ఆశ్రమం వద్దకు చేరుకొని తనదైన శైలిలో ఆశ్రమ నిర్వాహకులు, దాతలకు సహకరించి ఓ బాలిక జీవితంతో చెలగాటం ఆడటంఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. అదే కాలనీకి చెందిన కొందరు మహిళలు సైతం ఆశ్రమ నిర్వాహకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆశ్రమాల నిర్వహణపై కన్నేసి, అక్రమాలకు పాల్పడే ఆశ్రమ నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ ‌చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!