Take a fresh look at your lifestyle.

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం – ఓసిడిఆర్

మార్చి 2021: తెలంగాణ రాష్ట్రంలో మేధావులను, ప్రజాసంఘాల నాయకులను రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం చేస్తున్న దాడులను, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓసిడిఆర్) తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి. నరసింహ, ఉపాధ్యక్షుడు మోహన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో విద్యావంతుల వేదిక అధ్యక్షుడు రవీందర్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కల ప్రకారం పోరాడుతున్న ఉద్యమకారులపై కేసుల పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. హక్కుల నేతలపై జరుగుతున్న నిర్భంధాన్ని మేధావులు ఖండించాలని అన్నారు. అరెస్టు చేసిన విద్యావంతుల వేదిక అధ్యక్షుడిని భేషెరతుగా విడుదలన చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply