Take a fresh look at your lifestyle.

సేంద్రీయ ఎరువులను వాడాలి

నాగర్‌ ‌కర్నూల్‌, ‌మే 23.ప్రజాతంత్రవిలేకరి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియంత్రిత పంటల సాగు, పంటమార్పడి విధానంపై నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాలోని రైతులను చైతన్యపర్చాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సుఖజీవన్‌ ‌రెడ్డి ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో మండల రైతు సమన్వయ సమితి సభ్యులు,మండల వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం సూచించి న మేరకు రైతులకు పంటమార్పిడి విధానం పై వ్యవసాయ విస్తరణ అధికారులు వివరిం చాలని సూచించారు. ముఖ్యంగా ఏఈవోలు రైతుల ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి పంట సేద్యంపై పూర్తి అవగాహన కల్పించాలన్నా రు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తు న్నారనే వివరాలను ఏఈవోలు తమ వద్ద ఖచ్చితంగా సేకరించుకొని ఉంచుకోవాల న్నారు. పూర్తిస్థాయిలో క్రాప్‌ ఎన్యూమరేషన్‌ ‌జరగాలని,నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు పూర్తిస్థాయిలో క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలని కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌సూచించారు. నియంత్రిత పద్దతిలో పంటలను సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించా ల్సిన బాధ్యత రైతు సమన్వయ సభ్యులు, ఏఈవోలదేనన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు పంటలు సాగు చేయడం వల్ల ఎలాంటి నష్టం జరగదని, అది రైతులకు లాభమేనని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు. రైతులు వరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా డిమాండ్‌ ఉన్న తెలంగాణ సోనా రకం వేసుకోవాలని సూచించారు.6.4 ఎం.ఎం. సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయంగా బాస్మతి రైస్‌ ‌పంటను కూడా సాగు చేయాల ని సూచించారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా వారీగా అగ్రికల్చర్‌ ‌కార్డును రూపొందించా లని, దాని ప్రకారమే పంటల సాగును చేప ట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లాలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మొక్కజొన్న సాగు జరగరాదని అందుకు ప్రత్యామ్నాయంగా పత్తి, కంది నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఫామ్‌ ఆయిల్‌ ‌పంటను సాగు చేయాలన్నా రు.జిల్లాలో ఏ పంట ఎంత మేరకు వెయ్యా లో మండలాల వారీగా వివరాలు అందజే యడం జరిగిందని ఆ విధంగా ప్రణాళికలు రూపొందించి ఈరోజు సాయంత్రం వరకు అందజేయాలని, కలెక్టర్‌ అధికారులకు సూచించారు. రైతుల సంఘటితంగా ఉండేందుకే రైతు వేదికలను వచ్చే యాసంగి వరకు నిర్మాణాలను పూర్తి చేయనున్నట్లు కలెక్టర్‌ ‌వెల్లడించారు.రైతులు సంఘటితంగా ఉండి తాము పండించిన పంటకు తామే ధర కల్పించే విధంగా ఎదగాలనిఅన్నారు.ఈనెల 25వ తేదీన జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌, ఎం.‌పీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతి నిధులతో చర్చించి పంటల సాగుపై ఒక విధానపరమైన నిర్ణయంతో ముందుకు సాగుతామని, కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన పంట మార్పిడి పంటలను పండించడం ద్వారా రైతులకు లాభం చేకూ రుతుందని, ఆ విధంగా క్షేత్ర స్థాయి వ్యవసా య అధికారులు ప్రతి ఎకరానికి సందర్శించి రైతులకు అవగాహ న కల్పించాలని ప్రభు త్వం నిర్ణయం రైతులకు అధిక లాభం జరుగుతుందని, రైతులు అధైర్య చెందకుం డా పంట మార్పిడి విధమైన ఆలోచనలతో రైతులు లాభం చెందాలని అన్ని రకాల పంటలకు ధాన్యాన్ని ఉన్న ఏకైక రాష్ట్రం తెలం గాణ రాష్ట్రమని ఆయన అన్నారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్‌ ‌మను చౌదరి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బైరెడ్డి సింగారెడ్డి, హార్టికల్చర్‌ అధికారి చంద్రశేఖర్‌ ‌రావు సి పి ఓ మోహన్‌ ‌రెడ్డి, వ్యవసాయ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy