రసాయన ఎరువుల వా డకం వల్ల మానవుల ఆరోగ్యానికి ఎంతగానో హాని తలపెడుతుందని, సేంద్రీయ ఎరువులతో పండిన పంట ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుం దని సర్పంచ్ కుంటి జగన్మోహన్, అంగన్వాడి టీచర్లు బండి తార, కుం టి రాంబాయి, రజితలు అన్నారు. బుధవారం నర్మెట మండలంలోని అమ్మాపురం గ్రామంలో రైతు పండ్ల రమేష్ రసాయన ఎరువులతో పండిం చిన కూరగాయల తోటను సర్పంచ్, అంగన్వాడి టీచర్లు రైతులతో సంద ర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పూర్వీకులు పశువుల, మేకల ఎరువులతో కూరగాయలు, వరి, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు, సజ్జలు, పచ్చజొన్నలు, శెనిగలు, గోదుమలు, తైదలు వంటి పంటలను పండించే వారని రైతులకు వివరించారు.
అప్పటి ఆ హారం తిన్న వారికి బీపీ, షుగర్లాంటి వ్యాధులు దరిచేరలేదని అందువలన ప్రతి రైతు సేంద్రీయ ఎరువు)తో పండించేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు ఎక్కువగా వాడినందున అనేక రోగాల భారినపడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఇర్రి కృష్ణారెడ్డి, ఇర్రి శివారెడ్డి, సన్నపూరి రాజు, పండ్ల నర్సయ్య, శ్రీవాణి, బండి కవిత, అండాలు, మంజుల, శ్యామల, మద్దెల శోభతోపాటు మరికొంత మంది మహిళలున్నారు.