Take a fresh look at your lifestyle.

ఉల్లి భారం మోయలేమంటున్న సామాన్య ప్రజలు

“ఉల్లి ధరలు  తెలుగు రాష్ట్రాల్లో జనం కంట కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు నెలల క్రితం కిలో రూ.15 ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రిటేల్‌ ‌మార్కెట్లో రూ.80కిపైనే పలుకుతోంది. దీంతో ఉల్లి కొనాలంటేనే జనం జంకుతున్నారు. వంటింట్లో ఉల్లి నిలవలు పడిపోయినా ఆ ధరను చూసి కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇంత ధర పోసి కొనడం కన్న్లాలేని కూరలతోనే పలువురు లాగించేస్తున్నారు. ఇలా ఉల్లి వంటింట్లో కుంపటిని రగుల్చుతోంది.”

ఉల్లి జనం కంటకన్నీళు్ల పెట్టిస్తోంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి నుంచి ఆ మేలు పొందే సంగతి అటుంచితే ఉల్లి మాట ఎత్తాలంటేనే భయమేస్తోంది. ఇందుకు కారణం ధరలు. పెరుగుతున్న ధరలతో ఉల్లిని కోయక ముందే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఉల్లి ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాంతంగా పెరిగి ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కిలో ఉల్లి రూ.100 దిశగా దూసుకుపోతుంది. దీంతో ఉల్లి జనం కంట కన్నీరే కాదు.. వంటింట్లో మంటను కూడా పెట్టేస్తున్నది. ఉల్లి ధరలు తెలుగు రాష్ట్రాల్లో జనం కంట కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు నెలల క్రితం కిలో రూ.15 ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రిటేల్‌ ‌మార్కెట్లో రూ.80కిపైనే పలుకుతోంది. దీంతో ఉల్లి కొనాలంటేనే జనం జంకుతున్నారు. వంటింట్లో ఉల్లి నిలవలు పడిపోయినా ఆ ధరను చూసి కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇంత ధర పోసి కొనడం కన్నాఉల్లిలేనికూరలతోనేపలువురులాగించేస్తున్నారు. ఇలా ఉల్లి వంటింట్లో కుంపటిని రగుల్చుతోంది.

తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ‌నుంచి ఉల్లి వస్తుంది. అయితే తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాలతో ఉల్లి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. ఉల్లి చేలలో నుంచి నీరు బయటకు పంపే అవకాశం లేకపోవడంతో వేసిన పంటదెబ్బతిన్నది. ఉల్లి పంటసాగు చేయాలంటే రూ.50 వేలకు పైనే పెట్టుబడి అవుతుంది. పంట చేతికొచ్చేదశలో పంటదెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌, ఇతరప్రాంతాల నుంచి రోజుకు కనీసం 100 లారీలకుపైగా ఉల్లిగడ్డ తెలుగురాష్ట్రాలకు చేరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో రైతు బజార్ల ద్వారా ఉల్లిని సబ్సిడీ కింద అందజేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఉల్లి ధర పెరగడంతో ఉల్లి దిగుమతులపై ఆంక్షలు సడలిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ 15 ‌వరకు ఉల్లి గడ్డల దిగుమతులపై సడలింపులు అమలులో ఉంటాయి. వివిధ దేశాల నుంచి దిగుమతులను వేగంగా దేశీయ మార్కెట్లకు చేర్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. తద్వారా ధరలు అదుపులోకివస్తాయ ని వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఉల్లిగడ్డలను ఎగుమతి చేసే దేశాలలోని రాయబారులతో ఈ విషయంపై సంప్రదింపులు చేసినట్లు పేర్కొన్నది. ప్రభుత్వ గోడౌన్లలో ఉన్న ఉల్లి నిల్వలను బయటకు తీసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ధరలు పెరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఉల్లి ధరలు ఇలానే భారీగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా రిటైల్‌ అవుట్లెట్లలో వరుసగా రెండవ సంవత్సరం ఉల్లిధరలు పెరగడం ప్రారంభించాయి. ముంబై, పూణే వంటి నగరాల్లో రిటైల్‌ ‌ధరలు కిలోకు రూ .100 కు జూమ్‌ అయ్యాయి. ఈ ఏడాది ఉల్లి ధర గణనీయంగా పెరగడానికి మూడు కారణాలున్నాయని నేషనల్‌ ‌హర్టికల్చరల్‌అం‌డ్‌ ‌రిసెర్చ్ ‌ఫౌండేషన్‌ ‌యాక్టింగ్‌ ‌డైరెక్టర్‌ ‌డార్టర్‌ ‌రిపాకె గుపా్త అన్నారు. వ్యవసాయ నిపుణులు ‘ప్రీమియం అస్థిరతను’ నాల్గవ కారణం అని పేర్కొన్నారు

మహారాష్ట్ర, గుజరాత్‌, ఆం‌ధ్రప్రదేశ్‌, ‌కర్ణాటక, మరియు మధ్యప్రదేశ్‌ ‌వంటి రాష్ట్రాలలో ఉల్లిపాయ పండించే ప్రాంతాలలో వర్షాలు పంటలను ప్రభావితం చేశాయి. వర్షాలు ఖరీఫ్‌ ‌మరియు చివరి ఖరీ•• •ఉల్లిపాయ పంటలను దెబ్బతీశాయి’’ అని అన్నారు. భారతదేశంలో ఉల్లిపాయను మూడు సీజన్లలో పండిస్తారు – ఖరీఫ్‌ (‌వేసవి), చివరి ఖరీఫ్‌ ‌మరియు రబీ (శీతాకాలం). ఖరీఫ్‌ ఉల్లి పాయలు సెప్టెంబరులో, నవంబర్‌ ‌తరువాత ఖరీఫ్‌ ‌మరియు ఏప్రిల్‌ ‌నుండి రబీ రావడం ప్రారంభిస్తాయి. గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు రాకపోకలను ప్రభావితం చేశాయి రెండవ కారణం ఉల్లి గింజల కొరత ఉంది. గత సంవత్సరం రబీకి మరియు ఈ సంవత్సరం ఖరీఫ్‌ ‌విత్తడానికి విత్తనాల కొరత మాకు ఉంది. ఈ సంవత్సరం కూడా రబీ విత్తనాల కొరతను ఎదుర్కొంటాం ’’అని డాక్టర్‌ ‌గుప్తా అన్నారు.ఉల్లిపాయ పంటను ఆంత్రోనోస్‌ ‌మరియు ట్విస్టర్‌ ‌బ్యాక్టీరియా ప్రభావితం చేశాయి, దీని పెరుగుదలకు వర్షం, తేమ మరియు ఉష్ణోగ్రత సహాయపడతాయి. ఖరీఫ్‌ ఉల్లిపాయ పంటలో 70 శాతం భారీ వర్షాల కారణంగా ప్రభావిత మవడంతో సమస్య మరింత పెరిగింది. మహారాష్ట్ర మరియు గుజరాత్‌ ‌లలోఆలస్యంగా ఖరీఫ్పంట కూడా వర్షాలవల్ల ప్రభావితమైంది, ’’అని డాక్టర్‌ ‌గుప్తా అన్నారు, నిల్వ చేసిన రబీ ఉల్లి పాయలో 35 శాతం కుళ్ళిపోయాయి. ఎం.సి.ఎక్స్ అధ్యయనం ప్రకారం, ధరల పెరుగుదలకు నాల్గవ అంశం, భవిష్యత్తుకు సంబంధించి ఉల్లి కొరతను ఊహించడం. కొరత కారణంగా ‘అస్థిరమైన ధరలలో పెరుగుదల సంభవిస్తుంది’. వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్‌ ‌కమిటీ (ఎపిఎంసి) మార్కెట్ల నుండి రిటైల్‌ ‌వరకు వచ్చే వరకు ధరలు దాదాపు రెట్టింపు కావడానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు.

డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply