Take a fresh look at your lifestyle.

ఆర్డినరీకి కిలోవిటర్‌కు 25 పైసలు..ఇతర బస్సుల్లో 30 పైసలు..

  • బస్సు ఛార్జీల పెంపుకు ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు  
  • పెట్రో ధరల వల్లే ఛార్జీల పెంపు..అధికారులతో సవిక్షించిన మంత్రి పువ్వాడ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోవి•టర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు మేర ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కేంద్రం పెట్రో ధరలు పెంచడం వల్లనే పెంపు అనివార్యమయ్యిందని అన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌మాట్లాడుతూ గత నెల ధరల ప్రపోజల్స్‌ను తయారు చేసి సీఎంకు అందించినట్లు తెలిపారు.

లాంగ్‌ ‌డిస్టన్స్ ‌రూట్‌లలో బస్సులను నడపడం వల్ల లాభాలు వొస్తాయని సీఎం సూచించారన్నారు. 14 వందల బస్సులు పూర్తిగా పాడయ్యాయని…వాటి స్థానంలో కొత్త వాటిని కొనాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డినరీ బస్సులకు 25 పైసలు…ఇతర బస్సులకు 30 పైసలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌తెలిపారు.

పెట్రో ధరల వల్లే ఛార్జీల పెంపు..అధికారులతో సవిక్షించిన మంత్రి పువ్వాడ
కేంద్రం విపరీతంగా పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌ధరలను పెంచడంతో పాటు, నష్టాలను తగ్గించుకునేందుకు ఛార్జీల పెంపు తప్పడం లేదని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్‌ ‌ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తుందని తెలిపారు. దీంతో చార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలోని 9750 ఆర్టీసీ బస్సులను 3080 రూట్లలో నడిపిస్తున్నట్లు వీసీ సజ్జనార్‌ ‌పేర్కొన్నారు. రోజూ 33 లక్షల కిలోవి•టర్లు బస్సులు తిరుగుతూ 32 లక్షల మంది ప్రయాణికులను ప్రతి రోజు గమ్యానికి చేరుస్తున్నట్లు తెలిపారు. గతంలో అన్ని బస్సులకు 20 పైసలు పెంచడం జరిగిందని, కొరోనా వొచ్చినప్పటి నుంచి ఆర్టీసీ తీవ్ర నష్టాలు ఎదుర్కుంటుందన్నారు.

కొరోనా సమయంలో బస్సులు నడపడం వల్ల 251 మంది మరణించారన్నారు. రెండు సంవత్సరాలుగా డీజిల్‌ ‌ధరలు భారీగా పెరిగుతున్నాయని, రూ. 63.8 డీజిల్‌ ఇప్పు‌డు 87.రూపాయలు ఉందన్నారు. స్పేర్‌ ‌పార్టస్ ‌కూడా భారీగా పెరిగాయని తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ ‌నుంచి అక్టోబర్‌ ‌వరకు 1440 కోట్ల నష్టం వొచ్చిందని, అందుకే చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశామని సజ్జనార్‌ ‌గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మంత్రి పువ్వాడ ద్వారా కోరుతున్నామన్నారు. ఛార్జీలు పెరగం వల్ల ఆర్టీసీ మళ్లీ సాధారణ స్థితికి వొస్తుందన్నారు. అన్ని ధరలు పెరిగాయని, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఛార్జీల పెంపుతో సుమారు రూ.

800 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని, చార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పురాష్ట్ర రవాణా శాఖపై మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌బుధవారం ఆర్టీసి చైర్మన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎం‌డి విసి సజ్జనార్‌, ఈడీలతో అజయ్‌ ‌కుమార్‌ ‌సవి•క్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆర్టీసి ఛార్జీల పెంపుపై చర్చించారు.

Leave a Reply