Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌కు సిఎం వరాల జల్లు

  • దళితులందరికి ఇళ్లు..నిర్మాణానికి ఆర్థిక సాయం
  • అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం
  • కలెక్టరే స్వయంగా పర్యవేక్షించాలి
  • దళితబంధు సమిక్షలో సిఎం కెసిఆర్‌ ఆదేశం

హుజూరాబాద్‌కు సిఎం వరాల జల్లు కురిపించారు. హుజూరాబాద్‌లో నివసించే దళితులకు సిఎం బొనాంజా ప్రకటించారు. వారికి ఆధునిక గృహాలు నిర్మించి ఇవ్వనున్నారు. అలాగే అవసరమైతే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మేరకు ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. అక్కడ ఉన్న దళితులందరికీ ఇంటి నిర్మాణం జరుగాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం దళితబంధుపై ప్రగతి భవన్‌ ‌వేదికగా అవగాహన సదస్సు సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ, వందశాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. దళితులకు స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణ కోసం ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. వారం, పది రోజుల్లో హుజురాబాద్‌లో స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టి దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. దళిబంధు పథకం అమలుపై హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో ఇవాళ సీఎం కేసీఆర్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌పథకం విధివిధానాలు, అమలు తదితర అంశాలపై వారితో చర్చించారు. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని ఎస్సీల భూముల సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ ‌చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు.

హుజూరాబాద్‌లో ఇల్లులేని ఎస్సీ కుటుంబం ఉండకూడదని, ఇల్లులేని వారి వివరాలను గుర్తించాలని చెప్పారు. ఖాళీ స్థలముంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని చెప్పారు. ‘హుజూరాబాద్‌లో రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని సమస్యలు పరిష్కరించాలి. ప్రతి ఎస్సీవాడలో అధికారులు పర్యటించాలి. వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు గుర్తించి నివేదిక ఇవ్వాలి. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి కేంద్రం, ఇతర రాష్టాల్రు చేర్చుకుంటున్నాయి. దళితబంధు పథకాన్ని కూడా ఇతర రాష్ట్రాలు అనుసరించాలి’ సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Leave a Reply