Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడుపై భగ్గుమన్న విపక్షాలు

ఖమ్మం సిటి, మే 13 (ప్రజాతంత్ర విలేకరి) : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం జారిచేసిన జివో నెంబర్‌ 203‌ను వెంటనే రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్‌ ‌కార్యాలయంలో సిఎల్‌పీ నాయకులు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బుధవారం నిరసనదీక్ష చేసారు. కాంగ్రెస్‌పార్టీ నేతలు నల్లబ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అద్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ‌మాజీ ఎంఎల్‌సి  పోట్ల నాగేశ్వరరావు, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు, సోమ్లా నాయక్‌, ‌నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎండి జావీద్‌, ‌నగర ఐఎన్‌టియుసి అద్యక్షులు ఎండివై పాషా, జడ్పిటిసిలు, కాంగ్రెస్‌ ‌నాయకులు పాల్గొన్నారు.
బీజేపి ఆధ్వర్యంలో…
image.png

ఖమ్మం సిటి, మే 13 (ప్రజాతంత్ర విలేకరి) : నీళ్లు, నిధులు,నియామకాల ఆకాంక్షల పునాదులపై ఏర్పాటు అయిన తెలంగాణలో కెసిఆర్‌ ‌ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు.బిజెపి తెలంగాణ శాఖ పిలుపుమేరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అక్రమ విస్తరణ ఆపాలని,తన గృహంలో బిజెపి నాయకులతో కలసి దీక్ష చేపట్టిన  సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటరీ సామర్ద్యాన్ని 80వేల క్యూసె క్కులకు పెంచుతూ ఆంధ్ర సర్కారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల దక్షిణ  తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, మురళి పాల్గొన్నారు.
మధిర బీజేపి శాఖ ఆధ్వర్యంలో…

image.png

మధిర, మే 13 (ప్రజాతంత్ర) : పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటరీ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం తీసుకున్న ఏకపక్షంగా నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కృష్ణాపరివాహక ప్రాంతం బీడుగా మారే అవకాశం ఉందని,ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన బిజెపి నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. మంగళవారం మధిర పట్టణంలో బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వారి ఇండ్ల వద్ద బిజెపి నాయకులు కుంచం కృష్ణారావు, చిలువేరు సాంబశివరావు, పాపట్ల రమేష్‌, ‌రామిశెట్టి నాగేశ్వరరావులు నిరసన దీక్షలు చేపట్టారు. తక్షణమే పోతిరెడ్డిపాడు నుండి నీటి తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.
సూర్యాపేట డిసిసి ఆధ్వర్యంలో…

image.png

సూర్యాపేట, మే 13, ప్రజాతంత్ర ప్రతినిధి):తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడకపోవడంలో జగన్‌, ‌కేసీఆర్‌ ‌మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందని డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుండి రోజుకు 10టిఎంసి నీళ్లను తరలించే ప్రయత్నాలు చేస్తుందని, నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, ధారవత్‌ ‌వీరన్న నాయక్‌, ‌తంగేళ్ల కరుణాకర్‌ ‌రెడ్డి, మాన్‌సింగ్‌, ‌నరేందర్‌, ‌కోన వెంకన్న, మధుకర్‌రెడ్డి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
గరిడేపల్లి సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో…

image.png

గరిడేపల్లి, మే 13(ప్రజాతంత్ర విలేకరి) : నీళ్లు, నిధులు, నియామకాల్లో ఆంధ్రా పాలకులు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా యావత్‌ ‌తెలంగాణ ఒక్కటై మహత్తర పోరాటాలు నిర్వహించి రాష్ట్రాన్ని సాధించుకుంటే మళ్లీ ఏదో ఒక రకంగా తెలంగాణను దోచుకోవాలని ఆంధ్రా పాలకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం స్థానికంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం నీటిని తరలించడా నికి ఆంధ్రా పాలకులు జీవో 203 తీసుకొచ్చారన్నారు. అప్పయ్య, పందిరి నాగయ్య, రామస్వామి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
గరిడేపల్లి బీజేపి మండల కమిటీ ఆధ్వర్యంలో…
పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌సామర్థ్యం పెంపుపై •మ్మడి మహబూబ్‌ ‌నగర్‌, ‌నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు శ్రీశైలం నదీ జలాలపై కెసిఆ ర్‌, ‌జగన్‌లు రహస్య ఒప్పందం చేసుకు న్నారని బిజెపి జిల్లా కార్యదర్శి రామినేని కృష్ణయ్య అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌పిలుపు మేరకు బుధవారం ఆయన స్వగృహంలో నిరాహారదీక్షలో కూర్చొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలన్నారు.

Leave a Reply