సిట్టింగ్ జడ్జితో విచారణకు..కెటిఆర్ రాజీనామాకు బండి సంజయ్ డిమాండ్
గన్ పార్క్ వద్ద రాష్ట్ర బిజెపి చీఫ్ దీక్ష…హైటెన్షన్ వాతావరణం
బండి సంజయ్, ఈటల అరెస్ట్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపు
పెద్ద ఎత్తున కార్యకర్తల ర్యాలీ….అడ్డుకున్న పోలీసులు

శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ నుండి ముట్టడికి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అలాగే బారికేడ్ల్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. కాగా టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని రోజులుగా పేపర్ లీకేజి వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతుంది. దీనితో ప్రతిపక్షాలు అధికార పార్టీ నిర్లక్ష్యంపై ముట్టడికి పిలుపునిస్తున్నాయి. శుక్రవారం ఉదయం షర్మిల, ఆర్‌ఎస్ ప్రవీణ్ కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునివ్వగా..వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.