Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా ప్రజల్లోకి ప్రతిపక్షం..!

Rebels that turn heads into parties

ఎన్నికల్లో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను  చర్చనీయాంశం చేయాలని ప్రతిపక్షం పట్టుపట్టనున్నది.పోతిరెడ్డిపాడు  హెడ్‌రెగ్యులేటర•  సామర్థ్యాన్ని పెంచుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ పోతిరెడ్డి సామర్థ్యం పెంచినట్లయితే నెలరోజుల్లోనే శ్రీశైలం జలాలు ఖాళీ అవుతాయని తెలంగాణ జనసమతి వాదిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును అడ్డుకోవాలని, కృష్ణాజలాల వాటాపైన పోరాటం చేయాలని, కేంద్రాన్ని నిలదీయాలని  ప్రతిపక్షాలన్నీ వాదించనున్నాయి. ఈ అంశాలన్నింటితో ప్రజల్లో అవగాహన కల్పించి, తెలంగాణ  ప్రభుత్వం వైఖరిని ప్రశ్నించాలని కోరనున్నాయి.

మునిసిపల్‌ ఎన్నికల్లో కారు స్పీడుకు బ్రేకులు వేసేందుకు, టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా,విడివిడిగా, కలివిడిగా అనే సూత్రంతో అధికారపక్షాన్ని ఎదుర్కోవాలని పురపోరులో సత్తా చాటాలని విపక్ష నాయకులు ఆలోచనలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు స్థానాలను గెలిచిన కాంగ్రెస్‌, ‌నాలుగుస్థానాల్లో గెలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలని గెలువాలని, మునిసిపల్‌ ‌చైర్మన్‌ ‌పదవులను అందుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేశాయి•.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు వేర్వేరు కార్యాచరణతో ఆందోళనలు నిర్వహించిన పరిస్థితిని గమనించిన ప్రొ. జయశంకర్‌సార్‌ ‌వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించినప్పటికీ, లక్ష్య సాధన నుంచి పక్కకు జరుగవద్దని హితవు చెప్పారు. అదే విధానాన్ని అవలంబించి ప్రతీరాజకీయ పార్టీ గెలవాలని, ఎన్నికలు పూర్తయిన తర్వాత మిగతా విషయాలను చర్చించుకోవచ్చుననే అంచనాలతో ఉన్నాయి.కాగా కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున 5369 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీజేపీ పార్టీ 4179 మంది అభ్యర్థులను పోటీలో నిలబెట్టింది ఎన్నికలు జరుగుతున్న పది కార్పొరేషన్‌లలో 385 వార్డులు ఉన్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు పావులు కదుపుతున్నాయి. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, డబ్బులు పంపిణీ చేసే విషసంస్కృతిపైన విరుచుకుపడ్డారు. కనీసం ఈ ఎన్నికల నుంచైనా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని,ప్రతీ మునిసిపాలిటీలో ప్రజల సమస్యలే ఎజెండా కావాలని పిలుపు నిచ్చారు.డబ్యులు ఎక్కువగా ఖర్చు చేయగల అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే తప్పుడు సంస్కృతిపైన ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కోదండరాం తన లక్ష్యాలను వివరించారు.

ఇటీవల భారత ఉపరాష్ట్రవపతి వెంకయ్య నాయుడు కూడా వోటర్లను కొనుగోలు చేసే క్షుద్ర రాజకీయంపైన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీవోలు ఈ విషసంస్కృతిని తూర్పారపడుతున్నాయి.ఈ అంశాలన్నింటినీ ప్రచారం చేసేందుకు తెలంగాణ జన సమితి ప్రత్యేక కార్యాచరణతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. సిపీఐ, సీపీఎం, ఇతర పార్టీలు ఈ ఆలోచనలను సమర్థిస్తున్నాయి. వీటితోపాటు ఈ ఎన్నికల్లో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను చర్చనీయాంశం చేయాలని ప్రతిపక్షం పట్టుపట్టనున్నది.పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర సామర్థ్యాన్ని పెంచుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ పోతిరెడ్డి సామర్థ్యం పెంచినట్లయితే నెలరోజుల్లోనే శ్రీశైలం జలాలు ఖాళీ అవుతాయని తెలంగాణ జనసమతి వాదిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును అడ్డుకోవాలని, కృష్ణాజలాల వాటాపైన పోరాటం చేయాలని, కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలన్నీ వాదించనున్నాయి. ఈ అంశాలన్నింటితో ప్రజల్లో అవగాహన కల్పించి, తెలంగాణ ప్రభుత్వం వైఖరిని ప్రశ్నించాలని కోరనున్నాయి. వీటితోపాటు గత సంవత్సర కాలంగా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు వచ్చిన వస్తున్న కష్టాలను వివరించనున్నారు. ఈ ఎన్నికల్లో సీఎఎ,ఎన్‌పీఆర్‌ అం‌శాలు ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి, ముస్లిం మైనార్టీ వోట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకే టీఆర్‌ఎస్‌ ఎంఐఎం‌తో దోస్తీ చేస్తున్నదని, సిటిజన్‌ ఎమెండ్‌మెంట్‌ ‌యాక్ట్ ‌విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ‌నిర్ణయాలను వ్యతిరేకించడంలేదని కాంగ్రెస్‌ ‌ప్రచారం చేసేందుకు సిద్దమైంది.కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో టీఆర్‌ఎస్‌ ‌నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని, బకాయిల విషయంలో కేంద్రాన్ని నిలదీయడంలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.తెలంగాణ ఏర్పడ్డాక కొత్తగా 79 మునిసిపాలిటీలు ఏర్పడినప్పటికీ, ఏ మునిసిపాలిటీలో కూడా అవసరమైన సదుపాయాలు లేవని, నిధుల లేమితో కార్పొరేషన్‌లు,కొట్టుమిట్టాడుతున్నాయని కాంగ్రెస్‌, ‌బీజేపీ, సీపీఐ, సీపీఎంపార్టీలు విమర్శిస్తున్నాయి.

గోదావరి కృష్ణా నదుల అనుసంధానంతో తెలంగాణకు జరిగే నష్టాలను, కృష్ణానదిలో లెక్కప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటాను కోల్పోతున్న విధానాన్ని ఎండగొడుతూ ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలను సంధించనున్నారు. ఇదే తరహాలో ఎన్నికల తర్వాత పాలమూరు అధ్యయన వేదిక వంటి సంస్థల ద్వారా కృష్ణాపరీవాహక ప్రాంతంలోని జిల్లాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కరీంనగర్‌, ‌రామగుండం, బడంగ్‌పేట్‌, ‌మీర్‌పేట్‌, ‌బండ్లగూడా జాగీర్‌, ‌బోడుప్పల్‌, ‌పీర్జాగూడా, జవహర్‌నగర్‌, ‌నిజాంపేట్‌, ‌నిజామాబాద్‌ ‌వంటి పది కార్పొరేషన్‌లలో ప్రతిపక్షాలు జెండాలు ఎగురవేయాలనే లక్ష్యంతో ప్రచారపర్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కరీంగనర్‌, ‌నిజామాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌స్థానాలను గెలుచుకున్న ఉత్సాహంతో కార్పొరేషన్‌లను కైవసం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది, హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయి,శాసనసభలో ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ ‌పార్టీ తన పూర్వవైభవాన్ని అందుకునేందుకు కాంగ్రెస్‌‌శ్రేణులను కదిలిస్తున్నది. టీఆర్‌ఎస్‌ ‌నుంచి ఎక్కువ సంఖ్యలో రెబెల్స్ ఉం‌డడం కాంగ్రెస్‌కు కలిసివస్తుందనే అంచనాలతో ప్రతీజిల్లాలో కాంగ్రెస్‌ ‌తన బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నది.పాతజిల్లాలను ప్రాతిపదికగా కార్పొరేషన్‌లను ఏర్పరచినప్పటికీ, ఒకకార్పొరేషన్‌లో కూడా కార్పొరేషన్‌ ‌స్థాయిలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్‌ ‌వాదిస్తున్నది. కాం•గ్రెస్‌ అధికారంలో ఉన్న సందర్భంలో ప్రతీ చిన్న కుగ్రామంలో కూడా పాఠశాల ఉండాలనే నినాదంతో సింగల్‌టీచర్‌ ‌విధానాన్ని తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రేషనలెజేషన్‌ ‌పేరుతో 12వేల పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నదని కాంగ్రెస్‌ ‌ప్రచారం చేయనున్నది. ఈ పాఠశాలలన్నీ, మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఉండడం గమనార్హం. 2014 అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ధనికరాష్ట్రమని, మిగులు రాష్ట్రమని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, 2019 అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం విధానాల వల్లనే రాష్ట్రంలో అప్పులు పెరిగాయని, అందరూ ఆర్థికక్రమశిక్షణ పాటించాలని ప్రకటించిన అంశాలన్నింటినీ మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రాలు కానున్నాయి.వేములవాడ, ధర్మపురి, అలంపూర్‌, ‌వంటి దేవాలయ పట్టణాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించలేదని, ఫలితంగా నేటికి కూడా వెములవాడ వంటి పట్టణం మంచినీటికోసం ఇబ్బందులు పడుతున్నదని ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు.

Tags: Opposition, people agenda, government failures

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy