Take a fresh look at your lifestyle.

ఛత్తీస్‌ఘఢ్‌లో ఎదురుకాల్పులు ..

  • ఒక ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి
  •  భారీగా ఆయుధాలు స్వాధీనం

సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్‌ ‌జిల్లాలోని పర్ధోని పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో పోలీసులకు , మావోయిస్టులకు భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన మదనవాడ ఎస్సై అక్కడిక్కకే మృతి చెందగా పోలీస్‌ ‌కాల్పులకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న పోలీస్‌ ‌బలగాలకు మావోయిస్టులు ఎదురుపడగా పోలీసులు కాల్పులు ప్రారంభించటంతో మావోయిస్టులు కూడ ఎదురుకాల్పులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనలో మావోయిస్టుల కాల్పులకు ఒక ఎస్సై మృతి చెందగా పోలీస్‌ ‌కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలం వద్ద ఒక ఏకె47, ఎస్‌ఎల్‌ఆర్‌ ‌రెఫీల్‌, ‌రెండు 314 బోర్‌ ‌రెఫీల్స్ ‌స్వాదీన పరుచుకున్నారు.

మావోయిస్టులు ఆ ప్రాంతంలో సమావేశమయ్యారనే పక్కా సమాచారంతోనే పోలీస్‌ ‌బలగాలు రంగ ప్రవేశం చేయటంతో ఎదురుకాల్పులకు మావోయిస్టులు దిగినట్లు ఛత్తీస్‌ఘఢ్‌ ‌పోలీసులు వెల్లడిస్తున్నారు. మృతి చెందిన ఎస్సై మదన్‌వాడ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌హౌస్‌ ఆఫీసర్‌ ఎస్‌కె శర్మగా గుర్తించినట్లు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టులు వివరాల్లోకి వెళితే ఉత్తర్‌బస్తర్‌ ‌కాంకేర్‌ ‌డివిసి సభ్యులు అశోక్‌ ఉం‌గాపై 8 లక్షల రివార్డు ఉంది. అలాగే కాంకేర్‌ ఏరియా కమిటి సభ్యులు కృష్ణా నరేటి 5లక్షలు , మోహ్లా ఔతీ సంయుక్త ఎల్‌ఓసి సభ్యులు , సవితా సలైమా ఒక లక్ష, పరిమళ ఒక లక్ష రివార్డులు ఉన్నట్లు ఛత్తీస్‌ఘఢ్‌ ‌పోలీసులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టులలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Leave a Reply