Take a fresh look at your lifestyle.

నేడు రాష్ట్రపతితో విపక్షనేతల భేటీ వ్యవసాయ చట్టాలపై నివేదన

కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలపై రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను, రైతుల వ్యతిరేకతకు కారణాలను వివరించేందుకు బుధవారం సాయంత్రం 5 గంటలకు విపక్ష పార్టీల నేతలు రాష్ట్రపతి కోవింద్‌ను కలవనున్నారు. రాహుల్‌ ‌గాంధీ, శరద్‌ ‌పవార్‌తో పాటు మరో ముగ్గురు రాష్ట్రపతితో భేటీ కానున్నారు.

కోవిడ్‌-19 ‌ప్రొటోకాల్‌ ‌నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం ఉందని సీపీఐ(ఎం) జనరల్‌ ‌సెక్రటరీ సీతారామ్‌ ఏచూరి చెప్పారు. కాగా రైతు సంఘాల నేతలతో కేంద్రం బుధవారం మరోసారి చర్చలు జరపనుంది. రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఇంతవరకు తిరస్కరిస్తూ వచ్చింది. రైతులు సూచించిన సవరణలను చేస్తామని, రద్దు అసాధ్యమని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.

Leave a Reply