Take a fresh look at your lifestyle.

స్వపక్షంలో విపక్షం.. బజారుకెక్కిన బల్దియా లొల్లి..

  • పీర్జాదిగూడ మేయర్‌పై పలువురు కార్పొరేటర్ల అసంతృప్తి..?
  • ఇప్పటికే పలు అంశాలపై మంత్రి, జిల్లా అధికారులకు ఫిర్యాదులు..

పార్కు స్థలాలు కబ్జా అవుతున్నాయి…ప్రభుత్వ స్థలాలు దిగమింగుతున్నారు..అనుమతి లేని కట్టడాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి..హరితహారం కార్యక్రమాల్లో అవినీతి చోటుచేసుకుంది కోట్ల రూపాయలు మింగేశారు.. కౌన్సిల్‌ ‌సమావేశాలకు విలువ లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..ఈ ఆరోపణలు చేస్తున్నది విపక్షాలనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. కాదు..కాదు…అధికార పక్షానికి చెందిన కార్పొరేటర్లే. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ ‌కౌన్సిల్‌ ఏర్పడి సుమారు రెండేళ్ళు సమీపిస్తుంది. 26 డివిజన్లు ఉన్న పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ మెజారిటీ డివిజన్లలో గెలుపొంది మేయర్‌, ‌డిప్యూటీ స్థానాలు దక్కించుకుంది. దీంతో కార్పొరేటర్లుగా విజయం సాధించిన జక్కా వెంకట్‌ ‌రెడ్డి మేయర్‌గా, కుర్ర శివకుమార్‌ ‌గౌడ్‌ ‌డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోబడ్డారు. అప్పట్లో కొన్ని స్థానాల్లో మాత్రం కాంగ్రెస్‌ ‌పార్టీ, బీజేపీ తరపున కార్పొరేటర్లుగా గెలిచినా కొన్నాళ్ళకు వారు కూడా అధికార పార్టీ పంచన చేరి కారెక్కేశారు. దాంతో పీర్జాదిగూడలో అప్పటి నుంచి ప్రతిపక్షం అనే మాట లేకుండా పోయింది. అయితే ఇటీవలి కొంత కాలం నుంచి 8, 9, 10, 11,, 12, 13, 14, 22, 23 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కమై యర్‌ ఒం‌టెద్దు పోకడలు పోతూ అభివృద్ది పనుల్లో తమ డివిజన్లకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వడం లేదని , పూర్తిగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని బల్దియాలో చోటు చేసుకుంటున్న అవినీతిపై అస్త్రాలు ఎక్కుపెట్టారు.

గతంలో వీరితో అత్యంత సన్నిహితంగా ఉన్న మేయర్‌ ‌ప్రస్తుతం వీరిని పట్టించుకోకుండా ఉండడం వీరంతా ఏకతాటిపైకి వొచ్చేలా చేసిందని వినికిడి. ఈ క్రమంలోనే బల్దియా పరిధిలోని పలు లేఅవుట్లలో ప్రజోపయోగ•(పార్కు, బడి, గుడి, కమ్యూనిటీ హాలుకు తదితరాలకు కేటాయించినవి) స్థలాలు పరాధీనమవుతున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టడాలు ప్రోత్సహిస్త్తున్నారంటూ, బల్దియా ఆదాయానికి గండికొట్టేలా అనుమతి లేని కట్టడాలు ప్రోత్సహిస్తున్నారంటూ మంత్రి మొదలుకుని జిల్లా కలెక్టర్‌, ‌మున్సిపల్‌ ఉన్నతాధికారులకు సైతం లిఖితపూర్వక ఫిర్యాదులతో అవినీతిపై సమరానికి సయ్యంటూ అప్రకటిత యుద్ధం ప్రకటించారు. తాజాగా హారితహారం పథకంలోనూ నిధులు గోల్‌మాల్‌ అయ్యాయని, భారీ అవినీతి చోటుచేసుందని ఫిర్యాదు చేశారు. దీంతో పీర్జాదిగూడ రాజకీయాల్లో ప్రకంపనలకు ఇది నాందియని, ప్రతిపక్షం లేని లోటును సదరు కార్పొరేటర్లు భర్తీ చేస్తున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే గాకుండా మేయర్‌ ‌సొంత పార్టీ టీఆర్‌ఎస్‌ ‌పీర్జాదిగూడ కార్పొరేషన్‌ అధ్యక్షుడితో సైతం విభేదాలు ఉండడం, గతంలో అధ్యక్షుడు వేసిన పార్టీ కమిటీకి పోటీగా మరో కమిటీ ప్రకటించడం వీరిద్దరి మధ్య మరింత అగాధాన్ని పెంచిందని కొందరు పేర్కొంటున్నారు. ఇటు సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు పలువురు అసంతృప్తితో బహిరంగంగా అధికారులకు ఫిర్యాదులు చేస్తూ రచ్చకెక్కుతుండడం అటు సొంత పార్టీ అధ్యక్షుడితో విభేదాలు కొనసాగించడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయనేది వేచిచూడాల్సిందే.

Leave a Reply