Take a fresh look at your lifestyle.

‘‌పెగాసెస్‌’ ‌పై ప్రధాని వివరణకు విపక్షాల డిమాండ్‌

  • ‌లోక్‌ ‌సభ ఎనిమిది సార్లు వాయిదా
  • రాజ్య సభలోనూ గందరగోళం
  • పార్టమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన
  • పార్లమెంట్‌ ‌సాగాలనే విపక్షాలు కోరుకుంటున్నాయి : మల్లికార్జున ఖర్గే

మంగళవారం కూడా లోక్‌సభలో అదే తంతు కొనసాగింది. సభ ప్రారంభంకాగానే పెగాసెస్‌, ‌వ్యవసాయ చట్టాలపై చర్చకు పట్టుబడుతూ… విపక్షాలు పోడియంను చుట్టు ముట్టాయి. పెగాసెస్‌ ‌వ్యవహారంపై ప్రధాని వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేశాయి. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. గందరగోళం మధ్యే సభలో స్పీకర్‌ ‌ప్రశ్నోత్తరాల కాలం చేపట్టినప్పటికీ సభ కొద్ది సేపటికే వాయిదా పడింది. స్పీకర్‌ ‌సభను 11.45కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్‌ ‌స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ ‌సభను 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం మళ్లీ ప్రారంభమైన సభకు ప్రతిపక్షాలు అడ్డు తగిలాయి. జీరో అవర్‌ ‌ముఖ్యమైందని, దేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు ఈ సమయంలో లేవనెత్తవొచ్చని, సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని, ఆందోళన ఆపాలని రాజేంద్ర అగ్వరాల్‌ ‌ప్రతిపక్షాలను కోరారు. కేంద్ర మంత్రులు సైతం ప్రతిపక్షాలను నిరసన ఆపాలని కోరారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

కానీ, విపక్షాలు పెగసెస్‌, అ‌గ్రి చట్టాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను పట్టుకొని వెల్‌ ‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్‌ ‌ప్రొసిడింగ్స్‌ను అడ్డుకోవడంతో పాటు, స్పీకర్‌ని కవర్‌ ‌చేసే కెమెరాలకు ప్లకార్డులను అడ్డు పెట్టారు. దీంతో రాజేంద్ర అగర్వాల్‌ ‌సభను 2 గంటలకు సభ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ…గందరగోళం నెలకొనడంతో మళ్లీ 2:30కు వాయిదా పడింది. అనంతరం సభ సజావుగా సాగే పరిస్థితులు లేకపోవడంతో… మోదట 3 గంటలకు, తర్వాత 3:30కు, ఆ తర్వాత 4 గంటలకు, అనంతరం 4:30కి వాయిదాలు పడుతూ వొచ్చింది. చివరగా తిరిగి ప్రారంభమైన సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ‌చైర్‌లో ఉన్న బత్రుహారి మెహతబ్‌ ‌ప్రకటించారు. కాగా, సభ ప్రారంభానికి ముందు పెగసెస్‌ ‌స్పైవేర్‌ ‌ప్రాజెక్ట్ అం‌శంపై చర్చకు కాంగ్రెస్‌ ఎం‌పీలు మనీష్‌ ‌తివారి, మాణికం టాగూర్‌లు వాయిదా తీర్మానం ఇచ్చారు. అస్సాం, మిజోరాం బార్డర్‌ ‌ఘర్షణలపై కాంగ్రెస్‌ ‌డిప్యూటీ లీడర్‌ ‌గౌరవ్‌ ‌గొగోయి వాయిదా తీర్మానాలు స్పీకర్‌కు సమర్పించారు.

రాజ్య సభలోనూ గందరగోళం
రాజ్య సభ ప్రారంభం కాగానే…రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కడంపై చైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ ‌సమీపంలోని చారిత్రకాత్మకమైన రుద్రేశ్వర టెంపుల్‌(‌రామప్ప)కు యునెస్కో వరల్డ్ ‌హెరిటేజ్‌ ‌స్టేటస్‌ ‌గుర్తింపు ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం 38 వరల్డ్ ‌హెరిటేజ్‌ ‌స్టేటస్‌ ‌పొందిన కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందాయి. రామప్ప 39వ గుర్తింపు పొందిన కట్టడంగా నిలిచింది. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం దేశానికి గర్వకారణం. రామప్ప గుడి నిర్మాణం, అద్బుతమైన కళా నైపుణ్యం, శిల్పాలు కాకతీయుల కళా వైభవానికి సాక్ష్యం. దాదాపు 40 ఏండ్లు ఈ ఆలయ నిర్మాణం జరిగింది’ అని వెంకయ్య నాయుడు సభ్యులకు వివరించారు. సభ తరపున దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఐతే చైర్మన్‌ ‌ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులంతా రామప్ప గొప్పదనాన్ని తెలుసుకోవాల్సి ఉందని, కొద్ది సేపు ఓపిక పట్టండంటూ విపక్షాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీచ్‌ అనంతరం రామప్పకు యునెస్కో గుర్తింపుపై ఎగువ సభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

సభలో బల్లలు చరుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సభ ప్రొసిడింగ్స్ ‌ప్రారంభిస్తున్నట్లు చైర్మన్‌ ‌ప్రకటించడంతో విపక్ష నేతలు వెల్‌లోకి దూసకెళ్లి ఆ ందోళన చేపట్టారు. దీంతో సభ 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభం కాగా, విపక్షాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. దీంతో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ ‌నఖ్వీ ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వివరణ కోరడం సరికాదన్నారు. మాస్క్ ‌లు లేకుండా వెల్‌ ‌లోకి దూసుకెళ్లి విపక్షాలు కొరోనా నిబంధనల ఉల్లంఘనిస్తున్నాయన్నారు. ఇలాంటి చర్యల వల్ల పోడియం ముందు ఉండే అధికారులకు వైరస్‌ ‌సోకుతుందని, థర్డ్ ‌వేవ్‌ ఆస్కారం ఉందని అన్నారు. అయితే, సభ సజావుగా సాగే పరిస్థితి లేకపోవడంతో డిప్యూట్‌ ‌చైర్మన్‌ ‌హరివంశ్‌ ‌నారాయణ్‌ ‌సభను 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే డిప్యూటీ చైర్మన్‌ ‌సభను 4 గంటలకు వాయిదా వేసారు. అనంతరం సభ మళ్లీ ప్రారంభమైనా…చర్చ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో హరి వంశ్‌ ‌నారాయణ్‌ ‌సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

పార్లమెంట్‌ ‌సాగాలనే విపక్షాలు కోరుకుంటున్నాయి : మల్లికార్జున ఖర్గే
పార్లమెంటుఉభయ సభలు పనిచేయాలనే ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని రాజ్య సభ కాంగ్రెస్‌ ‌పక్షనేత మల్లి కార్జున ఖర్గే అన్నారు. అయితే, పెగాసెస్‌, ‌వ్యవసాయ చట్టాలు, ఇతర అంశాలపై అర్థవంతమైన చర్చ జరపాలని తాము పట్టుబడుతున్నట్లు స్పష్టం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎలాంటి చర్చలు జరపడానికి ఇష్టపడడం లేదని ఆరోపించారు. అసలు ప్రధాని మోడీ పార్లమెంట్‌లో చర్చ జరిపేందుకు ఎందుకు భయపడుతున్నారని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

Leave a Reply