Take a fresh look at your lifestyle.

సిఏఏ వ్యతిరేక తీర్మానంపై విపక్షాల హర్షం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ)ను వ్యతిరేకిస్తూ సోమవారం రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడాన్ని బిజెపి మినహా దాదాపు అన్నిపార్టీలు హర్హం వ్యక్తం చేస్తున్నాయి. ఎంఐఎంతోపాటు పలు ముస్లిం సంస్థలు, ప్రజలు ఈ తీర్మానం చేయడంపట్ల తమ సంతోషాన్ని వ్యక్తంచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర ముస్లింలు కూడా పోటీలుపడుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు. శాసనసభ సమావేశాల చివరిరోజైనా సోమవారం పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్నార్సీ), జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్పీఆర్‌)‌లను వ్యతిరేకిస్తూ రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు.

పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైనదని, కులమతాలకు అతీతమైన లౌకిక రాజ్యం, చట్టంముందు అందరూ సమానమన్న రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా దీన్ని అమలు చేయాలనుకోవడం సరైందికాదన్న విషయాన్ని కెసిఆర్‌ ఈ ‌సందర్భంగా సభకు, తద్వార రాష్ట్ర ప్రజలకు విపులీకరించారు.ఈ చర్య భారతదేశ మూల సూత్రాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానించడమే అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత ఎదురవుతున్నది, వివిధ వర్గాల్లో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌వచ్చినప్పుడు దేశ రాజధాని నగరంలో జరిగిన విద్వంసకాండ, పదుల సంఖ్యలో మృత్యువాత పడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారరు. కేంద్ర ప్రభుత్వం దీన్ని పునసమీక్షించాల్సిందేనంటూ శాసనసభలో కెసిఆర్‌ ‌గంభీరంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు.

ఒక నిర్ధిష్టమతానికి చెందిన వారిని ఈ జాబితానుండి తొలగించడం రాజ్యాంగ సూత్రాల ప్రకారంకూడా సరైందికాదు, భారత భూభాగంలో పుట్టినవారెవరైనా వారి తల్లిదండ్రులు పుట్టిన తేదీ,జన్మస్థలంలాంటి వివరాలతో కూడిన పత్రాలను చూపించాలనడం నిజంగానే ప్రజలను అయోమయానికి గురిచేయడమవుతుంది. ప్రతీదేశానికి ఒక పౌరసత్వచట్టం ఉండాల్సిదేగాని అది ప్రజలను ఇబ్బందిపెట్టేదిగా కాకుండా, ప్రజలకు మరింత సౌకర్యాన్ని కలిగించేదిగా ఉండాలి. సంకుచితత్వంతో కూడుకున్నదై ఉండకూడదు. అలాఅని దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా దేశద్రోహులై పోతారనడం కూడా భావ్యంకాదు. మతపరంగా, భాషాపరంగా కొందరిని వేరుచేసి చూసేవిధానాన్ని మాత్రమే వ్యతరిరేకిస్తున్నామన్న విషయాన్ని కేంద్ర గ్రహించాల్సిఉంది. తగిన పత్రాలను చూపించలేకపో యినంతమాత్రాన వీరంతా దేశంలో ఉండకుండా ఎక్కడి పోతారు, ఎలా పోతారు.వివిధ దేశాలనుంచి వివిధ కారణాలతో కాందిశీకుల పేరుతో మనదేశానికి వలసవచ్చేవారి పరిస్థితేమిటి, ఇది కేవలం హిందూ, ముస్లింల సమస్యగా చూడకుండా అనేక సమస్యలతో ముడివడిఉన్నందునే దీన్ని వ్యతిరేకిస్తున్నాం.

- Advertisement -

వ్యతిరేకించిన వారంతా దేశద్రోహులన్నవిధంగా బిజెపి ప్రచారం చేయడం, ప్రజలను భావోద్వేగాలతో రెచ్చగొట్టడం సమంజసంకాదంటూ కెసిఆర్‌ ‌సుదీర్ఘంగా దీనిపై చేసిన ప్రసంగాన్ని శాసనసభలో ఉన్న ఏకైక బిజెపి అభ్యర్థి రాజాసింగ్‌ ‌తప్ప అందరూ హర్షించారు.ఈ తీర్మానం ఏగ్రీవంగా ఆమోదంపొందటంతో రాజాసింగ్‌ ‌తీవ్రంగా వ్యతిరేకించారు. సిఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామాచేయడంతోపాటు, తెలంగాణనుండే వెళ్ళిపోతానని ఘాటుగానే స్పందించాడు. రాజకీయ దురుద్దేశ్యంతోనే కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్న రాజాసింగ్‌, ‌శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఆయన సిఏఏ ప్రతులను చించివేసి తన నిరసన తెలియజేశారు.కాగా, ఎంఐఎంతో పాటు కాంగ్రెస్‌ ‌సభ్యులు దీన్ని స్వాగతించారు. అయితే తీర్మానం చేయడంతో సరిపెట్టు కోకుండా తెలంగాణలో దీన్ని అమలుచేయబోమని కేరళలోలాగా జీవో తీసుకురావాలని కాంగ్రెస్‌ ‌శాసన సభ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి సూచనచేశారు. రాష్ట్రంలో చేసిన తీర్మానాన్ని కేంద్రం పరిగనలోకి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పట్టుపట్టాలని కూడా ఆయన సూచించారు.

తెలంగాణ శాసనసభ సిఏఏను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానంపట్ల సిపిఎం హర్హం వ్యక్తంచేసింది.ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ తీర్మానాన్ని తమ పార్టీ స్వాగతిస్తున్నదన్నారు. రాజ్యాంగ మూల సూత్రాలకు విఘాతం కలిగిస్తున్న చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాల్సిందేనన్నారు. ఈ చట్టం కేవలం హిందూ,ముస్లిం మతాలకు సంబంధించిందికాదని, దేశంలోని నిరక్ష్యరాస్యులైన పేదలందరినీ ఇబ్బంది పెడు తుందని, యావత్‌ ‌దేశానికే ఈ చట్టం వ్యతిరేకిగా ఉంటు ందన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశంలోని ఏడు రాష్ట్రాలు సిఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి. అందులో కేరళ ముందుండగా, పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌డ్‌, ‌మధ్యప్రదేశ్‌తోపాటు దేశ రాజధాని అయిన ఢిల్లీ శాసనసభలుకూడా దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసిన విషయం తెలియంది కాదు.

Tags: State Chief Minister KCR has opposed the Citizenship Amendment Act (CAA), National Citizens’ Register (NNRC) and National Population Register (NPR)

Leave a Reply