వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నిరుపేదలకు ఆపద్బంధు.. సిఎం సహాయ నిధి

January 29, 2020

“హొనియోజకవర్గంలోని 47 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ ‌చెక్కులు అందజేత•హొచెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీష్‌ ‌రావు”

Opportunity for the poor .. CM relief fund

ప్రజాతంత్ర బ్యూరో, సిద్ధిపేట: నిరు పేదలకు ఆపద్భాందవు.. ముఖ్యమంత్రి సహాయ నిధి. పేదలు సాయం.. పొందేందుకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట నియోజకవర్గమే నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అర్బన్‌ ‌మండలం నలుగురికి రూ.75వేలు, సిద్ధిపేట రూరల్‌ ‌మండలం-11 మందికి •రూ3.42లక్షలు, నారాయణ రావుపేట మండలంలో 08 మందికి రూ.2.48లక్షలు, నంగునూరు మండలంలో 04 మందికి రూ.1.35లక్షలు, చిన్నకోడూర్‌ ‌మండలంలో 20 మందికి రూ.5.90లక్షలు చొప్పున్న నియోజకవర్గ పరిధిలోని మొత్తం 47 మందికి రూ.

13లక్షల 10 వేల రూపాయలు సీఏంఆర్‌ఎఫ్‌ ‌చెక్కులను లబ్ధిదారులకు బుధవారం ఉదయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని తన నివాసంలో మంత్రి హరీశ్‌ అం‌దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తమ పార్టీ వారికే సీఎం సహాయ నిధి చెక్కులు ఇచ్చారని, కానీ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో ఎలాంటి తారతామ్యాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి నిరుపేదలకు సీఏంఆర్‌ఎఫ్‌ ‌చెక్కులు అందిస్తూ సహకరిస్తున్నట్లు తెలిపారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు, జడ్పిటిసి కోటగిరి శ్రీహరి గౌడ్‌,‌కౌన్సిలర్లు,వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Municipal Chairman Rajanasar, JudPTCC Kotagiri Srihari Goud, Councilors, Public Representatives of various