Take a fresh look at your lifestyle.

రావాలనుకునే వారందరికి అవకాశం..!

  • రెండో దశ వందే భారత్ మిషన్ కు సన్నాహాలు
  • కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
కొరొనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు రెండో దశ వందేభారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేస్తున్నది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  జి.కిషన్ రెడ్డి తెలిపారు. మే 16 నుంచి 22 వరకు 31 దేశాలలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావటానికి సుమారు 149 విమానాలను వివిధ దేశాలకు కేంద్రం పంపనుంది అని మంత్రి తెలిపారు. రెండో దశలో భాగంగా తెలంగాణకు 16, ఆంధ్రప్రదేశ్ కి 9, కర్ణాటక-17, కేరళ-31, ఢిల్లీ-22, గుజరాత్-14, రాజస్థాన్-12, పంజాబ్-7 బీహార్, ఉత్తరప్రదేశ్ లకు 6 చొప్పున, చండీగఢ్-2 మహారాష్ట్ర-1 మధ్యప్రదేశ్-1, జమ్మూ కాశ్మీర్-1 చొప్పున విమానాలు కేటాయించడం అయినది అని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
సింగపూర్, అమెరికా, కెనడా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఖతార్, ఇండోనేషియా, ఉక్రెయిన్, కజకిస్తాన్, ఒమన్, మలేషియా, ఫిలిప్పీన్స్, రష్యా, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, జార్జియా, కువైట్, జర్మనీ, తజకిస్తాన్, బహ్రెయిన్, ఆర్మేనియా, థాయిలాండ్, బెలారస్, నైజీరియా, ఇటలీ, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల నుండి మొత్తం 149 విమానాల ద్వారా భారతీయులను తీసుకు రనున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండో దశ తరలింపులో కూడా ప్రయాణికులను ఎంపిక చేసే విషయంలో భారతీయులకు ముఖ్యంగా మన దేశ పాస్ పోర్ట్ ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్న వారిని, అత్యవసరమైన వారికి ప్రాధాన్యత ఇచ్చి స్వదేశానికి తీసుకురానున్నామని అని కిషన్ రెడ్డి తెలిపారు. నిరంతరం జరిగే తరలింపు కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో భారత్ కు రావాలనుకున్న భారతీయులందరిని త్వరలో తీసుకువస్తామని, విదేశాలలో ఉన్న భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి ప్రకటించారు.

Leave a Reply