Take a fresh look at your lifestyle.

ఆపరేషన్‌ ‘‌మావో’ మిషన్‌ ‌కొరోనా వైరస్‌

“అటవీ ప్రాంతంలోని చుట్టు ప్రక్కల పరిసర ప్రాంతాలలోని గ్రామాలలో పోలీసులు నిఘా నేత్రాన్ని మరింత పదును పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొరోనా వైరస్‌కు అందాల్సిన టీకా, ఇతర వైద్యం ఎలా అందుతుందనే విషయాన్ని గమనించడం ద్వారా పోలీసు వర్గాలు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనే• ప్రయత్నంలో నిమగ్నమైనారని చెప్పవొచ్చు. మావోయిస్టు సానుభూతిపరులు మిలిటెంట్ల వ్యవస్థకు వైద్యం అందే మార్గాలను కట్టు దిట్డం చేసి, ఫలితంగా కొరోనా వైరస్‌ ‌ప్రభావాన్ని పసిగట్టి భవిష్యత్తు కార్యక్రమాలను రూపుదిద్దేదుకు పోలీసు అధికారులు అడుగులు వేస్తున్నట్లు భావించవొచ్చు.”

  • మావోయిస్టులకు చెక్‌ ‌పెట్టేందుకు సరికొత్త వ్యూహం.
  • కోవిడ్‌ ‌పేషంట్లకు ఎర వేస్తున్న పోలీసులు.
  • కేంద్ర నాయకత్వ ఇండ్లను ఆశ్రయిస్తున్న రామగుండం సీపి

(నాయిని మధునయ్య) దండకారణ్యం, పరిసర గ్రామాలలో విరివిగా పెరుగుతున్న మావోయిస్టు క్యాడర్‌ను ఎప్పటికప్పుడు పసిగడుతున్న పోలీసులు మావోయిస్టు లకు చెక్‌ ‌పెట్టేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాత్మకమైన రచనలతో ముందుకు వెళ్తున్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌ ‌పరిధిని ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, ‌జార్ఖండ్‌ ‌తదితర ప్రాంతాల్లో దండకారణ్యం కేంద్రంగా ఉంటున్న మావోయిస్టుల శిబిరాలను అంతమొందించడానికి తాజాగా పోలీసులు సరికొత్త వ్యూహం వేసినట్లు తెలిసింది. సాదా సీదాగా నడుస్తున్న మావోయిస్టుల కార్యక్రమాలు ఇటీవలి కాలంలో దేశాన్ని గడ గడ లాడిస్తున్న కరోణ మహమ్మారి రోగం మావోయిస్టుల పాలిట పెను శాపంగా తయారయింది. కొరోనా మహమ్మారి బారిన పడ్డ ఇద్దరు ముగ్గురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు భారతక్క, హరిభూషన్‌, ఐతూ లాంటి ముఖ్య క్యాడర్‌ ‌నాయకులు మృతి చెందినట్లు మావోయిస్టు నాయకత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీపీఐ ఎంఎల్‌ ‌మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అతి ముఖ్య మైన నాయకులకు, కొంత మంది మిలిటెంట్లకు సైతం వైరస్‌ ‌బారిన పడినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే రామగుండం పోలీసు కమిషనరేట్‌, ‌సీపి వీ సత్యనారాయణ, మావోయిస్టుల అడుగులను అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు కనిపిస్తుంది.

అదే క్రమంలో ఇటీవల పెద్దపల్లి పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్ర నాయకుడు వల్లావజ్జుల వేణుగోపాల్‌ ‌రావు ఇంటికి రామగుండం సిపి వీ సత్యనారాయణ స్వయంగా వెళ్లి ఆయన తల్లి మదురమ్మ, కుటుంబ సభ్యులను పలకరించారు. అలాగే మరో ఇద్దరు ముగ్గురు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు పుల్లూరు ప్రసాద రావు, కంకనాల రాజారెడ్డి కుటుంబాలను కలిసారు. అదిలాబాదు(మంచిర్యాల) జిల్లా బెల్లంపెల్లికి చెందిన మరో సీనియర్‌ ‌సెంట్రల్‌ ‌కమిటీ సభ్యులు కటకం సుదర్శన్‌(ఆనంద్‌) ‌లాంటి అగ్ర నాయకుల ఇండ్లకు రామగుండం సిపి సత్యనారాయణ స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించి మాట్లాడటం గమనార్హం. అంతే గాక మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు కొరోనా వైరస్‌ ‌సోకి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే వారికి మానవతా ధృక్పథంతో వారికి చికిత్స చేయిస్తామని ప్రకటించారు.

వీరికి మానవీయ కోణంతో అన్ని విధాల సహాయం అందజేయడం, ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన ఇతర సహాయం కూడా అందే విధంగా సహకరిస్తామని తెలిపారు. అంటే గతంలో పోలీసులను ఆశ్రయించిన వారికి కూడా ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం అందించేందుకు సహకరిస్తామని సీపి ప్రకటించారు. అంటే పోలీసు వ్యవస్థ కూడా మావోయిస్టుల సమాచారం సేకరణలో ఏ స్థాయిలో ఉంటుందనేది మనకు స్పష్టమవుతుంది. పోలీసు ఇంటలిజెన్స్ ‌వ్యవస్థ ‘నిఘా’ విభాగం అత్యంత ప్రాముఖ్యతతో పని చేస్తుందని పరిశీలకులు, పలు వర్గాలు అంచనా వేస్తున్నారు. దండకారణ్యం అటవీప్రాంతంలో అత్యంత రహస్యంగా. రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న పార్టీ కదలికలు, వారి కార్యకలాపాల సమాచారాన్ని ఎంతో చాకచక్యంగా సేకరించడంతో పాటు వ్యూహ ప్రతి వ్యూహాత్మక రచనలు చేస్తూ పైచేయి కోసం పోలీసు వ్యవస్థ అడుగులు వేస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పాత్రికేయ వర్గాలు అంచనా వేస్తున్నారు.

మిలిటెంట్లపై ముప్పెట దాడి చేస్తున్న కొరోనా వైరస్‌
‌దండకారణ్యం, అటవీప్రాంతాలను ఆనుకొని ఉన్న గిరిజన ప్రాంతాల గ్రామాలలో ఉన్న మావోయిస్టు సానుభూతి పరుల వ్యవస్థపై కూడా వైరస్‌ ‌దాడిని పోలీసులు పసిగట్టడం, అంచనావేయడంలో పూర్తిగా సఫలీకృతం అయ్యారని చెప్పవొచ్చు. మావోయిస్టు నేతలు కొరోనా వైరస్‌ ‌భారీన పడినట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు మావోయిస్టు నాయకుల ఇండ్లకు వొచ్చి వారి కుటుంబ సభ్యులతో మంచి చెడు విషయాలను సమీక్షించడం ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం. మావోయిస్టు పార్టీ అంతకు ముందు కొరోనా వైరస్‌ ‌తమ క్యాడర్‌కు సోకిందన్న వార్తలను అదేమి లేదని కొట్టి పారేసింది. కానీ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు హరిభూషన్‌, ‌భారతక్క లాంటి నాయకులు కొరోనా మహమ్మారితొ మ్రుత్యువాత పడటంతో అనివార్యంగా మావోయిస్టు నాయకత్వం ఆ విషయాన్ని ప్రకటించింది. అంటే మావోయిస్టు క్యాడర్‌ ‌కొరోనా ప్రభావం అతిగానే ఉందన్న పోలీసు నిఘా వర్గాల నివేదిక నూటికి నూరు శాతం నిజమని నిరూపిస్తూంది.

క్యాడర్‌ ‌వైద్య సేవలపై పెరిగిన నిర్బంధం?
దేశ వ్యాప్తంగా పెరిగిన నిర్బంధం అణిచి వేత కారణంగా దండకారణ్యంలోనే కేంద్ర స్థావరాలు ఏర్పరచుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్న మావోయిస్టులకు అందే వైద్యంపైనే నిఘా వర్గాలు దృష్టి కేంద్రీకరించాయని చెప్పవొచ్చు. అటవీ ప్రాంతంలోని చుట్టు ప్రక్కల పరిసర ప్రాంతాలలోని గ్రామాలలో పోలీసులు నిఘా నేత్రాన్ని మరింత పదును పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొరోనా వైరస్‌కు అందాల్సిన టీకా, ఇతర వైద్యం ఎలా అందుతుందనే విషయాన్ని గమనించడం ద్వారా పోలీసు వర్గాలు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనే• ప్రయత్నంలో నిమగ్నమైనారని చెప్పవొచ్చు. మావోయిస్టు సానుభూతిపరులు మిలిటెంట్ల వ్యవస్థకు వైద్యం అందే మార్గాలను కట్టు దిట్డం చేసి, ఫలితంగా కొరోనా వైరస్‌ ‌ప్రభావాన్ని పసిగట్టి భవిష్యత్తు కార్యక్రమాలను రూపుదిద్దేదుకు పోలీసు అధికారులు అడుగులు వేస్తున్నట్లు భావించవచ్చు. మావోయిస్టుల జీవితాలను పరోక్షంగా అధ్యయనం చేస్తున్న పోలీసు నిఘా వర్గాల నివేదికల పలితమే ‘కొరోనా’ ఆపరేషన్‌ ‌సక్సెస్‌ ఆధారపడి ఉంటుందని మేధావి వర్గాలు అంచనవేస్తున్నాయి. ఈ అన్వేషణలో భాగంగానే ఇటీవల గోదావరిఖని ఎన్డీపీసిలో రామగుండం పోలీసు కమీషనరేట్‌ ‌పరిధిలోని పోలీసు అధికారులను రాష్ట్ర పోలీసు బాస్‌ ‌సమావేశ పరిచి మావోయిస్టుల పట్ల అప్రమత్తతకు మరింత పదును పెట్టే విధంగా అలర్ట్ ‌చేసినట్లు పలు రాజకీయ, మేధావి వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply