Take a fresh look at your lifestyle.

ఆపరేషన్‌ ‌విజయ్‌ @ ‌కార్గిల్‌

భారత•సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేసి, కార్గిల్‌ ‌వైపుగా వెళ్లే రహదార్లను మూసి వేసి పాక్‌ ‌సైన్యానికి, ముష్కరులకు ఏం వెళ్లకుండా చేసినట్లు నిరోధించ గలిగారు.. పాక్‌ ‌సైన్యం కార్గిల్‌ ‌కొండలనుంచి దిగుతున్నప్పుడు భారీ ప్రాణ నష్టం సంభవించిందని అధికారిక వర్గాలవెల్లడి.
‘’వారు తిరిగి రావడానికి దారిలేదు. వాహనాలూ లేవు. 16 వేలనుంచి 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల మధ్యలో గుంతలు ఉండటం, గడ్డకట్టేచలి, మరోవైప •కాచుకొని ఉన్న భారత ఆర్మీని తప్పించుకొని రావడం కష్టసాధ్యం అయింది. ఇదే సమయంలో కార్గిల్‌లో భారత ప్రభుత్వం వాయు సేనను సమర్థంగా వినియోగించుకుంది. నేలపై ఉన్న సైన్యానికి, వాయుసేన పూర్తి అండగా నిలువగా, భోఫోర్స్ ‌ఫిరంగుల గర్జనకు పాక్‌ ‌హడలిపోయింది.

సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజున దాయాదీ పాకిసాన్‌పై భారత్‌ అఖండ విజయాన్ని సాధించింది.. దొడ్డి దారిన కళ్లు గప్పి మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్కు గుణపాఠం చెప్పిన రోజు. భారత భూభాగాన్ని ఆక్రమించు కోవాలనుకున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై మన సైన్యం సాధించిన అసామాన్య విజయమిది. వందలమంది సైనికుల ప్రాణత్యాగాలకు ఫలితం ఆవిజయం.. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగదెబ్బతీయాలన్న పాక్‌ ‌పన్నాగాన్ని మటి్ట కరిపించి.. ‘‘మా దేశాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి’’ అని పరోక్షంగా భారతీయులందరూ ఆదేశానికి ఇచ్చిన హెచ్చరిక. దీనికి భారత సైన్యం పెట్టుకున్న కోడ్‌నేమ్‌.. ‘ఆపరేషన్‌ ‌విజయ్‌’. ‌దీనినే విజయ్‌ ‌దివాస్‌గా దేశ ప్రజలు జరుపుకుంటారు. భారత యుద ్ధవ్యూహాలలో అత్యంత ప్రాధాన ్య మైనదిగా కార్గిల్‌ ‌యుద్ధాన్ని రక్షణ నిపుణులు పేర్కొంటారు. కార్గిల్‌ ‌ప్రాంతం రక్షణ పరంగా భారత్‌కు అత్యంత కీలకమైనది.. దీనిని కైవసం చేసుకుంటే లడఖ్‌ను కైవసం చేసుకుని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌ను తమ వశం చేసుకోవాలన్నది పాక్‌ ‌పన్నాగం. కార్గిల్‌ ‌ప్రాంతంతం వైపుగా ఉన్న పాక్‌సేనలకు భారత సైనికులు సులభంగా కనిపిస్తారు.. దీనితో మన సైనికులకు యుద్ధం చేయడం చాలా కష్టమైన పని.. భారత్‌ ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేదు కాబట్టి, భారత సైన్యం పలచబడి, పాకిస్తాన్‌కూ అనుకూలంగా మారుతుందని దాయాదీ దేశం పన్నాగం.

యుద్ధం ఎలా మొదలైందంటే?
హిమాలయ పర్వతాల్లో నిఘర్‌కోం అనే గ్రామంలో తషీనామాగ్యాల్‌ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్‌-‌పాక్‌ ‌సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలా మంది సైనిక దుస్తుల్లో భారత్‌ ‌భూ•భాగంలోకి దాటుకుని వచ్చి బంకరు్ల తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్‌ ‌సైనికులని నిర్ధారించుకున్న తషీ, వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్‌ ‌సౌరభ్‌ ‌కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్‌ ‌సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి ఇదే మొదటి అడుగు. ఇక ఆ తరువాత దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేరచొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. దీనిపై భారతసైనిక శిబిరాలు ఎన్ని హెచ్చరికలు చేసినా.. పాకె•సైన్యం పట్టించుకోక పోవడంతో భారత్‌ ‌సైని• •చర్య చేపట్టింది. ఆపరేషన్‌ ‌విజయ్‌ ‌పేరుతో 1999, మే 3న భార• •సైన్యం రంగంలోకి దిగింది.పాక్‌ ‌దళాలు యుద్ధం మొదట్లో భారత సైన్యానికి తీవ్రనష్టాన్ని కలిగించాయి. అసలు ఏంజరుగుతోందో భారత ఆర్మీకి కొన్ని రోజుల వరకు తెలియలేదు. పాకిస్తాన్‌ ‌ముందస్తువ్యూహంతో పర్వతాలపైన ఉండటం, మొదట్లో పాకిస్తాన్‌ ‌సైన్యానికి ప్రయోజనం కలిగించింది. పైనుంచి వారు భారత జవాన్లపై సులభంగా దాడిచేశారు. కానీ, తర్వాత పరిస్థితి మారింది. ఏ ం జరుగుతోందో భారత ఆర్మీనెమ్మదిగా తెలుసుకొని అప్రమత్తమైంది. వెంటనే బోఫోర్స్ ‌శతఘ్నులతో రంగంలో• •దిగింది. కార్గిల్‌ ఆపరేషన్‌లో పరిస్థితిని మలుపు తిప్పిన ఒక అంశం భారత్‌ఆర్మీ, బోఫోర్స్ ‌శతఘ్నులు వాడటం. శ్రీనగర్‌, ‌లేహ రహదారిపై వారు బోఫోర్స్‌లను అమర్చారు. వాస్తవానికి ఆ రోడ్డునే పాక్‌ ‌దిగ్బంధించాలనుకుంది. బోఫోర్స్ ‌శతఘ్నులు పర్వత శిఖరాలను చిన్నచిన్న ముక్కలుగా పేల్చివేయగ, భారత వాయు సేన నిరంతరాయంగా పర్వతాలపై బాంబు దాడులు చేసింది’.

భార• •సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేసి, కార్గిల్‌ ‌వైపుగా వెళ్లే రహదార్లను మూసి వేసి పాక్‌ ‌సైన్యానికి, ముష్కరులకు ఏం వెళ్లకుండా చేసినట్లు నిరోధించ గలిగారు.. పాక్‌ ‌సైన్యం కార్గిల్‌ ‌కొండలనుంచి దిగుతున్నప్పుడు భారీ ప్రాణ నష్టం సంభవించిందని అధికారిక వర్గాలవెల్లడి. ‘’వారు తిరిగి రావడానికి దారిలేదు. వాహనాలూ లేవు. 16 వేలనుంచి 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల మధ్యలో గుంతలు ఉండటం, గడ్డకట్టేచలి, మరోవైప •కాచుకొని ఉన్న భారత ఆర్మీని తప్పించుకొని రావడం కష్టసాధ్యం అయింది. ఇదే సమయంలో కార్గిల్‌లో భారత ప్రభుత్వం వాయు సేనను సమర్థంగా వినియోగించుకుంది. నేలపై ఉన్న సైన్యానికి, వాయుసేన పూర్తి అండగా నిలువగా, భోఫోర్స్ ‌ఫిరంగుల గర్జనకు పాక్‌ ‌హడలిపోయింది. అలా సుమారు రెండు నెలలపాటు భారతసైన్యం మొక్కవోని దీక్షతో శత్రుసైన్యాన్ని మట్టి కరిపించి.. కార్గిల్లో తిరిగి మువ్వన్నెల జెండా ఎగురవేసింది. ఈ యుద్ధంలో 537 మంది జవాన్లు అమరులవ్వగా.. 1363 మంది క్షతగాత్రులయ్యారు. ప్రపంచచరిత్రలో కార్గిల్‌ ‌యుద్ధం ప్రత్యేకమైనది. ఇది పూర్తిగా పర్వతాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన యుద్ధం. వేల అడుగుల ఎత్తులో మన జవాన్ల మాదిరిగా యుద్ధం చేయడం అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాల సైనికులకు కూడా సాధ్యం కాదని స్పష్టమైంది. తర్వాతి కాలంలో పర్వత ప్రాంత యుద్ధం గురించి మన సైన్యం అమెరికా సైనికులకు శిక్షణ ఇచ్చారు. ఇదే సమయంలో పాక్‌ ‌తన తప్పు తెలుసుకుని యుద్ధం నుంచి తప్పుకుని ఉండకపోతే.. ఆ దేశం నామ రూపాలు లేకుండా పోయేదని ఇటీవల కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి.. ఒకానొక దశలో పాక్‌పై వైమానికదాడితో పాటు అణు దాడికి ప్రధాని వాజ్‌పేయి సిద్ధపడ్డారని అయితే చివరి నిమిషంలో దాయాది మనసు మార్చుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని నిపుణులు అంటూ ఉంటారు. ఏదేమైనా మనసైనిక ప్రతిభపాటవాలకు, యుద్ధ వ్యూహాలకు మచ్చుతునక కార్గిల్‌ ‌యుద్ధం. ప్రాణాలను పణంగాపెట్టి దేశాన్ని దుర క్రా మణ ను ంచి కాపా డిన సైని కులదే ఈ విజయం.. జైజవాన్‌.

Leave a Reply