Take a fresh look at your lifestyle.

డిమాండ్‌ ఉన్న పంటలు మాత్రమే వేయాలి : మంత్రి

సూర్యాపేట, మే 22, ప్రజాతంత్ర ప్రతినిధి) : వ్యవసాయాన్ని పండగలా మార్చి, రైతులకు అధిక లాభాలు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నియంత్రిత పంటల విధానాన్ని త్వరలో అమ లు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి  అన్నారు. శుక్రవారం జిల్లాలోని సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థా పన చేసి మాట్లాడారు. జిల్లా నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో 15కోట్ల వ్యయంతో సిసి రోడ్లను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. వానాకాలం సీజన్‌తో ప్రతి ఒక్క రైతుకి పెట్టుబ డి సహాయంగా రైతు బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. డిమాండ్‌లో ఉన్న పంటలను మాత్రమే రైతులు పండించాలని కోరారు. త్వరలో జిల్లా వ్యాప్తం గా అన్ని నియోజకవర్గాల్లో జిల్లా రైతు సమన్వ య సమితీల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. కరోనా వైరస్‌ ‌నేపధ్యంలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి తమ కార్యకలపాలాను నిర్వర్తించుకోవాలని కోరారు. కరోనా వైరస్‌ ‌పూర్తిగా పోలేదని, వైరస్‌ ‌పూర్తిగా నియంత్రించాలంటే అందరూ తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలని కోరారు. లాక్‌డౌన్‌తో జనజీవనం మెరుగుపడిందని, నిర్లక్ష్యంగా ఉంటే కరోనా కబలించే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌, ‌జెడ్పి చైర్‌పర్సన్‌ ‌గుజ్జ దీపికా యుగంధర్‌రావు, జెడ్పి వైస్‌ ‌చైర్మన్‌ ‌గోపగాని వెంకటనారాయణ గౌడ్‌, ‌వట్టె జానయ్య యాదవ్‌, ‌జెడ్పిటిసి బిక్షం, ఎంపిపి రవీందర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దాతల సహాయం అభినందనీయం
జిల్లాలో కరోనా వైరస్‌ ‌నేపధ్యంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ముందు ఉండి పేద ప్రజలకు తమ వంతు సాయం చేయడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో రీ న్యూ పవర్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థ యాజమాన్యం అందజేసిన 10లక్షల చెక్కు ను జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డికి మంత్రి అందజేసి మాట్లాడారు. కరోనా వైరస్‌ ‌నేపధ్యం లో జిల్లాలోని పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ వంతు సహయంగా పేద లకు నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, మంచినూనె, కారం, గోదమ పిండి, ఉల్లిగడ్డల ను అందజేయుటకు గాను 10లక్షల చెక్కును అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సంద ర్భంగా రీ న్యూ పవర్‌ ‌యాజమాన్యాన్ని అభినందించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy